గూగుల్ డాట్ కామ్ అమ్మేశారు! | The man who owned Google.com for a minute | Sakshi
Sakshi News home page

గూగుల్ డాట్ కామ్ అమ్మేశారు!

Published Sat, Oct 3 2015 5:42 PM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM

గూగుల్ డాట్ కామ్ అమ్మేశారు! - Sakshi

గూగుల్ డాట్ కామ్ అమ్మేశారు!

ప్రపంచంలోనే అత్యధిక వినియోగదారులున్న గూగుల్ డాట్ కామ్ అమ్మేశారట... అదేమిటీ గూగుల్ అమ్మేయడం అనుకుంటున్నారా? ఇది నిజమే...  కానీ అదీ.. ఒక్క నిమిషానికి... కేవలం పన్నెండు డాలర్లకు. సన్మయ్ వేద్ అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఎక్కడ తప్పు  జరిగిందో తెలియదు కానీ.. డొమైన్ నేమ్ అమ్మకానికి పెట్టారు. వెంటనే గమనించిన సన్మయ్... తన అదృష్టాన్ని పరీక్షించుకునాడు. ఒక్క నిమిషం.. గూగుల్ కు ఓనర్ అనిపించుకున్నాడు. ఇంతలోనే తమ ఎర్రర్ ను గమనించిన గూగుల్ నాలుక్కరచుకొని అమ్మకానికి ఫుల్ స్టాప్ పెట్టింది.

ఓ మాజీ గూగుల్ ఉద్యోగి గూగుల్ కు ఓ నిమిషం పాటు యజమాని అయిపోయాడు.  అయితే ఆ ఒక్క నిమిషంలోనే తమ తప్పును తెలుసుకున్న గూగుల్... వెంటనే అమ్మకాన్ని నిలిపివేస్తూ ప్రకటన చేసింది. ఇడ్లీ డొమైన్ ద్వారా పేర్లు అమ్మకాలు జరుగుతాయని తెలిసిన గూగుల్ మాజీ ఉద్యోగి (డిస్ ప్లే స్పెషలిస్ట్) సన్మయ్... స్క్రోల్ చేస్తుండగా  లిస్టులో గూగుల్ కనిపించింది. ఒక్క సెకన్ కూడ ఆలస్యం చేయకుండా సన్మయ్ గూగుల్ ను 12 డాలర్లకు కొనేశాడు. ఏకంగా కన్ఫర్మేషన్ మెసేజ్ కూడ వచ్చేసింది. ఇంతలోనే తేరుకున్న గూగుల్ తమ అమ్మకాలను నిలిపివేసింది.

నిజంగా నేను షాక్ అయ్యాను. నా కార్డు నుంచి పన్నెండు డాలర్లు కట్ అవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ లింక్ డెత్ లో సన్మయ్ తన అనుభవాన్ని రాసుకున్నాడు.

నిజానికి డొమైన్ తన కార్ట్ లో కూడ  గ్రీన్ చెక్ బాక్స్ లో  యాడ్ అయ్యి ఉండటం  గమనించానని, అది చూసి ఆశ్చర్యపోయానని బోస్టన్ కు చెందిన ఓ ఆన్ లైన్ రిటైల్ ఎక్స్ పర్ట్ కూడా తన అనుభవాన్ని వివరించాడు.నిజానికి  ఆ సమయంలో గూగుల్ డొమైన్స్ ఆర్డర్ లిస్టులో కూడ డొమైన ఆర్డర్ హిస్టరీ మెసేజ్ లు అప్ డేట్ అయ్యి ఉన్నాయట.

అయితే అనుభవజ్ఞుడు కావడంతో సన్మయ్ తనకు వచ్చిన కన్ఫర్మేషన్ ను చూసి వెంటనే తన ఓనర్ షిష్పును మెసేజ్ ద్వారా ప్రకటించుకున్నాడు.  అటువంటి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ గూగుల్ లోని వెబ్ మాస్టర్స్ కు మాత్రమే తెలుస్తుంది. సన్మయ్ కూడ మాజీ డిస్ ప్లే స్పెషలిస్టు కావడంతో ఆ అవకాశాన్ని అతడు అంత త్వరగా గుర్తించగలిగాడు.

''నా ఆర్డర్ విజయవంతమైంది. చాలా స్పష్టంగా యాజమాన్యం నాకు గూగుల్ మంజూరు చేసింది'' నాకు వెంటనే నోటిఫికేషన్లు రావడం మొదలయ్యాయి. కానీ లావాదేవీలు జరిగిన ఒక్క నిమిషం లోపే గూగుల్ తన తప్పును గ్రహించి డొమైన్లనుంచి ఓ క్రమ పద్ధతిలో నాకు ఈ మెయిల్ పంపారు.  దాంతో నా ఓనర్ షిప్ రద్దయింది''  అంటూ తన్మయ్ తన అనుభవాన్ని ఎంతో ఆనందంగా చెప్తున్నాడు. ఏది ఏమైనా కేవలం ఒక్కనిమిషమైనా నేను గూగుల్ డాట్ కామ్ కు యజమాని కాగలిగానని గర్వంగా చెప్తున్నాడు తన్మయ్.

ఇటీవల గూగుల్ సంస్థ అధీనంలో అనేక అనుబంధ సంస్థలను ఏబీసీడీ పద్ధతిలో తీసుకువచ్చింది. ఆయా వెబ్ సైట్ల డొమైన్లను కొన్ని ప్రముఖ కంపెనీలు తమ స్వంతం చేసుకున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీ బీఎమ్ డబ్ల్యూ... ఆల్ఫాబీట్ డాట్ కామ్ ను, జెర్మనీకి చెందిన కార్లు తయారీ  కంపెనీ.. ఫ్లీట్ సర్వీసెస్  ఆల్ఫాబీట్స్ నుంచి వెరీ యాక్టివ్ వెబ్ సైట్ ను కొనుగోలు చేసింది. అలాగే ప్రపంచంలోని గూగుల్ అధీనంలో పనిచేస్తున్న మరెన్నో సంస్థలు తమ డొమైన్లను అమ్మకానికి పెడుతుంటాయి.  ప్రస్తుతానికి గూగుల్  ఓనర్ షిప్ డొమైన్.. బహిరంగ మార్కెట్లో అమ్మకానికి ఎలా పెట్టిందో తెలీదు కానీ సన్మయ్ కి ఒక్క నిమిషం ఓనర్ అయ్యే అవకాశం కలిగింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement