ఫేస్బుక్లో గుర్తుతెలియని సమస్య | unknow error in facebook | Sakshi

ఫేస్బుక్లో గుర్తుతెలియని సమస్య

Aug 1 2014 9:55 PM | Updated on Aug 25 2018 4:51 PM

ఫేస్బుక్లో గుర్తుతెలియని సమస్య - Sakshi

ఫేస్బుక్లో గుర్తుతెలియని సమస్య

ఫేస్బుక్లో సమస్య తలెత్తింది. రాత్రి 9.30 గంటల తర్వాత ఉన్నట్టుండి ఫేస్బుక్ పేజీ మొత్తం అదృశ్యం అయిపోయింది.

ఫేస్బుక్లో సమస్య తలెత్తింది. రాత్రి 9.30 గంటల తర్వాత ఉన్నట్టుండి ఫేస్బుక్ పేజీ మొత్తం అదృశ్యం అయిపోయింది. ఏదో తెలియని ఇబ్బంది ఏర్పడిందని, ఈ సమస్యను అధిగమించడానికి తాము కృషి చేస్తున్నామంటూ ఓ సందేశం మాత్రం కనిపించింది. మధ్యలో కాసేపు బాగానే ఉన్నా.. మళ్లీ తర్వాత అదే సమస్య తలెత్తింది. దాంతో యూజర్లు ఒక్కసారిగా హతాశులయ్యారు.

ఈ సమస్య ఎందుకు వచ్చిందో, ఎంతసేపు ఉంటుందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఫేస్బుక్ కూడా సమస్య ఎక్కడినుంచి వచ్చిందో తెలియకపోవడంతో అంతకుమించి మరేమీ చెప్పలేకపోయింది. వచ్చి.. పోయి.. వచ్చి.. పోయి.. అన్నట్లుండి, యూజర్ల సహనానికి పరీక్ష పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement