రోమ్: ఇటలీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 20 మంది మరణించగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఇటలీ దక్షిణప్రాంతంలో కొరాటో, ఆండ్రియా పట్టణాల మధ్య ఒకే రైలు మార్గంలో ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు రైళ్ల ఇంజిన్లు, కొన్ని బోగీలు ధ్వంసమయ్యాయి. ఇంజిన్లు తుక్కుతుక్కయ్యాయి. ఈ భాగాలు రైల్వే ట్రాక్ ఇరువైపులా కొద్దిదూరం ఎగిరిపడ్డాయి.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదస్థలికి అంబులెన్స్లను, ఫైరింజన్లను తరలించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఇటలీ ప్రధాని రెంజీ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
రెండు రైళ్లు ఢీకొని 20 మంది మృతి
Published Tue, Jul 12 2016 6:12 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM
Advertisement
Advertisement