Octopus Steals Australian Diver's GoPro Camera Goes Viral - Sakshi
Sakshi News home page

కెమెరా లాక్కున్న ఆక్టోపస్‌..ఇచ్చేదే లే! అంటూ యుద్ధమే చేసింది

Published Mon, Jul 10 2023 2:42 PM | Last Updated on Sat, Jul 15 2023 11:13 AM

Octopus Steals Australian Diver's GoPro Camera Goes Viral - Sakshi

ఆక్టోపస్‌లకు సంబంధించిన విషయాలు కాస్త ఆసక్తికరంగానే ఉంటాయి. అవి ఏ వస్తువునైన వాటి కాళ్లతో గట్టిగా అదిమ పట్టేస్తాయి. అలానే ఓసారి ఒక అమ్మాయి..ఆక్టోపస్‌ని పట్టుకుని సరదాగా కామెడీ చేయబోగా ఏకంగా తన ముఖాన్నే గట్టిగా పట్టకుని..ఆ అమ్మాయిని ఏడిపించేసిన ఘటన తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ఓ యువకుడిని ఇబ్బంది పెట్టింది. 

15 ఏళ్ల జెస్సీ లోఫెల్‌ జెర్విస్ బోడెరీ నేషనల్‌ పార్క్‌లోని న్యూసౌత్‌ వేల్స​ తీరంలో స్నార్కెలింగ్‌(నీటి అడుగున ఈత కొట్టడం) చేస్తున్నాడు. నీటి అడుగున ఉండే అందాలను తన ప్రో కెమరాతో చక్కగా బంధిస్తున్నాడు. ఇంతలో అక్కడే సంచరిస్తున్న ఆక్టోపస్‌ని చూసి..దానికి దూరం నుంచే షూట్‌ చేస్తున్నాడు. ఇంతలో అది సడెన్‌ ఆ యువకుడి ప్రో కెమెరాను లాక్కుంది. దానికి ఉండే సెల్ఫీ స్టిక్‌ని గట్టిగా పట్టుకుని ఆ కెమారాను లాక్కుంది. దీంతో అతడికి ఏం చేయాలో తోచలేదు. కాసేపు దాని నుంచి ఆ కెమెరాను లాక్కునేందుకు చాలాసేపు ట్రై చేసి..చివరికి వదిలేశాడు.

ఆ తర్వాత అక్కడే నీటి అడుగున స్నార్కెలింగ్‌ చేస్తూ ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్‌ మేరీ క్లౌట్‌ని సంప్రదించాడు. దీంతో ఇద్దరు కలిసి అదే స్థానంలో నీటి అడుగుకి వెళ్లేటప్పటికి అదృష్టవశాత్తు ఆ ఆక్టోపస్‌ అక్కడే ఉంది. దీంతో క్లౌట్‌ కెమెరా తీసేందుకు యత్నించాడు. ఐతే ఆక్టోపస్‌ కెమెరాను వదిలే మూడ్‌లో లేదు. అది ఆ కెమెరాను చాలా గట్టిగా పట్టుకుంది. ఏం చేసిన వదలటం లేదు. చివరికి క్లౌట్‌ ఆ సెల్ఫీ స్టిక్‌తోనే ఆక్టోపస్‌ని పైకి లాగి విదిలించడంతో అది ఇక ఇవ్వక తప్పదన్నట్లు.. వదిలేసి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన అమేజింగ్‌ వీడియో నెట్టింట వైరల్‌ తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: చిట్టడవిలో ఓ భూత్‌బంగ్లా..లోపలికి అడుగుపెడితే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement