రెండు రైళ్లు ఢీకొని, 31 మంది మృతి | At least 31 dead in Iran train crash | Sakshi
Sakshi News home page

రెండు రైళ్లు ఢీకొని, 31 మంది మృతి

Published Fri, Nov 25 2016 5:31 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

At least 31 dead in Iran train crash

టెహ్రాన్‌: ఇరాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను మరో రైలును ఢీకొన్న సంఘటనలో కనీసం 31 మంది మరణించగా, మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు.

శుక్రవారం సెమ్నన్‌ ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన జరిగినట్టు గవర్నర్‌ మహ్మద్‌ రెజా ఖబాజ్‌ తెలిపారు. మరణించిన 31 మందిని గుర్తించామని, క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement