పార్క్ చేసిన బస్సులు దగ్ధం
Published Fri, Nov 11 2016 4:26 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
హైదరాబాద్: పార్కు చేసి ఉంచిన కళాశాల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి రెండు బస్సులు కాలిపోయాయి. మియాపూర్ జనప్రియ అపార్టుమెంట్ల సమీపంలో ఈ ఘటన జరిగింది. అక్కడి ఖాళీ స్థలంలో వివిధ విద్యా సంస్థలకు చెందిన బస్సులను పార్క్ చేసి ఉంచుతుంటారు. అయితే, శుక్రవారం సాయంత్రం ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పక్కనున్న మరో బస్సుకు అంటుకున్నాయి. అక్కడే ఉన్న డ్రైవర్లు మిగతా బస్సులను వెంటనే అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఫైర్ సిబ్బంది వచ్చి రెండు బస్సుల మంటలను ఆర్పివేశారు. ఎవరైనా సిగరెట్ తాగి అక్కడ పడవేసి ఉంటారని అదే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఆ సమయంలో విద్యార్థులెవరూ బస్సులో లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
Advertisement
Advertisement