ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చలేక కుమార్తెను.. | Father Assassinated Daughter Suicide Over Money Problems Karnataka | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చలేక కుమార్తెను..

Published Fri, Feb 25 2022 1:38 PM | Last Updated on Fri, Feb 25 2022 1:44 PM

Father Assassinated Daughter Suicide Over Money Problems Karnataka - Sakshi

బొమ్మనహళ్లి : ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తన ఏడేళ్ల కుమార్తెను హత్య చేసి తాను కూడా బలవన్మరణం చెందిన ఘటన బెంగళూరు నగర జిల్లా ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని బొమ్మసంద్రలో గురువారం చోటుచేసుకుంది. కోలారుకు చెందిన విజయ్‌ కుమార్‌ (37) భార్యతో కలిసి బొమ్మసంద్రలో నివాసం ఉంటున్నాడు.

వీరికి కుమార్తె సమీక్ష(7) ఉంది. గురువారం ఉదయం భార్య గార్మెంట్స్‌లో పనికి వెళ్లిన సమయంలో కుమార్తెను గొంతు నులిమి హత్య చేసి తాను కూడా ఉరి వేసుకున్నాడు. సాయంత్రం భార్య వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement