parking area
-
వియత్నాంలో ఘోర అగ్ని ప్రమాదం
హనోయి: వియత్నాం రాజధాని నగరం హనోయి ఘోర అగ్నిప్రమాదానికి నిలయంగా మారింది. హనోయిలో మంగళవారం రాత్రి తొమ్మిది అంతస్తుల భవంతి పార్కింగ్ ప్రాంతంలో మొదలైన అగి్నకీలలు వెనువెంటనే భవనం మొత్తాన్నీ చుట్టేశాయి. అత్యవసరంగా బయటపడే మార్గం ఈ భవనానికి లేదు. దీంతో తప్పించుకునే మార్గం కానరాక ఏకంగా 56 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. 37 మంది గాయపడ్డారు. 150 కుటుంబాలు నివసిస్తున్న ఈ భవనం ఇరుకైన దారిలో నిర్మించారు. దీంతో మంటలు ఆర్పే అగి్నమాపక సిబ్బంది భవనం దాకా చేరుకోలేకపోయారు. ఇరుకైన మార్గం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మంటలు అంటుకుంటాయనే భయంతో కొందరు భవనం మీద నుంచి కిందకు దూకారు. ఇలా గాయపడిన వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. పొగపీల్చడంతో ఇబ్బందులు పడుతున్న వారికీ చికిత్సచేస్తున్నారు. -
ఎంత కష్టం! కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో
జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ప్లాస్టిక్ కవర్లో ఆహారాన్ని తింటున్న వీడియో ఒకటి పోస్ట్ చేసి.. మన కడుపు నింపడం కోసం కడుపు మాడ్చుకుని పనిచేసే ఇలాంటి డెలివరీ బాయ్ ల యోగక్షేమాలు కూడా పట్టించుకోండని ఒక ఐఏఎస్ అధికారి నెటిజెన్లను కోరారు. క్షణాల్లో వైరల్ గా మారిన ఆ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. బాగా బిజీగా ఉన్న ఒక రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లో ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లిన జొమాటో డెలివరీ బాయ్ పార్సిల్ అందించిన తర్వాత అక్కడే పార్కింగ్ ఏరియాలో తన బైక్ వద్ద నిలబడి ప్లాస్టిక్ కవర్లో తన వెంట తెచ్చుకున్న ఆహారాన్ని కంగారుగా తింటున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. చూస్తుంటేనే హృదయం ద్రవించిపోయే ఈ సన్నివేశాన్ని అవనీశ్ శరణ్ అనే ఒక ఐఏఎస్ అధికారి ట్విట్టర్లో అప్లోడ్ చేయగా మూడు లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వీడియోతో పాటుగా.. "ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వారి గురించి కూడా కొంచెం పట్టించుకోండి.." అని రాశారు. इस मौसम में इनका भी ख्याल रखें. pic.twitter.com/Rf2kHs4srk — Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 20, 2023 ఈ వీడియోకు వీక్షకుల నుంచి కూడా అంతే స్థాయిలో స్పందించారు. అలాంటి వారికి మీకు తోచినది పెట్టి వారి కడుపు నింపమని, కనీసం గ్లాసు మంచి నీళ్ళైనా ఇచ్చి వారి గొంతు తడపమని అభ్యర్థిస్తున్నారు నెటిజన్లు. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరి జీవన విధానం తేలికైపోయింది. వైవిధ్యమైన, నోరూరించే ఆహారాల్లో ఏది కావాలంటే అది ఫోన్లో ఆర్డర్ పెడితే చాలు నచ్చిన ఐటమ్ నిముషాల్లో మన ముందు వాలిపోతుంది. కానీ దాని వెనుక ఇలాంటి ఎందరో శ్రామికుల కష్టం దాగుంది. కుటుంబ పోషణ కష్టమైన ఈ రోజుల్లో, వారు ఆకలికి ఓర్చుకుని ఎదుటివారి ఆకలిని తీరుస్తున్నారన్న విషయాన్ని మరువకూడదు. ఇది కూడా చదవండి: 106 ఏళ్ల వయసులో బంగారు పతకాలు సాధించిన బామ్మ -
పార్కింగ్ చేసిన కారునే చోరీ చేస్తున్నాడు
-
వాహనాలు అక్కడ పార్కింగ్ చేస్తున్నారా.. డబుల్ జరిమానా తప్పదు
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్, అమీర్‌పేట, కోఠి... ఇలా నగరంలోని అనేక వాణిజ్య ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆయా మార్గాల్లోని వర్తకులకు ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా అక్రమ పార్కింగ్స్, ఇబ్బందికర పార్కింగ్ తప్పట్లేదు. ఫలితంగా రద్దీ వేళల్లో ఆయా మార్గాల్లో వాహనచోదకులు నరకాన్ని చవి చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సిటీ ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాలను ట్రాఫిక్ పరంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని నిర్ణయించారు. ఈ ఏరియాల్లో పార్కింగ్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనచోదకులకు రెట్టింపు జరిమానా విధించడంతో పాటు ఆయా దుకాణాలు, వ్యాపార సంస్థల నిర్వాహకులపై చర్యలకు మార్గాలు అన్వేషిస్తున్నామని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం వెల్లడించారు. వర్తక, వ్యాపార సముదాయాలు, దుకాణాల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్న ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా (కంజెషన్ జోన్) గుర్తించాలని నిర్ణయించారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా పక్కా సాంకేతికంగా వీటిని మార్క్ చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న అక్రమ పార్కింగ్, ఇబ్బందికర పార్కింగ్‌పై అనునిత్యం ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రాంతాల్లో ఇలాంటి పార్కింగ్స్కు పాల్పడిన ఉల్లంఘనులకు ఇతర ప్రాంతాల్లో విధించే జరిమానాకు రెట్టింపు వేయాలని యోచిస్తున్నారు. ఫలితంగా వారిలో మార్పునకు ప్రయత్నాలు చేయనున్నారు. నో పార్కింగ్, ఇబ్బందికర పార్కింగ్‌లను ప్రస్తుతం వేరుగా చూడట్లేదు. ఈ కారణంగా జమానాల్లోనూ మార్పులు లేవు. అయితే సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు పూర్తయిన తర్వాత ఆ రెంటికీ వేర్వేరుగా జరిమానాలు విధించనున్నారు. నో పార్కింగ్ కంటే ఇబ్బందికర పార్కింగ్‌కు ఎక్కువ మొత్తం ఉండనుందని సమాచారం. ఇప్పటి వరకు పార్కింగ్ ఉల్లంఘనపై కేవలం వాహనచోదకులకే జరిమానా పడుతోంది. అయితే వీరితో పాటు ఆయా వ్యాపార సంస్థలు, దుకాణాల నిర్వాహకులనూ బాధ్యులను చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం నిర్వాహకులపై చర్యలకు ఆస్కారం లేదు. సిటీ పోలీసు యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినా నామమాత్రపు జరిమానాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులపై చర్యలకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న ఇలాంటి పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా! -
అగ్నికి ఖరీదైన కార్ల ఆహుతిపై ఫిర్యాదు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని హైదరాబాద్ జింఖానా క్లబ్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పార్కింగ్ స్థలంలో ఖరీదైన కార్లు దగ్ధమయ్యాయని బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఫిర్యాదుతో జూబీహిల్స్ పోలీసులు జింఖానా క్లబ్ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించారు. శుక్రవారం సాయంత్రం క్లబ్ పార్కింగ్ స్థలంలో ఓ కారుకు మంటలు అంటుకున్నాయి. ఆ కారుకు అటూ ఇటూ రేంజ్‌రోవర్, కియా, మహీంద్రాథార్ కార్లు పార్కింగ్‌చేసి ఉన్నాయి. కారు అంటుకుందని క్లబ్ వ్యాలెట్ సిబ్బందికి చెప్పగా వారు నిర్లక్ష్యంతో ఆలస్యంగా ఘటన స్థలానికి చేరుకోవడంతో అప్పటికే మూడు కార్లకు మంటలు వ్యాపించాయి. ఒక కారును సకాలంలో బయటికి తీసి ఉంటే చుట్టూ ఉన్న మరో రెండు కార్లను బయటికి తీసుకురావడానికి అవకాశం ఉండేదని అలా కాకుండా తీవ్ర జాప్యం చేయడంతో నాలుగు కార్లు కాలిపోయాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కనీసం పార్కింగ్ స్థలంలో సీసీ కెమెరాలు కూడా లేకుండాపోయాయని మంటలను ఆర్పే పరికరాలు కూడా అక్కడ సిద్ధంగా లేవని గుర్తించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
మాటలకే పరిమితమైన మల్టీలెవెల్ పార్కింగ్!!
సాక్షి హైదరాబాద్: గ్రేటర్ నగరంలో వాహనాల సాఫీ ప్రయాణానికి ఫ్లైఓవర్లు, లింక్‌రోడ్లు వంటివి నిర్మిస్తున్నప్పటికీ పార్కింగ్ సదుపాయాలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నివారణ కోసం వాణిజ్య ప్రాంతాల్లో మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఏళ్ల తరబడి చెబుతున్నప్పటికీ, ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. నగరంలో దాదాపు వంద ప్రాంతాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ, ఒక్కచోట కూడా అందుబాటులోకి రాలేదు. నాలుగేళ్ల క్రితమే.. దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్ లాట్ల ఏర్పాటుకు ముందుకొచ్చేవారిని ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ వెలువరించారు. అయినా స్పందన లేకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అనంతరం.. రెండేళ్ల క్రితం వాణిజ్య స్థలాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాట్లు చేసే సాంకేతిక సామర్థ్యం కలిగిన వారికి.. ప్రైవేట్ స్థలాలున్న యజమానులకు మధ్య ఒప్పందం కుదిర్చే బాధ్యతను తీసుకోవాలని జీహెచ్ఎంసీ భావించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాల్లోని మల్టీ పార్కింగ్ విధానాలను సేకరించాలని, కువైట్‌కు చెందిన కేజీఎల్ ఏజెన్సీ నుండి మల్టీలెవల్ పార్కింగ్ నిబంధనలను తెప్పించుకోవాలని కమిషనర్ లోకేశ్‌కుమార్ అధికారులకు సూచించారు. పార్కింగ్ కోసం స్థలాలిచ్చేందుకు ముందుకొచ్చేవారి వివరాలను ప్రభుత్వానికి నివేదించి నియమ నిబంధనల అమలును జీహెచ్ఎంసీ మానిటరింగ్ చేయాలని భావించారు. కానీ ఇప్పటి వరకూ ముందడుగు పడలేదు. మొబైల్ యాప్‌లో వివరాలు.. మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాట్లు చేయడం ద్వారా పార్కింగ్ సదుపాయం తదితర వివరాలు వాహనదారులకు తెలిసేలా ప్రత్యేక యాప్‌ను రూపొందించాలనుకున్నారు. అంతేకాదు.. అవసరమైతే సదరు యాప్ నిర్వహణను గూగుల్ వంటి సంస్థలకు అప్పగించాలనుకున్నా రు. ఆలోచనలు బాగానే ఉన్నప్పటికీ, అమలుకు మాత్రం నోచుకోలేదు. మరోవైపు, పబ్లిక్ పార్కింగ్ కోసం ప్రభుత్వ శాఖలకు చెందిన ఇరవై స్థలాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాట్లకు హెచ్ఎంఆర్ఎల్కు బాధ్యతలప్పగించినా ఏర్పాటు కాలేదు. (చదవండి: worlds longest name: ఎంత పె...ద్ద.. ‘పేరు’!) -
స్థానిక మహిళతో వివాహం.. రాత్రి పూట బయటి కాలనీల్లో తిరుగుతూ..
సాక్షి, హైదరాబాద్: రాత్రి పూట రెక్కీ నిర్వహిస్తారు. పార్కింగ్ చేసిన కార్లను అపహరిస్తారు. రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయిస్తారు. ఈ అంతర్రాష్ట్ర ఆటోమొబైల్ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ముఠాలోని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.50 లక్షల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మల్కాజిగిరి డీసీపీ రక్షితకే మూర్తి, డీసీపీ క్రైమ్స్ యాదగిరిలతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ► మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఉదయ్ మారుతీ పాటిల్, ఫర్మాల్ అలీఖాన్, ఇమ్రాన్ ఖాన్ పఠాన్, సోహ్రబ్ అలీ, యెవరుల్లా ఖాన్, సంతోష్ జగన్నాథ పవార్ ముఠాగా ఏర్పడ్డారు. ఇమ్రాన్ ఖాన్ పఠాన్ (36) కుషాయిగూడ హెచ్‌బీ కాలనీలో స్థానికంగా ఓ మహిళను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటున్నాడు. ► రాత్రిపూట కాలనీల్లో తిరుగుతూ బయట కార్లు ఎక్కడ పార్క్ చేశారు? కెమెరాలు ఉన్నాయా? రాత్రి వేళల్లో జన సంచారం ఉంటుందా? వంటి వాటిపై రెక్కీ నిర్వహించి.. సమాచారాన్ని మహారాష్ట్రల్లోని తన గ్యాంగ్‌కు చేరవేస్తాడు. ► సమాచారం అందుకున్న ఉదయ్ మారుతీ పాటిల్ ప్లాన్ చేసి.. అనుచరులను రంగంలోకి దింపుతాడు. ఇమ్రాన్‌ఖాన్ సూచించిన ప్రాంతంలో రాత్రికి వెళ్లి కార్‌ను చోరీ చేస్తారు. ► మారుతీ స్విఫ్ట్, హోండా ఐ 10, అమేజ్ కార్లను మాత్రమే వీళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. రిపేరు లేదా స్క్రాప్‌లో వచ్చిన కార్ల నంబర్ ప్లేట్లను తీసుకొని అలాంటి రంగు ఉండే కార్లనే చోరీ చేస్తారు. వాటికి అసలు కార్ నంబర్ ప్లేట్‌ను తగిలించి కస్టమర్‌కు విక్రయిస్తారు. ► వీళ్ల ప్రత్యేక మెకానిజం కారణంగా కార్ డోర్‌ను ఓపెన్ చేసినప్పుడు అలారం కూడా మోగదు. కారు డోర్‌ను ఓపెన్ చేసి నకిలీ తాళం చెవితో స్టార్ట్ చేసి రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తరలిస్తారు. అక్కడికి వెళ్లాక కారు ఇంజిన్, చాసిస్ నంబర్లను మార్చేస్తారు. ఒక్కో కారుకు రూ.2 లక్షల నుంచి 3 లక్షల లాభం చూసుకొని విక్రయిస్తుంటారు. ► ఈ గ్యాంగ్ ఐదేళ్లుగా వేర్వేరు రాష్ట్రాల్లో చోరీలు చేస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ, ఏపీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 50కి పైగా కార్లను చోరీ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ► ఇద్దరు నిందితులు ఇమ్రాన్‌ఖాన్ పఠాన్, సంతోష్ జగన్నాథ పవార్లను కస్టడీకి తీసుకొని లోతుగా విచారణ చేస్తే అసలు ఎన్ని కార్లు దొంగిలించారు? ఎవరెవరికి విక్రయించారో బయటపడుతుందని మల్కాజిగిరి డీసీపీ రక్షిత కే మూర్తి తెలిపారు. చదవండి: నాలుగేళ్ల క్రితం వివాహం.. పురుగులమందు తాగిన వివాహిత -
బిర్యానీకి వెళ్తే రూ.2 లక్షలు మాయం
సాక్షి, శివాజీనగర (కర్ణాటక): హోటల్లో బిరియానీ తినేందుకు వెళ్లిన ఆటో డ్రైవర్ రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. బ్యాడరహళ్ళిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. ఆటోడ్రైవర్ హనుమంతరాయ కుటుంబ అవసరాల కోసం బ్యాంక్‌లో బంగారు నగలు పెట్టి రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. దానిని బైక్ సైడ్ బాక్సులో పెట్టుకొని బావమరిదితో కలసి ఇంటికి వెళుతున్నాడు. దారిలో బిరియాని హోటల్ వద్ద బైక్ ఆపి ఇద్దరూ వెళ్లి ఆరగించారు. వచ్చి చూడగా బాక్సులోని నగదు మాయమైంది. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి డబ్బులు తీసుకెళ్లినట్లు రికార్డయింది. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగ కోసం గాలిస్తున్నారు. -
పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్, ప్రారంభించిన పేటీఎం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం తాజాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో కలిసి ఫాస్టాగ్ ఆధారిత పార్కింగ్ సర్వీసులు ప్రారంభించింది. వీటిని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) తెలిపింది. కష్మీర్ గేట్ మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ తరహా విధానంలో ఫాస్టాగ్ స్టికర్ గల కార్లు.. పార్కింగ్ ఏరియాలోకి వచ్చినప్పుడు నగదు చెల్లించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదని వివరించింది. ఇక ద్విచక్ర వాహనాల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపుల విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పీపీబీఎల్ తెలిపింది . చదవండి: ‘ఫాస్ట్’గా దోచేస్తున్నారు.. -
అయ్యయ్యో.. మనిషితో సహా బైక్‌ని ఎత్తి వ్యాన్‌లో వేశారు
పుణె: నాన్ పార్కింగ్ జోన్లలో నిలిపిన వాహనాలను ట్రాఫిక్ సిబ్బంది క్రేన్ సాయంతో తొలగించే ఘటనలను చూసే ఉంటాం. తాజాగా పుణెలో నాన్ పార్కింగ్ జోన్లో నిలిపిన వాహనాన్ని కూడా ఇలానే క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇక దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్ పాటించని వాహనాలను తొలగిస్తే.. నెటిజనులు ఎందుకు కోప్పడటం అంటే.. ఆ వాహనం మీద ఓ మనిషి కూడా ఉన్నాడు. ఇరువురుని క్రేన్ సాయంతో వ్యాన్‌లో ఎక్కించి అక్కడ నుంచి తీసుకెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. మహారాష్ట్ర, నానాపేఠ్ ప్రాంతంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. నాన్ పార్కింగ్ జోన్లో నిలిపి ఉంచిన బైక్‌ను క్రేన్ సాయంతో పక్కకు తరలించమని ఉన్నతాధికారి తన సిబ్బందిని ఆదేశించాడు. ఇంతలో బైక్ యజమాని వచ్చి.. వారిని అడ్డుకున్నాడు. ఏకంగా బైక్ మీద ఎక్కి కూర్చున్నాడు. బండి మీద నుంచి దిగమని ఆదేశించినప్పటకి అతడు వినలేదు. ఆగ్రహించిన ట్రాఫిక్ పోలీసులు మనిషితో సహా బైక్‌ను కూడా క్రేన్ సాయంతో ఎత్తి వ్యాన్‌లో దించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్కావడంతో నెటిజనులు ట్రాఫిక్ పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్త చేశారు. దీనిపై ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. అతడిని బైక్ మీద నుంచి దిగమని కోరాం. కానీ వినలేదు. అందుకే ఇలా చేశాం. ఆ తర్వాత అతడు ఫైన్ కట్టి బండిని తీసుకెళ్లాడు. ఇక ఈ చర్యకు పాల్పడ్డ సిబ్బందిపై చర్యలకు ఆదేశించాం అని తెలిపారు. -
మెట్రో స్టేషన్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు
-
మెట్రో ట్రాఫిక్ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాలు తొలగిస్తుందని భావించిన మెట్రో రైలు నగరవాసులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. చాలా స్టేషన్లలో పార్కింగ్ వసతి లేకపోవడంతో ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. స్టేషన్ కింది భాగంలో వాహనాలను అస్తవ్యస్తంగా పార్క్ చేస్తుండటంతో రోడ్లపై ట్రాఫిక్ స్తంభిస్తోంది. అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ వద్ద గురువారం వాహనాలను ఇష్టమొచ్చినట్టుగా పార్క్ చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను అక్కడి నుంచి తరలించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే అమీర్‌పేట స్టేషన్లో పార్కింగ్ వసతి కల్పించకపోవడం పట్ల జనం మండిపడుతున్నారు. చాలీస్ కమాన్ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తామని నిర్ణయించినా, ఇంకా అమల్లోకి రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మెట్రో సిబ్బంది చెబుతున్నారు. చాలా స్టేషన్లలో వాహనాలు నిలిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సివస్తోంది. పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం లేదు. నాగోల్, ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ, తార్నాక స్టేషన్లలో ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండగా.. కార్లు, బస్సులు, క్యాబ్స్ నిలిపేందుకు స్థలం లేదు. కొన్ని స్టేషన్లలో నిర్మాణ పనులు ఇంకా జరుగుతుండటంతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ఇబ్బందులు తొలగిపోతాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పార్కింగ్ చార్జీలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మెట్రోరైలు ప్రయాణ చార్జీలు ఎక్కువేమీ లేవని ఆయన చెప్పారు. -
పార్క్ చేసిన బస్సులు దగ్ధం
హైదరాబాద్: పార్కు చేసి ఉంచిన కళాశాల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి రెండు బస్సులు కాలిపోయాయి. మియాపూర్ జనప్రియ అపార్టుమెంట్ల సమీపంలో ఈ ఘటన జరిగింది. అక్కడి ఖాళీ స్థలంలో వివిధ విద్యా సంస్థలకు చెందిన బస్సులను పార్క్ చేసి ఉంచుతుంటారు. అయితే, శుక్రవారం సాయంత్రం ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పక్కనున్న మరో బస్సుకు అంటుకున్నాయి. అక్కడే ఉన్న డ్రైవర్లు మిగతా బస్సులను వెంటనే అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఫైర్ సిబ్బంది వచ్చి రెండు బస్సుల మంటలను ఆర్పివేశారు. ఎవరైనా సిగరెట్ తాగి అక్కడ పడవేసి ఉంటారని అదే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఆ సమయంలో విద్యార్థులెవరూ బస్సులో లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.