Techinical problem
-
ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!
IRCTC down: ఐఆర్సీటీసీ వినియోగదారులకు చేదు అనుభవం ఎదురైంది. అధికారిక వెబ్సైట్, యాప్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు సమస్యలపై యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన, ఫిర్యాదులు స్క్రీన్షాట్లతో సోషల్ మీడియా హోరెత్తితింది. దీనిపై ఐఆర్సీటీసీ స్పందించింది. ప్లాట్‌ఫారమ్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడయ్యాని, వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్‌ల కోసం కేటాయించిన స్లాట్లతో టైమింగ్ క్లాష్ అవ్వడంతో వినియోగదారులు మరింత ఇబ్బంది పడ్డారు. ఏసీ (2A/3A/CC/EC/3E) తత్కాల్ బుకింగ్ ఉదయం 10:00 గంటలకు, నాన్-AC తరగతికి (SL/FC/2S) ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతాయి. దీంతో దాదాపు ఉదయం 8 గంటలనుంచే చెల్లింపులకు సంబంధించిన సమస్యల గురించి కూడా ఫిర్యాదులు మొదలైనాయి. "సాంకేతిక కారణాల వల్ల టికెటింగ్ సేవ అందుబాటులో లేదు. మా సాంకేతిక బృందం సమస్యను పరిష్కరిస్తోంది. సాంకేతిక సమస్య పరిష్కరించబడిన వెంటనే మేము తెలియజేస్తాము." ఐఆర్సీటీసీ ట్వీట్లో తెలిపింది. అలాగే ప్రత్యామ్నాయంగా అమెజాన్, మేక్మైట్రిప్ తదితర B2C ప్లేయర్ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చుని తెలిపింది. Not able to tatkal booking ticket... Facing some error in #IRCTC app... Please dot the something... I have emergency to back to my home...@IRCTCofficial @RailwaySeva#railways — Vijay Arya (@Im_vijayarya) July 25, 2023 #irctc As usual down ... Can't book tickets Two times banking transactions failed.... Waiting for refund and no further booking @AshwiniVaishnaw@RailwaySeva @RailMinIndia pic.twitter.com/TOPJdXiuy8 — Dhimant Bhatt (@dhimantbhatt) July 25, 2023 కాగా ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా 5 కోట్ల రెగ్యులర్ యూజర్లు ప్రతీ రోజూ సైట్ లో టికెట్ బుక్ చేసుకునే వారి సంఖ్య 20 లక్షలకు పైనే ఉంటారని అంచనా. Due to technical reasons, the ticketing service is not available on IRCTC site and App. Technical team of CRIS is resolving the issue.Alternatively tickets can be booked through other B2C players like Amazon, Makemytrip etc.— IRCTC (@IRCTCofficial) July 25, 2023 -
Odisha Train Crash: ఇది సాంకేతిక సమస్య? మానవ తప్పిదమా?..
ఒడిశాలో శుక్రవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలు, లోపాలు గురించి పలు ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీ కొట్టిన కోరమాండల్ ప్యాసింజర్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీన్ని మరోక రైలు యశ్వంత్‌పూర్ హౌరా సూపర్ ఫాస్ట్ పట్టాలు తప్పిన బోగీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అసలు ఇదే ఎలా జరిగిందనే దానిపై పలు అనుమానాలకు లెవనెత్తాయి. ఈ మేరకు ఈ ప్రమాదానికి గల కారణాలపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. వెంటవెంటనే రైళ్లు ఎలా ఢీ కొన్నాయి. అదే ప్రదేశంలో ఎలా జరిగిందనే దానిపై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. అదీగాక గూడ్స్ రైలు ఆగి ఉన్న ట్రాక్‌లోనే కోరమాండల్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్ స్టేషనరీ గూడ్స్ రైలు ఎలా ఉందనేది పలు సందేహాలకు దారితీసింది. ఒకవేళ ఇది సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అనేది సందేహాస్పదంగా ఉంది. సిగ్నల్ లోపమే.. ఈ ఘటనతో రైల్వే మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా యాంటీ కొలిజన్ సిస్టమ్ కవాచ్ని ఇన్స్టాల్ చేసే ప్రక్రియలో ఉంది. రైలు ఢీ కొనడానికి ప్రధాన కారణం అయిన సిగ్నల్(సిగ్నల్ పాస్డ్ ఎట్ డేంజర్ ఎస్పీఏడీ) ఉన్నప్పుడూ ఈ కవాచ్ హెచ్చరిస్తుంది. ఈ సిస్టమ్ రైలు డ్రైవర్ని అప్రమత్తం చేయగలదు, బ్రేక్‌లను నియంత్రించగలదు. అదే సమయంలో ట్రాక్‌పై రైలుని గమనించి వెంటనే రైలుని ఆపగలదు కూడా. అయితే ప్రమాదం జరిగిన మార్గంలో కవాచచ్ అందుబాటులో లేదని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ అన్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యంత ప్రభావితమైన భాగాలు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, సాధారణంగా సెలవు దినాల కావడంతో వాటిల్లో అత్యంత రద్దీగా ఉంటుంది. రిజర్వ్ చేయని ప్రయాణికులు కూడా ప్రవేశిస్తారు. అందువల్ల గుర్తు తెలియని వారి మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండొచ్చని రైల్వే శాఖ పేర్కొంది. మరోవైపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఘటన స్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులోనే తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటనపై నిపుణుల విచారణ కమిటీపి నియమించనున్నట్లు తెలిపారు. (చదవండి: లెక్క తేలని మరణాలు!.. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే) -
సాంకేతిక లోపంతో ఆగిపోయిన ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్
-
పాకిస్తాన్ పై భారత్ క్షిపణి ప్రయోగం... ప్రమాదవశాత్తు జరిగిందని వివరణ
Defence Ministry said Technical Malfunction: భారత్ ప్రమాదవశాత్తు పాకిస్థాన్‌పైకి క్షిపణిని ప్రయోగించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్షిపణి పాకిస్తాన్లో ల్యాండ్ అవ్వడానికి ముందు గగనతలంలో సుమారు 100 కి.మీ పైగా వేగంతో దాదాపు 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని పేర్కొంది. సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరింగిందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ క్షిపణి మార్చి 9, 2022న, సాధారణ నిర్వహణ సమయంలో, సాంకేతిక లోపం కారణంగా ప్రమాదవశాత్తూ ఈ క్షిపణి పేలిందని రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. అంతేకాదు భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఇస్లామాబాద్‌లోని భారత్ ఛార్జ్ డి'అఫైర్స్‌ను పిలిపించి భారత్‌కి చెందిన సూపర్-సోనిక్ ఫ్లయింగ్ క్షిపణి సూరత్‌గఢ్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశించిందని తెలిపింది. ఈ చర్యను గగనతలంలో అకారణ ఉల్లంఘనగా పేర్కొంటూ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు ఇలాంటి చర్యల వల్ల పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అందువల్ల ఈ ఘటనపై భారత్ సత్వరమే విచారణ జరపాలని పాకిస్థాన్ కోరింది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ భారత్‌ను హెచ్చరించింది. అంతేకాదు ఈ క్షిపణి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్ చున్ను నగరం సమీపంలో సాయంత్రం 6:50 గంటల సమయంలో కూలిందని తెలిపింది. దీని వలన పౌర ఆస్తులకు నష్టం వాటిల్లిందని కూడా పేర్కొంది. (చదవండి: ఉగ్రవాదుల ఏరివేత.. జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్) -
విద్యార్థులు బలిపశువులు కారాదు!
సాంకేతిక సమస్య కారణంగా గడువుతేదీ లోపు ఫీజు చెల్లించలేకపోయిన ఒక దళిత విద్యార్థికి తప్పకుండా సీటు కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవలే కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఫీజు చెల్లింపు విషయంలో బ్యాంకు నుంచి జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఆ విద్యార్థిని బలిపశువును చేయవద్దంటూ సుప్రీంకోర్టు అసాధారణ వ్యాఖ్య చేయడం గమనార్హం. విద్యార్థి భవిష్యత్తు విషయంలో శిలాసదృశంగా ఉండొద్దని, కాస్త మానవీయ దృష్టితో వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం హితవు చెప్పింది. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం నుంచి కోర్సు ముగింపు వరకు తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొం టున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఈ తీర్పు ఒక ఆశా కిరణమై నిలిచింది. ఉన్నత విద్యను ఆశించి, అష్టకష్టాలు పడి సీటు సాధించి, ఉద్యోగ జీవితంలో కూడా వివక్ష పాలవుతున్న వెనుకబడిన వర్గాల పిల్లలకు... ప్రిన్స్, అతడి తండ్రి సాగించిన పోరాటం నిజంగానే స్ఫూర్తిదాయకం అవుతుంది. పద్దెనిమిదేళ్ల దళిత కుర్రాడు ప్రిన్స్ జైబీర్ సింగ్‌కి 48 గంటలలోపు బాంబే ఐఐటీలో ప్రవేశం కల్పించాలని, సుప్రీంకోర్టు ఇటీవలే అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిష్ఠా త్మక ఐఐటీలో చేరడానికి ఫీజు చెల్లింపు విషయంలో బ్యాంకు నుంచి జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఈ విద్యార్థి గడువుతేదీ లోగా ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో అతడికి ప్రవేశార్హత లేదని అధికారులు ప్రకటించారు. తన ప్రమేయం లేకుండా జరిగిన ఒక సాంకేతిక తప్పిదానికి ఆ కుర్రాడి భవిష్యత్తు పట్ల అమానవీయ దృష్టితో వ్యవహరించడం తగదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ సమస్య మానవీయ కోణానికి సంబంధించింది కాబట్టి నియమనిబంధనలను శిలాసదృశంగా పాటించకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైనందున ఆ విద్యార్థికి ప్రవేశం కల్పించడం చెడు పరిణామాలకు దారి తీస్తుందని బాంబే ఐఐటీ అధికారులు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాను చేయని తప్పుకు ఆ విద్యార్థిని బలిపశువును చేయవద్దని, ఒక యువకుడి భావి జీవితానికి సంబంధించిన ఈ విషయంలో వీలైనంత సహాయం చేసి అతడికి మేలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో భారత పీడిత ప్రజానీకంలో మన న్యాయవ్యవస్థ కాస్త ఆశలు నిలిపినట్లయింది. ఐఐటీ బాంబేలో తన స్థానంకోసం ప్రిన్స్ అనే పేరున్న ఈ దళిత కుర్రాడు చేసిన పోరాటం కానీ, ఈ క్రమంలో తాను సాధించిన విజయం కానీ సాధారణమైంది కాదు. ఇది ఇజ్రాయెల్ జానపద గాథల్లో గోలియెత్ని ఓడించిన గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన డేవిడ్‌ను తలపించింది. ఒక దళిత కుర్రాడు అందులోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రిన్స్ అనే పేరు పెట్టుకోవడం అసాధారణమే అని చెప్పాలి. ప్రిన్స్ అంటే ఇంగ్లిష్‌లో ‘ఎదుగుతున్న పాలకుడు’ అని అర్థం. అన్యాయానికి మూలం ఇదా? బాంబే ఐఐటీకి చెందిన జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీలోని అధికారులు ప్రిన్స్ అనే పేరు కల ఈ కుర్రాడి దళిత మూలాలను అనుమానించి ఉండవచ్చు. కానీ నిర్దేశించిన సమయంలోనే ఈ కుర్రాడి సోదరి ఐఐటీ పోర్టల్‌లో అవసరమైన అన్ని పత్రాలనూ అప్లోడ్ చేసిన తర్వాత పీజు కట్టడానికి ప్రయత్నించింది. కానీ వెబ్సైట్ పనిచేయ లేదు. దాంతో ప్రిన్స్ స్వయంగా మరోసారి ప్రయత్నించగా మళ్లీ అతడి ప్రయత్నం తిరస్కరణకు గురైంది. మన సంస్థాగత పునాదిలో ఆన్లైన్ అడ్మిషన్లను కూడా పక్షపాత దృష్టితో వేధించడానికి ఉపయోగిస్తారన్నది తెలిసిందే. భారతదేశంలో చివరకు ఇంటర్నెట్ కూడా దళిత వ్యతిరేక పాశుపతాస్త్రంగా మారిపోవడం విచారకరం. ఆ కుర్రాడు, ఉమ్మడి సీట్ కేటాయింపు విభాగం పనిచేస్తున్న పశ్చిమబెంగాల్ లోని ఐఐటీ ఖర్గపూర్కి సాధారణ కానిస్టేబుల్ అయిన తండ్రితో కలిసి వెళ్ళాడు. ఫీజు కడతానని చెప్పినా అతడిని చేర్చుకోవడానికి అధికారులు తిరస్కరించారు. గడువుతేదీ ముగిసిందని కారణం చెప్పారు. దీంతో అతడు బాంబే హైకోర్టు తలుపులు తట్టాడు. అక్కడా అతడి పిటిషన్‌ని కొట్టేశారు. చివరకు అతడు సుప్రీకోర్టుకు వెళ్లాడు. ఆ కుర్రాడిని ఐఐటీలో చేర్చుకోవలసిందిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వై.డి. చంద్రచూడ్, ఏఎస్ బోపన్న సంచలనాత్మక ఆదేశాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన దళిత కానిస్టేబుల్ కుమారుడు అనేక స్థాయిల్లో పోరాటం సల్పి చిట్టచివరకు ఐఐటీ బాంబేలో చేరగలగడం ఆధునిక ఏకలవ్య గాథను తలపిస్తుంది. సమర్థుడైన విలుకాడు అయినందుకు తన బొటనవేలును కోల్పోవలసి వచ్చిన ఏకలవ్యుడు శస్త్రచికిత్స సహా యంతో తిరిగి తన బొటనవేలును పొందగలిగాడు. ఇప్పుడు ఈ దళిత కుర్రాడు ప్రిన్స్, ఐఐటీ సీటు కోసం పడిన తపనకు సుప్రీంకోర్టులో మాత్రమే న్యాయం జరిగింది. ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందడానికి తీవ్రంగా ఘర్షిస్తూ, అంతిమంగా సీట్లు చేజిక్కించుకుంటున్న, రిజర్వేషన్ హక్కు కలిగిన యువత పడుతున్న తపనలో, ఘర్షణలో ఇది ఒంటరి ఘటన కాదు. సరిగ్గా కొన్ని నెలల క్రితం ఐఐటీ మద్రాస్‌లో జనరల్ కేట గిరీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ఓబీసీలకు చెందిన యువకుడు విపిన్ పి. వీటిల్.. మద్రాస్ ఐఐటీ నుంచి వివిధరకాల వివక్షల పాలబడి తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్యాకల్టీ అతడి కులనేపథ్యాన్ని కనిపెట్టి, అవమానించడం, వేధించడం మొదలెట్టింది. ఈ సందర్భంగా వివిధ స్థాయిల్లోని అధికారులకు విపిన్ రాసిన ఉత్తరాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కులతత్వం ఎంతగా పేరుకుపోయిందో స్పష్టం చేశాయి. ప్రస్తుత సందర్భానికి వస్తే మన దళిత ప్రిన్స్ ప్రవేశం కోసం చేసిన పోరాటంతోనే రిజర్వుడ్ అభ్యర్థుల పోరాటం ముగిసిపోలేదు. ఉన్నత విద్యాసంస్థల్లో చేరడం ఒకెత్తు కాగా, వీటిలో చదువు కొనసాగించడం మరొక ఎత్తు. వీరు క్యాంపస్‌లలోనే ఉంటున్నందువల్ల వివక్ష ఈ సంస్థల్లో ఒక నిరంతర సమస్యగా ఉంటుంది. ఇలా చెబితే అతిశయోక్తి కావచ్చు. ఆరెస్సెస్ శక్తులు మైనారిటీలను భారతీయేతరులుగా వ్యవహరిస్తున్నట్లుగా... దళితులు, ఓబీసీలు, గిరిజనుల పిల్లలను ఘనత వహించిన మన ఐఐటీలు భారతీయేతరులుగా చూస్తున్నాయి. ఈ విద్యా సంస్థలనుంచి రిజర్వేషన్లను తొలగించాలని వీరు అనేకసార్లు విద్యామంత్రికి పలు ఉత్తరాలు రాశారు. కానీ వారనుకున్నది జరిగితే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం కంటే మించిన పెద్ద పోరాటాన్ని దేశం ఎదుర్కోవలిసి వస్తుందని వీరు గ్రహించడం లేదు. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం విషయంలో నిరాకరణకు గురైన విద్యార్థులకు ప్రిన్స్ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం కానుంది. ఉన్నత విద్యాసంస్థల్లో చేరిన నా వంటి తొలితరం రిజర్వేషన్ విద్యార్థులకు, ఆపై ప్యాకల్టీగా మారినవారికి... గడువు తేదీలు, చివరి క్షణంలో మార్కుల కోతలు, రిజర్వేషన్ సంఖ్యలు వంటివాటిని ఎలా తారుమారు చేయగలరో స్పష్టంగా తెలుసు. ఒక విద్యార్థిగా చేరి, కోర్సు పూర్తి చేసుకునే తరుణంలో, విద్యార్థులకు ఏ గ్రేడ్ని ఇవ్వాలి అనే అంశాన్ని కూడా వీరు తారుమారు చేయగలరు. చదువు పూర్తయ్యాక ఉద్యోగ జీవితం కూడా వెనుకబడిన వర్గాల యువతకు రోజువారీ పోరాటంగా మారిపోతుంది. ఒక వైపు పోటీపడలేకపోవడం, మరోవైపు మోతాదుకు మించి పోటీపడటం అనేవి రిజర్వేషన్ విద్యార్థులను వెంటాడతాయి. మద్రాస్ ఐఐటీకి చెందిన విపిన్ తాను రెండో కారణం వల్ల వివక్షకు గురయ్యానని చెప్పారు. తన విభాగంలోని దళిత్/ఓబీసీ ఫ్యాకల్టీ సభ్యుడి కంటే ఎక్కువ సమర్థతను ప్రదర్శించడమే తన పట్ల వివక్షకు కారణమైందట. ఈ ఉన్నత విద్యాసంస్థల్లో ఏకలవ్యుల బొటనవేళ్లను నరికేసే ద్రోణాచార్యులూ ఉన్నారు. అలాగే వీటిలో చేరిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యువత జీవిత ప్రక్రియనే నరికేసే ద్రోణాచార్యులు కూడా ఉన్నారు. గ్రామీణ భారత్ నుంచి తొలి తరం విద్యా నేపథ్యం కలిగిన వారిలో చాలామంది విద్యార్థులు ఇలాంటి వివక్షకు గురైనప్పుడు విద్యాసంస్థలనే వదిలేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ చదువు ముగించి తన కానిస్టేబుల్ తండ్రి కంటే ఉన్నతదశకు ఎదిగితే గొప్ప ఆదర్శంగా మారతాడు. విద్యాసంస్థలను టీచర్ల ద్వారా మాత్రమే సంస్కరించవచ్చు. అయితే ఇలాంటి విద్యాసంస్థల్లోని టీచర్లు ద్రోణాచార్యులను తమ ఆదర్శ గురువులుగా చేసుకున్నంతకాలం, వీరు జాతి మొత్తానికి పెను నష్టం కలిగించగలరు. ఈ విద్యా సంస్థలు గురునానక్ని తమకు ఆదర్శంగా తీసుకుంటే, సాంకేతిక అభివృద్ధిలో చైనానే సవాలు చేసే రీతిలో ఇవి దేశాన్ని మార్చివేయగలవు. ఈ సందర్భంగా ప్రిన్స్, ఆయన తండ్రి మనందరి అభినందనలకు అర్హులు. కంచె ఐలయ్య షెపర్డ్, ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
టెస్లా కార్లలో ‘కలకలం..!’
అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. టెస్లా కార్ల సెల్ఫ్ డ్రైవింగ్ బీటా వెర్షన్లో సమస్యలు ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. వెంటనే కార్ల సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో భాగంగా కొత్త వెర్షన్‌కు బదులుగా పాత వెర్షన్ వాడాలని టెస్లా తన వాహనదారులకు విన్నవించింది. స్వీయ-డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) బీటా సాఫ్ట్వేర్ తాజా వెర్షన్‌ను అక్టోబర్ 24న విడుదల చేసింది. విడుదలైన ఒక రోజులోనే...కొల్లిజన్ వార్నింగ్స్ విషయంలో సమస్యలు ఉన్నట్టు వినియోగదారులు టెస్లాకు రిపోర్ట్ చేసినట్లు రాయిటర్స్ పేర్కొంది. తాజాగా రిలీజ్ చేసిన ఎఫ్ఎస్డీ 10.3 బీటా వెర్షన్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు ఉండడంతో..10.2 ఎఫ్ఎస్డీ సాఫ్ట్వేర్ వెర్షన్‌ను వాడాలని కంపెనీ వినియోగదారులకు సూచించింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన టెస్లా..! కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఇదే సమస్య..! బీటా వినియోగదారుల వీడియో పోస్టింగ్‌ల ప్రకారం, టెస్లా వాహనాలు తాజా 10.3 సాఫ్ట్‌వేర్‌తో తక్షణ ప్రమాదం లేనప్పుడు ఫార్వర్డ్ కొలిషన్ హెచ్చరికలను పదేపదే అందిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని వాహనాలు కూడా కారణం లేకుండా స్వయంచాలకంగా బ్రేకులు వేసినట్లు వినియోగదారులు సోషల్ మీడియా పోస్ట్‌లలో తెలిపారు. స్పందించిన ఎలన్ మస్క్..! కంపెనీ రిలీజ్ చేసిన ఎఫ్ఎస్డీ బీటా వెర్షన్లో సమస్యలు ఉన్నట్లు టెస్లా క్వాలిటీ కంట్రోల్ టీమ్ గుర్తించిందని వాటికి వెంటనే పరిష్కారం చూపుతామని టెస్లా అధినేత ఎలన్‌మస్క్ ట్విటర్లో పేర్కొన్నారు. బీటా వెర్షన్ ఏవిధంగా పనిచేస్తుందనే విషయాన్ని ఓక మోడల్‌పై టెస్ట్ చేస్తే అనుకున్నంతా ఫలితాలు రావు. దీంతో పలు వినియోగదారులకు అధిక సంఖ్యలో బీటా వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎలన్ వెల్లడించారు. కొంత మంది వినియోగదారుల కోసం బీటా వెర్షన్ టెస్టింగ్‌లో భాగంగా కొత్త డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్‌ను విడుదల చేస్తున్నట్లు అక్టోబర్ 22 న పేర్కొంది.ఈ సాఫ్ట్‌వేర్‌లో అనేక ఇంప్రూవ్డ్ ఫీచర్స్ ఉన్నట్లు వినియోగదారులకు కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉండగా..ఈ ఏడాది ఆగస్టులో టెస్లా ఆటోపైలట్ సిస్టమ్‌తో జరిగిన ప్రమాదాలపై నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) విచారణను ప్రారంభించింది. చదవండి: ఇండియా పాక్ మ్యాచ్.. అక్కడ కూడా ఫ్లాప్.. కానీ రూ.300 కోట్లు వెనక్కి -
ఫేస్... బుక్ అయ్యిందా?
కాలం కలసిరాకపోవడమంటే ఇదేనేమో! కొద్ది రోజులుగా ఫేస్బుక్ సంస్థకు తగులుతున్న వరుస ఎదురుదెబ్బలు చూస్తే అంతే అనిపిస్తోంది. ఒకప్పుడు తాను పని చేసిన ఈ సంస్థ దృష్టిలో యూజర్ల ‘‘భద్రత కన్నా లాభమే ముఖ్యం’’ అంటూ ఫ్రాన్సెస్ హాగెన్ అనే మాజీ ఉద్యోగిని నుంచి ఈ ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తూ ఆమె బయటపెడుతున్న వేలాది రహస్యపత్రాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అది చాలదన్నట్టు సోమవారం 6 గంటలపైగా ఫేస్బుక్, దాని సేవలైన వాట్సప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్లు సాంకేతిక సమస్యలతో ఆగిపోయాయి. దీనిపై రకరకాల ఊహాగానాలొచ్చినా, కమ్యూనికేషన్ టూల్స్‌లో లోపాలతో పాటు కాన్ఫిగరేషన్ మార్పు వల్లే ఇది తలెత్తిందని నిపుణుల మాట. 2008 తర్వాతెన్నడూ లేనంతటి ప్రపంచవ్యాప్త స్తంభన, తాజా ఆరోపణలతో సంస్థకు గట్టి దెబ్బే తగిలింది. ట్విట్టర్, టిక్‌టాక్, టెలిగ్రామ్లకి చాలామంది మారిపోవడంతో, ఫేస్బుక్ షేర్లు 4.9 శాతం పడిపోయాయి. 6 గంటల్లో ఫేస్బుక్ 10 కోట్ల డాలర్ల ఆదాయం నష్టపోయినట్లు అంచనా. వీటికన్నా జనం ఫేస్బుక్లో ఎక్కువసేపు గడపడానికి విద్వేషపోస్టుల్ని ప్రోత్సహిస్తోందన్న వివాదం మరింత నష్టాన్ని కలిగించనుంది. ఫేస్బుక్ నైతికతపై ఆరోపణలు చేసింది హార్వర్డ్‌లో ఎంబీఏ చేసిన మంచి వక్త, అల్గారిథమ్స్‌లో దిట్ట, పేటెంట్లు పొందిన స్త్రీ. గూగుల్, పిన్రెస్ట్లలో పనిచేసిన ఆమెకు ఫేస్బుక్లో జనం ఏ చూడాలనేది కంప్యూటర్ కోడ్ ఎలా ఎంపిక చేస్తుందో, లోతుపాతులేమిటో బాగా తెలుసు. అందుకే, ఫేస్బుక్ తప్పులను ప్రపంచానికి చాటిన ఈ 37 ఏళ్ళ మాజీ ఉద్యోగిని మంగళవారం అమెరికన్ సెనేట్ కామర్స్ సబ్ కమిటీ ముందు చెప్పిన మాటలు, చేసిన ఆరోపణలకు అంత విలువ. ప్రోడక్ట్ మేనేజర్‌గా ఫేస్బుక్లో పనిచేసి, మే నెలలో బయటకొచ్చిన ఆమె కొన్ని వేల అంతర్గత పత్రాలను ప్రసిద్ధ పత్రిక ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’తో కొన్నాళ్ళుగా అజ్ఞాతంగా పంచుకుంటూ వచ్చారు. వాటి ఆధారంగా ఫేస్బుక్ హాని గురించి ఆ పత్రిక వరుస కథనాలు వేస్తూ వచ్చింది. ఇక, ఆదివారం హాగెన్ తన పేరు, రూపం బయటపెడుతూ ఇచ్చిన ‘60 మినిట్స్’ టీవీ భేటీ దానికి పరాకాష్ఠ. ఫేస్‌బుక్‌కు 289 కోట్ల మంది, వాట్సప్‌కు 200 కోట్ల పైచిలుకు మంది యూజర్లున్నారని ఓ లెక్క. ఈ ఏడాది మొదట్లో వాట్సప్ కోసం ఫేస్బుక్ తీసుకొచ్చిన సరికొత్త ప్రైవసీ విధానం ఇప్పటికే వివాదాస్పదమైంది. ఇంటిగుట్టు బయటపెట్టిన పత్రాలను బట్టి చూస్తే, ఇప్పటి దాకా అందరూ అనుమానిస్తున్న అనేక అంశాలు నిజమే అనిపిస్తోంది. లక్షలాది ఉన్నత వర్గాల యూజర్ల కోసం మాత్రం ఫేస్బుక్ కొంత సడలింపులతో కూడిన రహస్య నిబంధనలు పాటిస్తోంది. అలాగే, టీనేజ్ అమ్మాయిల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇన్స్టాగ్రామ్ వ్యవహారంతో తమ శరీరాకృతి పట్ల నిరాశకు లోనైన దుఃస్థితి. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న పరిస్థితి. 2018లో అల్గారిథమ్‌లో మార్పు ద్వారా ఫేస్బుక్ విద్వేషాలకు తావిచ్చింది. తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికలవేళ తప్పనిసరై, పోస్టింగులపై కొన్ని అడ్డుకట్టలు పెట్టింది. తీరా ఎన్నికలవగానే వాటిని ఎత్తేయడమే ఈ జనవరి 6న అమెరికా అధ్యక్ష భవనంపై మూకదాడికి దారితీసింది. 34 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్లున్న మనదేశంలో బీజేపీ, ఆరెస్సెస్లవి, లేదా వాటితో అనుబంధమున్నవీ అయిన ఫేస్బుక్ ఖాతాలు, గ్రూపులు, పేజీలు భయాన్ని పెంచేలా, ముస్లిమ్ వ్యతిరేక కథనాలను ప్రమోట్ చేస్తున్నాయట. రాజకీయ సందేశాలకు అడ్డాగా మారిన ఆ సంగతి హాగెన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవన్నీ దిగ్భ్రాంతికరం. అందరికీ ముఖపుస్తకమన్నట్టు పేరు పెట్టుకున్న సంస్థ ఇలా ముఖం చాటేసే పనులు చేయడం విడ్డూరమే. తాజా వివాదంపై ఫేస్బుక్ సీఈఓ జుకెర్బెర్గ్ మొదట్లో మౌనంగా ఉన్నా, చివరికి ఖండించక తప్పలేదు. వాదనల మాటెలా ఉన్నా, ఇప్పటికే అనేక వివాదాలకు లోనై, ఏకస్వామ్య పోకడలకు జరిమానాల పాలై, నిశిత పరిశీలనలో ఉన్న కంపెనీ ఫేస్బుక్. ఉద్యోగులే బయటకొచ్చి, ఆరోపణలు చేయడమూ దానికి కొత్త కాదు. కానీ, ఇలాంటి వేదికలు ప్రపంచాన్ని శాసించేంత శక్తి మంతం కావడం, ఈ సామాజిక వేదిక ఆగితే కమ్యూనికేషన్ ఆగే పరిస్థితి రావడం అభిలషణీయం కానే కాదు. ప్రపంచం ప్రతి క్షణం సెర్చింగ్‌కు వాడే గూగుల్, ప్రపంచంలోని అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడరైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటివి కూడా రేపు ఇలా అనుకోని స్తంభనకు గురైతే ప్రపంచ సమాచారప్రసారం, వాణిజ్యాల పరిస్థితేమిటన్నది సీరియస్‌గా ఆలోచించాల్సిందే. అయితే, ప్రపంచమొక కుగ్రామమై, సమాచారమే అత్యంత శక్తిమంతమైనదిగా మారిన వర్తమానంలో ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలే వద్దనగలమా? ఫేస్‌బుక్‌పై ఇన్ని ఆరోపణలు చేసిన హాగెన్ సైతం ఆ సామాజిక వేదికను నిషేధించమనడం లేదు. దాని పనితీరును పర్యవేక్షిస్తూ, రోజూ 160 కోట్ల పైచిలుకు మందికి అది చూపించే సమాచారంపై మార్గదర్శనం చేయమని సూచిస్తున్నారు. ఈ విషయంపై మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారించాల్సి ఉంది. అదే సమయంలో మార్కెట్ దిగ్గజాలు చేసే తప్పొప్పుల్ని నిర్భయంగా బయటపెడుతూ, సమాజానికి కావలి కాస్తున్న హాగెన్ లాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరమూ ఉంది. ఇంత విషం నిండిన సంస్థలో పనిచేస్తున్నామా అనిపిస్తే, రేపు మరింత మంది ఉద్యోగులు ఆమె లాగా అలారమ్ మోగించవచ్చు. దాచేస్తే దాగని ఆ సత్యాలన్నీ బయటకు రావాలి. బెదిరింపులతో వారి నోరు నొక్కేస్తే – సత్యం వధింపబడుతుంది. ధర్మం చెరలోనే మగ్గుతుంది. పారాహుషార్! -
ధరణి పోర్టల్‌లో కొత్త తిప్పలు..‘మార్ట్గేజ్’.. మారట్లే!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల మార్ట్గేజ్ వ్యవహారం ధరణి పోర్టల్‌లో క్లిష్టతరమైంది. తనఖా పెట్టిన భూములను ఆ తనఖా విడిపించిన తర్వాత కూడా క్రయ, విక్రయ లావాదేవీలు జరుపుకునేందుకు ధరణి పోర్టల్ అనుమతించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత కూడా తమను డిఫాల్టర్లుగా చూపిస్తున్నారని వాపోతున్నారు. ఒక రైతు తన భూమిని బ్యాంకులు లేదా ఇతర సంస్థల వద్ద తనఖా పెట్టి తన అవసరాల కోసం రుణం తీసుకోవచ్చు. ఈ క్రమంలో సదరు భూమిని తమ వద్ద తనఖా పెట్టినట్టు ఆ భూమిని బ్యాంకులు మార్ట్గేజ్ చేసుకుంటాయి. ఈ మార్ట్గేజ్ డీడ్‌ను రెవెన్యూ వర్గాలు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఆ తనఖాకు చట్టబద్ధత లభిస్తుంది. అలాంటి భూమిని ఇతరులకు అమ్ముకునే అవకాశం, లేదా మరోచోట తనఖా పెట్టే అవకాశం ఉండదు. అయితే, తీసుకున్న రుణాన్ని తిరిగి బ్యాంకులు లేదా ఇతర సంస్థలకు చెల్లించినప్పుడు రైతు ఆ మార్టిగేజ్ డీడ్‌ను రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా విడుదల చేసేందుకు రీకన్వేయన్స్ డీడ్ పేరుతో మరో రిజిస్ట్రేషన్ లావాదేవీ చేయాల్సి వస్తుంది. ఇలా రీకన్వేయన్స్ డీడ్ చేసుకునేంతవరకు ధరణి పోర్టల్ సహకరిస్తోందని, ఆ తర్వాతే తంటాలు వస్తున్నాయని రైతులు అంటున్నారు. ఒకసారి తనఖా పెట్టి విడిపించుకున్న భూమిని అమ్ముకునేందుకు వెళితే ఆ భూమి ఇంకా తనఖాలోనే ఉందని ధరణి పోర్టల్ చూపుతోందని వాపోతున్నారు. సాంకేతిక సమస్య వల్లనే... ఈ విషయమై రెవెన్యూ వర్గాలు స్పందిస్తూ రీకన్వేయన్స్ డీడ్ ఆప్షన్‌ను ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఇచ్చిందని, అయితే డీడ్ వచ్చినా ఆ భూమి తనఖాలోనే ఉన్నట్టు చూపిస్తుండటం కేవలం సాంకేతిక సమస్య మాత్రమేనని అంటున్నాయి. దీన్ని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయ స్థాయిలోనే పరిష్కరించి తమకు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. అయితే, రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ భూముల్లో 10 శాతం వరకు భూములు పలు సందర్భాల్లో తనఖాకు వెళతాయని అంచనా. ముఖ్యంగా తోటల పెంపకందారులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం కనుక అదే భూమిని తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకుని తర్వాత ఆ రుణం తీర్చేస్తారు. కానీ, రుణం తీర్చిన తర్వాత కూడా సాగు భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
శంషాబాద్: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రత్యామ్నాయంగా మరో విమానంలో ప్రయాణికులను పంపారు. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 6.40 గంటలకు 180 మంది ప్రయాణికులతో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన ఏఐ 559 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే విమానాన్ని రద్దు చేశారు. ప్రయాణికుల కోసం విజయవాడలో ఉన్న ఏఐ 260 విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి రప్పించారు. ప్రయాణికులతో ఉదయం 11.10 గంటలకు విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుని ఢిల్లీ బయలుదేరింది.