ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంతో తన ముక్కుపచ్చలారని ఇద్దరు కుమార్తెల ప్రాణం తీశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.
ఈ ఘటన డెహ్రాడూన్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని డోయీవాలా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ పిల్లల అమ్మమ్మ అల్లుని ఘాతుకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేశవ్‌పురి డోయివాలా నివాసి ఆశుదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన చిన్న కుమార్తె రీనాకు ఐదేళ్ల క్రితం జితేంద్రతో వివాహమయ్యిందని పేర్కొంది. తరువాత వారికి ఇద్దరు కుమార్తెలు కలిగారని, వారు ప్రస్తుతం పాలు తాగే వయసులో ఉన్నారని తెలిపింది.
జితేంద్ర తన భార్య రీనాను తరచూ కొడుతుండేవాడు. కొన్నాళ్ల పాటు ఆమె భర్త పెట్టే బాధలను భర్తిస్తూ వచ్చింది. కొంతకాలం తరువాత పిల్లలను తండ్రి వద్దనే వదిలేసి, రీనా హైదరాబాద్ వెళ్లిపోయింది. దీంతో జితేంద్ర మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీనికి పిల్లలు అడ్డు వస్తున్నారని భావించాడు. పిల్లలను అంతమెందించి మరో వివాహం చేసుకోవాలనుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లలకు అన్నం తినిపించి పడుకోబెట్టాడు. అర్థరాత్రి ఆ చిన్నారుల గొంతు నులిమి హత్య చేశాడు.
వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నారులు మృతి చెందివుండటాన్ని గుర్తించిన వారి అమ్మమ్మ డోయీవాలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు గురించి ఎస్‌ఎస్‌ఐ రితేష్ షా మాట్లాడుతూ మృతిచెందిన చిన్నారుల అమ్మమ్మ తన అల్లుడే ఈ హత్య చేశాడని ఆరోపిస్తున్నదని తెలిపారు. కాగా చిన్నారుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. నిందుతుని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అతనిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి: ఛాతీలో చాకు దిగబడి లివ్ ఇన్ పార్ట్‌నర్ మృతి..
Comments
Please login to add a commentAdd a comment