
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ జనప్రియ నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించి మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం సెలవు దినం కావడంతో జనప్రియ స్కూల్‌కు చెందిన బస్సులన్నిటినీ పాఠశాల ఆవరణలో ఒకేచోట నిలిపి ఉంచారు. ఎలా జరిగిందో కానీ అగ్నిప్రమాదం సంభవించి వీటిల్లోని మూడు బస్సులు దగ్ధమయ్యాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సిగరెట్ తాగి పడేయడం వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నారు. కాగా, గత ఏడాదికూడా ఇదేవిధంగా పాఠశాలకు చెందిన రెండు బస్సులు దగ్ధం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment