హనోయి: వియత్నాం రాజధాని నగరం హనోయి ఘోర అగ్నిప్రమాదానికి నిలయంగా మారింది. హనోయిలో మంగళవారం రాత్రి తొమ్మిది అంతస్తుల భవంతి పార్కింగ్ ప్రాంతంలో మొదలైన అగి్నకీలలు వెనువెంటనే భవనం మొత్తాన్నీ చుట్టేశాయి. అత్యవసరంగా బయటపడే మార్గం ఈ భవనానికి లేదు. దీంతో తప్పించుకునే మార్గం కానరాక ఏకంగా 56 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. 37 మంది గాయపడ్డారు.
150 కుటుంబాలు నివసిస్తున్న ఈ భవనం ఇరుకైన దారిలో నిర్మించారు. దీంతో మంటలు ఆర్పే అగి్నమాపక సిబ్బంది భవనం దాకా చేరుకోలేకపోయారు. ఇరుకైన మార్గం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మంటలు అంటుకుంటాయనే భయంతో కొందరు భవనం మీద నుంచి కిందకు దూకారు. ఇలా గాయపడిన వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. పొగపీల్చడంతో ఇబ్బందులు పడుతున్న వారికీ చికిత్సచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment