IRCTC down! Users get error message while booking train tickets - Sakshi
Sakshi News home page

ఐఆర్‌సీటీసీ డౌన్‌, యూజర్లు గగ్గోలు!

Published Tue, Jul 25 2023 11:32 AM | Last Updated on Tue, Jul 25 2023 12:13 PM

IRCTC down Users get error message while booking train tickets - Sakshi

IRCTC down: ఐఆర్‌సీటీసీ వినియోగదారులకు చేదు అనుభవం ఎదురైంది. అధికారిక వెబ్‌సైట్‌, యాప్‌లో రైలు టిక్కెట్‌లను బుక్ చేసేటప్పుడు సమస్యలపై యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన, ఫిర్యాదులు స్క్రీన్‌షాట్‌లతో సోషల్‌ మీడియా హోరెత్తితింది. దీనిపై  ఐఆర్‌సీటీసీ  స్పందించింది. ప్లాట్‌ఫారమ్‌లో  కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడయ్యాని, వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది.

ముఖ్యంగా తత్కాల్ బుకింగ్‌ల కోసం కేటాయించిన స్లాట్‌లతో టైమింగ్ క్లాష్ అవ్వడంతో వినియోగదారులు మరింత ఇబ్బంది పడ్డారు. ఏసీ (2A/3A/CC/EC/3E)  తత్కాల్ బుకింగ్ ఉదయం 10:00 గంటలకు, నాన్-AC తరగతికి (SL/FC/2S) ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతాయి. దీంతో దాదాపు ఉదయం 8 గంటలనుంచే చెల్లింపులకు సంబంధించిన సమస్యల గురించి కూడా  ఫిర్యాదులు మొదలైనాయి. 

"సాంకేతిక కారణాల వల్ల టికెటింగ్ సేవ అందుబాటులో లేదు. మా సాంకేతిక బృందం సమస్యను పరిష్కరిస్తోంది. సాంకేతిక సమస్య పరిష్కరించబడిన వెంటనే మేము తెలియజేస్తాము."  ఐఆర్‌సీటీసీ  ట్వీట్‌లో  తెలిపింది. అలాగే ప్రత్యామ్నాయంగా అమెజాన్‌, మేక్‌మైట్రిప్‌ తదితర B2C ప్లేయర్‌ల ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చుని తెలిపింది.

కాగా  ఐఆర్‌సీటీసీ దేశవ్యాప్తంగా 5 కోట్ల రెగ్యులర్ యూజర్లు ప్రతీ రోజూ సైట్ లో టికెట్ బుక్ చేసుకునే వారి సంఖ్య 20 లక్షలకు పైనే ఉంటారని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement