ట్రాఫిక్ కష్టాలు తొలగిస్తుందని భావించిన మెట్రో రైలు నగరవాసులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. చాలా స్టేషన్లలో పార్కింగ్ వసతి లేకపోవడంతో ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. స్టేషన్ కింది భాగంలో వాహనాలను అస్తవ్యస్తంగా పార్క్ చేస్తుండటంతో రోడ్లపై ట్రాఫిక్ స్తంభిస్తోంది.