నిందితులు శైలజ, పునీత్
తుమకూరు: తన సంతోషానికి అడ్డుగా ఉందని ఒక కూతురు కన్నతల్లిని ప్రియునితో కలిసి హత్య చేసింది. కొరటిగెరె పట్టణంలోని సజ్జనర వీధిలో నివాసం ఉంటున్న సుమిత్ర (45) అనే మహిళ హతురాలు. సుమిత్రకు పెళ్లికాని కూతురు శైలజ ఉంది. శైలజకు సోదరుని వరసయ్యే దూరపుబంధువు పునీత్‌తో పరిచయం ఏర్పడి సంబంధంగా మారింది. ఇది తెలుసుకున్న సుమిత్ర పునీత్‌కు తమ ఇంటి ఛాయలకు రావద్దని హెచ్చరించింది.
తమకు తల్లి అడ్డుగా ఉందని భావించిన కూతురు శైలజ, పునీత్‌తో కలిసి జనవరి 30వ తేదీన రాత్రి తల్లిని గొంతు పిసికిచంపి ఇంటి ముందున్న సంపులో పడేశారు. మరుసటి రోజున అనుకోకుండా తల్లి సంపులో పడి చనిపోయిందని అందరికీ చెప్పి అంత్యక్రియలను జరిపించారు. కొరటిగెరె పోలీసులకు ఎవరో ఉప్పందించడంతో విచారణ జరపగా ఇద్దరూ నిజం ఒప్పుకున్నారు. దీంతో అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment