ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం | Technical problem in Flight, delay by AI 599 flight at Shamsabad airport | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

Published Thu, Sep 22 2016 5:50 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

Technical problem in Flight, delay by AI 599 flight at Shamsabad airport

శంషాబాద్: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రత్యామ్నాయంగా మరో విమానంలో ప్రయాణికులను పంపారు. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 6.40 గంటలకు 180 మంది ప్రయాణికులతో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన ఏఐ 559 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే విమానాన్ని రద్దు చేశారు. ప్రయాణికుల కోసం విజయవాడలో ఉన్న ఏఐ 260 విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి రప్పించారు. ప్రయాణికులతో ఉదయం 11.10 గంటలకు విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుని ఢిల్లీ బయలుదేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement