domain
-
ఓపెన్ఏఐ చేతికి రూ.126 కోట్ల డొమైన్
ఓపెన్ఏఐ పురాతన డొమైన్ పేర్లలో ఒకటైన 'చాట్.కామ్'ను హబ్స్పాట్ ఫౌండర్ 'ధర్మేష్ షా' నుంచి 15 మిలియన్లకు (సుమారు రూ.126 కోట్లు) కొనుగోలు చేసింది. మార్చిలో ధర్మేష్ షా చాట్.కామ్ డొమైన్‌ను విక్రయించారు. అయితే అప్పట్లో దీనిని ఎవరికి విక్రయించారు అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.సెప్టెంబర్ 1996లో రిజిస్టర్ అయిన చాట్.కామ్ వానిటీ డొమైన్‌ను వానిటీ డొమైన్ అని కూడా పిలుస్తారు. దీనిని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ కొనుగోలు చేసినట్లు.. ధర్మేష్ షా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఇప్పుడు వెబ్‌సైట్‌ను క్లిక్ చేస్తే.. అది చాట్‌జీపీటీకి వెళ్తుంది. సామ్ ఆల్ట్మాన్ కూడా తన ఎక్స్ ఖాతాలో చాట్.కామ్ అని పేర్కొన్నారు.అత్యంత ప్రజాదరణ పొందిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని.. ప్రపంచ వ్యాప్తంగా మరింత ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఓపెన్ఏఐ చాట్.కామ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. చాట్.కామ్ కొనుగోలుకు ఎంత మొత్తం వెచ్చించారు అనేది సామ్ ఆల్ట్మాన్ అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: లేటు వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన ప్రపంచ కుబేరుడు.. ఆరేళ్లుగా!నిజానికి వానిటీ డొమైన్లు చాలా విలువైనవి. ఎందుకంటే.. చిన్నవిగా ఉండటం వల్ల ఉచ్చరించడానికి మాత్రమే కాకుండా, గుర్తుంచుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది యూజర్లు ఇలాంటి పేర్లను సులభంగా గుర్తుంచుకుని సెర్చ్ చేస్తారు. దీనివల్ల ఇలాంటి డొమైన్స్ ధర కొంత అధికం.BREAKING NEWS: Secret acquirer of $15+ million domain chat .com revealed and it's exactly who you'd think.For those of you that have been following me for a while, you may recall that I announced earlier this year that I had acquired the domain chat .com for an "8 figure sum"… https://t.co/nv1IyddP5z— dharmesh (@dharmesh) November 6, 2024 -
JioHotstar: కోటి రూపాయలు ఇచ్చారంటే..: అంబానీకే ఆఫర్ ఇచ్చిన విద్యార్థి
ఢిల్లీ : ఓ విద్యార్థి తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో విఫలమయ్యేవాడు. కానీ ఈసారి గురి తప్పలేదు. యూ ఆర్ వెల్కమ్ అంటూ కేంబ్రిడ్జీ నుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే విద్యార్థి ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి ఉంది. అందుకే ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి ఓ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? విద్యార్థి ఇచ్చిన ఆఫర్‌ను ముఖేష్ అంబానీ స్వీకరిస్తారా? లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఆ కథా కమామిషు ఏంటో ఏంటో తెలుసుకుందాం పదండి.రిలయన్స్,డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రిలయన్స్, డిస్నీ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానంతరం డిస్నీప్లస్,హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయబోతున్నారని, రెండు సంస్థలను కలిసి జియో హాట్‌స్టార్‌గా వ్యవహరించనున్నారని మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.జియోహాట్‌స్టార్ పేరుతో ఈ తరుణంలో ఢిల్లీకి చెందిన ఓ డెవలపర్ జియోహాట్‌స్టార్ పేరుతో డొమైన్ బుక్ చేశాడు. ఆదే జియోహాట్‌స్టార్ పేరు మీద వ్యపారావ్యవహారాలు కొనసాగించాలనుకున్న రిలయన్స్‌కు సదరు డెవలపర్ ఆఫర్ ఇచ్చాడు. జియోహాట్‌స్టార్ డొమైన్ పేరును బుక్ చేసుకుంది తానేనని, అది మీకు కావాలంటే ఇస్తాను. ఇందుకోసం మీరు నాకు రూ.కోటి ఇవ్వాలని రిలయన్స్ సంస్థకు లేఖ రాశాడు.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ఆ లేఖలో.. నేను 2021లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ యాక్సిలరేట్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన డెవలపర్‌ని. ఐఐటీ పూర్తి చేయలేకపోయాను. అయినప్పటికీ నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకునేందుకు మొగ్గుచూపుతుంటాను. టైర్-2 కాలేజీ నుంచి వచ్చిన తనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ వచ్చింది. ఆంత్రప్రెన్యూర్‌షిప్ విభాగంలో పూర్తి స్థాయి డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. కానీ ఆ డిగ్రీలో చేరాలంటే ఖరీదైన వ్యవహారం. నేను భరించలేను. కోటి ఇవ్వాలంటూఅందుకే జియోహాట్‌స్టార్ విలీనం చివరి దశలోకి వచ్చిందని తెలిసింది. వెంటనే జియోహాట్‌స్టార్.కామ్ డొమైన్‌ను నేను కొనుగోలు చేశారు. విలీనం అనంతరం జియోహాట్‌స్టార్‌గా మీరు వినియోగదారులకు సేవలందించాలంటే నేను కొనుగోలు చేసిన డొమైన మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నేను అడిగినంత మీరు ఇస్తే నా కలను సాకారం చేసినవారవుతారు. ఈ మొత్తం రిలయన్స్ ఖర్చుగా భావిస్తుందేమో కానీ ఇది నాకు జీవితాన్ని మార్చే అవకాశం’అని పేర్కొన్నాడు.మరి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విద్యార్థి అడిగిన మొత్తం ఇస్తారా? లేదంటే సదరు విద్యార్థిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
రానున్న 48 గంటల్లో ఇంటర్నెట్ సేవలకు బ్రేక్
-
ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న ఇంటర్నెట్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రధాన సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగనుంది. రొటీన్ మెయింటినెన్స్‌లో భాగంగా ప్రధాన సర్వర్, దానికి సంబంధించిన కనెక్షన్లను నిలిపివేయనున్నారని.. ఫలితంగా ఇంటర్నెట్ సేవలకు కొద్దిసేపు ఆటంకం కలుగుతుందని ‘రష్యా టుడే’ వెల్లడించింది. ప్రధాన సర్వర్ నిర్వహణను ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్(ఐసీఏఎన్ఎన్) చేస్తుంది. ఇందులో భాగంగా క్రిప్టోగ్రాఫిక్ కీని మారుస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ అడ్రస్ బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్ఎస్) భద్రంగా ఉంటుంది. ఇటీవల ఎక్కువైన సైబర్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాన సర్వర్ నిర్వహణ పనులు నిర్వహణ పనులు తప్పనిసరని ఐసీఏఎన్ఎన్ పేర్కొంది. ‘సురక్షితమైన, స్థిరమైన డీఎన్ఎస్ను పొందడం కోసం కొద్దిసేపు ప్రపంచ నెట్‌వర్క్‌ను షట్‌డౌన్ చేయడం అవసరం. అందువల్ల రానున్న 48 గంటల్లో వెబ్ పేజీలను యాక్సెస్ చేయయంలో, ట్రాన్సాక్షన్స్ జరపడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంద’ని కమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ(సీఆర్ఏ) ప్రకటించింది. అవుట్‌డేటెడ్ ఐఎస్పీ(ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) వాడకందారులు ఈ అసౌకర్యాన్ని చవి చూస్తారని వెల్లడించింది. -
డొమెయిన్ల వ్యాపారంలో ‘హై’దరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పేరులో ఏముందనుకోవద్దు!! ఇంటర్నెట్ ప్రపంచంలో చక్కని పేరు దొరికితే సగం పని అయినట్లేనని భావిస్తుంటారంతా!! వెబ్సైట్ పేరు గుర్తుండిపోయేలా ఉంటే వ్యాపారానికి తిరుగుండదని, కస్టమర్లను సులువుగా చేరుకోవచ్చని కంపెనీల భావన. ఇందుకు ఎంత ఖర్చయినా పెడతారు కూడా. అదే ఇప్పుడు డొమెయిన్ ట్రేడర్లకు కలసివస్తోంది. సేవలు, ఉత్పత్తుల ఆధారంగా వాడుకలో ఉన్న పేర్లతో జెనెరిక్ డొమెయిన్లను వీరు నమోదు చేసి విక్రయిస్తున్నారు. వీటిలో కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్న డొమెయిన్లూ ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. నమోదవుతున్న ఇంటర్నెట్ వెబ్ అడ్రస్‌లలో 80 శాతం జెనెరిక్ పేరుతోనే ఉంటున్నాయి. అయితే ఈ రంగంలో హైదరాబాద్ అగ్ర స్థానంలో ఉండడం విశేషం. టాప్‌లో హైదరాబాద్.. దేశవ్యాప్తంగా డొమెయిన్ల క్రయ, విక్రయాల్లో 100కుపైగా ప్రముఖ ట్రేడర్లున్నారు. అలాగే చిన్నాచితకా మరో 1,000 మంది దాకా కార్యకలాపాలు సాగిస్తున్నారు. మొత్తం ట్రేడర్లలో 20 శాతం హైదరాబాద్ నుంచి ఉంటారని డొమెయిన్ నేమ్స్ కన్సల్టింగ్, బ్రోకరేజ్‌లో ఉన్న అతిపెద్ద కంపెనీ నేమ్కార్ట్.కామ్ చెబుతోంది. ఐటీ రంగం ఇక్కడ వృద్ధి చెందడం ఈ స్థాయిలో విక్రేతలుండడానికి ప్రధాన కారణమని ప్రముఖ ఇన్వెస్టర్ అరవింద్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ఐటీపై పట్టు ఉండడంతో ఈ వ్యాపారాన్ని అర్థం చేసుకున్నారని, హైదరాబాద్ ట్రేడర్ల వద్ద అమ్మకానికి ఎంతకాదన్నా 40,000 పైచిలుకు డొమెయిన్లు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాలు ట్రేడింగ్‌లో టాప్‌లో నిలిచాయి. జెనెరిక్స్ ఎవర్ గ్రీన్.. కంపెనీల పేర్లతో కాకుండా రెండు రకాలుగా ఇంటర్నెట్ వెబ్ అడ్రస్‌లుంటాయి. బ్రాండబుల్స్ / మేడ్ అప్స్ కోవలోకి యాహూ, స్నాప్‌డీల్, మింత్రా, ఈబే, ఓలా, ఓయో వంటి పేర్లు వస్తాయి. క్రెడిట్‌కార్డ్స్.కామ్, వెకేషన్.కామ్, షాదీ.కామ్, నౌక్రీ.కామ్, బ్యాంక్‌బజార్.కామ్ వంటి డొమెయిన్లు జెనెరిక్ విభాగంలో ఉంటాయి. అంటే సేవలు, ఉత్పత్తుల ఆధారంగా రూపుదిద్దుకున్న పేర్లన్న మాట. మరోవైపు డాట్(.)కామ్ డొమెయిన్లకు అంతర్జాతీయంగా ఆదరణ ఎప్పటికీ అలానే ఉందని నేమ్కార్ట్ సీఈవో ప్రఖార్ బిందాల్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డాట్ కామ్ డొమెయిన్లు 30 కోట్ల పైచిలుకు ఉన్నాయి. కొత్తగా ఏటా కోటి నమోదవుతున్నాయి. స్టార్టప్‌లూ డాట్ కామ్ వెబ్ అడ్రస్‌లే తీసుకుంటున్నాయి. ఇక డాట్(.)ఇన్ డొమెయిన్లు ప్రాచుర్యం కోల్పోతున్నాయి. అన్నీ విలువైనవే.. యువ వ్యాపారవేత్తలు ఈ రంగాన్ని ఆన్లైన్ అసెట్స్‌గా పరిగణిస్తున్నారు. ఇన్సూరెన్స్.కామ్ రూ.160 కోట్లు, వెకేషన్రెంటల్స్.కామ్ రూ.140 కోట్లు, ఇంటర్నెట్.కామ్ రూ.126 కోట్లు, ఎఫ్బి.కామ్ రూ.38 కోట్లు, వాట్.కామ్ రూ.1.62 కోట్లు, కేక.కామ్ రూ.20 లక్షలకు అమ్ముడుపోయాయని సమాచారం. నాన్ డిస్క్లోజర్ ఒప్పందాలు ఉంటాయి కాబట్టి చాలా డీల్స్ బయటి ప్రపంచానికి తెలియవని పరిశ్రమ నిపుణుడు సాయి ప్రకాశ్ పోలా చెప్పారు. దేశవ్యాప్తంగా డాట్ కామ్/నెట్/ఓఆర్జీ/ఇన్ ఎక్స్టెన్షన్లు సుమారు 40 లక్షలు నమోదైనట్టు సమాచారం. -
ఆకట్టుకుంటున్న ఆక్లాండ్ లాంతరెన్ ఫెస్టివల్
చైనా కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన లాంతర్ల వెలుగులు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆక్లాండ్ మునుపెన్నడూ లేని విధంగా 800 లాంతర్లతో దేదీప్యమానమైంది. ఉత్సవాలను చూసేందుకు వచ్చే జనంకోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను, ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు. లాంతరెన్ పండుగలో వివిధ ఆకృతుల్లో తయారుచేసిన 800 చైనీస్ హ్యాండ్ మేడ్ లాంతర్లు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. వారి నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. పండుగ సంబరాల్లో భాగంగా ఏర్పాటుచేసిన స్టేజ్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చైనా చిత్రకళలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. అన్ని వయసుల వారినీ ఆకర్షించేలా ఏర్పాటుచేసిన కార్యక్రమాలను సందర్శకులు ఉచితంగా తిలకించే సౌకర్యం కల్పించారు. ఉత్సవాల సందర్భంగా రుచికరమైన ఆసియా వంటకాలు నోరూరిస్తున్నాయి. చేతిపనులు, అల్లికలు, లాంతర్ల తయారీ ప్రదర్శనలు అభిమానుల మనసు దోస్తున్నాయి. చైనా సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా సంప్రదాయ నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్, లైవ్ మ్యూజిక్ తో పాటు... అనేక అంతర్జాతీయ ప్రదర్శనలు వేడుకల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆదివారం ముగింపు వేడుకల్లో భాగంగా బాణసంచా ప్రదర్శన ప్రత్యేకతను సంతరించుకోనుంది. -
హ్యాపీ బర్త్ డే ఇక అందరిదీ...
ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన పాటల్లో ఒకటైన 'హ్యాపీ బర్త్ డే' పాటకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు అందరూ హాయిగా పాడుకునే అవకాశం ఏర్పడింది. పేటెంట్ హక్కుల బంధనాలు వీడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆమెరికా పబ్లిషర్ 'వార్నర్ ఛాపెల్ మ్యూజిక్' సెటిల్ మెంట్ కు రావడంతో దీర్ఘకాలంపాటు కొనసాగిన చట్టపరమైన వివాదం ముగిసింది. మ్యూజిక్ సంస్థ గతంలో ఈ పాటకు 15 మిలియన్ డాలర్లు చెల్లించి పేటెంట్ హక్కులు పొందింది. హ్యాపీ బర్త్ డే టు యు.. అంటూ పుట్టినరోజు సందర్భాల్లో అందరూ పాడుకునే పాటపై 2013 లో వివాదం మొదలైంది. అమెరికాకు చెందిన వార్నర్ ఛాపెల్ మ్యూజిక్ కంపెనీ ఇప్పటిదాకా ఈ పాటకు రాయల్టీ పొందుతోంది. అయితే ఓ సినీ నిర్మాత ఈ పాటను తన సినిమాలో వాడుకోవడంతో కాపీరైట్ చట్టం కింద తనకు 1,500 డాలర్లు చెల్లించాలంటూ వార్నర్ చాపెల్ డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. దాదాపు వందేళ్ళ క్రితం నుంచే అమెరికాలో ప్రముఖంగా వినిపించడమే కాక.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ పాడుకుంటున్న ఆ పాటకు రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని సినీ నిర్మాత సహా మరికొందర్ని భాగస్వాములుగా చేర్చి క్లాజ్ యాక్షన్ దావా దాఖలు చేశారు. దీంతో అప్పట్నుంచీ వివాదం కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమెరికా లాస్ ఏంజిల్స్ ఫెడరల్ కోర్టు ముందు ఆ వివాదానికి తెరపడింది. పాటకు రాయల్టీగా పబ్లిషింగ్ హౌస్ కు 14 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు, 2030 వరకూ అమల్లో ఉన్న రాయల్టీ చెల్లింపులు ఇక్కడితో ముగించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే చాపెల్ సంస్థకు చెల్లించాల్సిన మొత్తంలో ఫిల్మ్ మేకర్స్, న్యాయవాదులు 4.62 మిలియన్ డాలర్లు... మిగిలిన మొత్తాన్ని ఈ పాట వాడుకున్న వారందరూ కలసి చెల్లించాలని కోర్టు నిర్ణయించింది. ఇలా ఒప్పందం కుదరడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి సమస్య మరోసారి తలెత్తకుండా ఉండాలని ఫిర్యాదుదారులు కోరుకుంటున్నారు. గతంలో ఫిల్మ్ మేకర్స్ వార్నర్ చాపెల్ కు ఎటువంటి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా సెంట్రల్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ పాట అందరికీ అందుబాటులోకి రావాలని, పబ్లిక్ డొమైన్ గా మారాలన్న ఉద్దేశ్యంతో తిరిగి కేసును కొసాగించారు. చివరికి తాజా తీర్పుతో వివాదం సర్దుమణిగింది. ఈ హ్యాపీ బర్త్ డే పాట 1893 లో వచ్చిన గుడ్ మార్నింగ్ టు ఆల్ అనే పాటనుంచి వాడకంలోకి వచ్చింది. ఆ పాటను అప్పట్లోనే అమెరికా స్కూళ్ళలో పాడినట్లుగా తెలుస్తోంది. తర్వాత గుడ్ మార్నింగ్ టు ఆల్ నుంచి హ్యాపీ బర్త్ డే గా ఇందులోని పదాలు మారాయి. ఇంగ్లీష్ లో అన్ని పాటలకంటే హ్యాపీ బర్త్ డే సాంగ్ ఎంతో ప్రాచుర్యం పొందినట్లు గిన్నిస్ బుక్ లెక్కలు చెప్తున్నాయి. -
గూగుల్ డాట్ కామ్ అమ్మేశారు!
ప్రపంచంలోనే అత్యధిక వినియోగదారులున్న గూగుల్ డాట్ కామ్ అమ్మేశారట... అదేమిటీ గూగుల్ అమ్మేయడం అనుకుంటున్నారా? ఇది నిజమే... కానీ అదీ.. ఒక్క నిమిషానికి... కేవలం పన్నెండు డాలర్లకు. సన్మయ్ వేద్ అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు కానీ.. డొమైన్ నేమ్ అమ్మకానికి పెట్టారు. వెంటనే గమనించిన సన్మయ్... తన అదృష్టాన్ని పరీక్షించుకునాడు. ఒక్క నిమిషం.. గూగుల్ కు ఓనర్ అనిపించుకున్నాడు. ఇంతలోనే తమ ఎర్రర్ ను గమనించిన గూగుల్ నాలుక్కరచుకొని అమ్మకానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఓ మాజీ గూగుల్ ఉద్యోగి గూగుల్ కు ఓ నిమిషం పాటు యజమాని అయిపోయాడు. అయితే ఆ ఒక్క నిమిషంలోనే తమ తప్పును తెలుసుకున్న గూగుల్... వెంటనే అమ్మకాన్ని నిలిపివేస్తూ ప్రకటన చేసింది. ఇడ్లీ డొమైన్ ద్వారా పేర్లు అమ్మకాలు జరుగుతాయని తెలిసిన గూగుల్ మాజీ ఉద్యోగి (డిస్ ప్లే స్పెషలిస్ట్) సన్మయ్... స్క్రోల్ చేస్తుండగా లిస్టులో గూగుల్ కనిపించింది. ఒక్క సెకన్ కూడ ఆలస్యం చేయకుండా సన్మయ్ గూగుల్ ను 12 డాలర్లకు కొనేశాడు. ఏకంగా కన్ఫర్మేషన్ మెసేజ్ కూడ వచ్చేసింది. ఇంతలోనే తేరుకున్న గూగుల్ తమ అమ్మకాలను నిలిపివేసింది. నిజంగా నేను షాక్ అయ్యాను. నా కార్డు నుంచి పన్నెండు డాలర్లు కట్ అవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ లింక్ డెత్ లో సన్మయ్ తన అనుభవాన్ని రాసుకున్నాడు. నిజానికి డొమైన్ తన కార్ట్ లో కూడ గ్రీన్ చెక్ బాక్స్ లో యాడ్ అయ్యి ఉండటం గమనించానని, అది చూసి ఆశ్చర్యపోయానని బోస్టన్ కు చెందిన ఓ ఆన్ లైన్ రిటైల్ ఎక్స్ పర్ట్ కూడా తన అనుభవాన్ని వివరించాడు.నిజానికి ఆ సమయంలో గూగుల్ డొమైన్స్ ఆర్డర్ లిస్టులో కూడ డొమైన ఆర్డర్ హిస్టరీ మెసేజ్ లు అప్ డేట్ అయ్యి ఉన్నాయట. అయితే అనుభవజ్ఞుడు కావడంతో సన్మయ్ తనకు వచ్చిన కన్ఫర్మేషన్ ను చూసి వెంటనే తన ఓనర్ షిష్పును మెసేజ్ ద్వారా ప్రకటించుకున్నాడు. అటువంటి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ గూగుల్ లోని వెబ్ మాస్టర్స్ కు మాత్రమే తెలుస్తుంది. సన్మయ్ కూడ మాజీ డిస్ ప్లే స్పెషలిస్టు కావడంతో ఆ అవకాశాన్ని అతడు అంత త్వరగా గుర్తించగలిగాడు. ''నా ఆర్డర్ విజయవంతమైంది. చాలా స్పష్టంగా యాజమాన్యం నాకు గూగుల్ మంజూరు చేసింది'' నాకు వెంటనే నోటిఫికేషన్లు రావడం మొదలయ్యాయి. కానీ లావాదేవీలు జరిగిన ఒక్క నిమిషం లోపే గూగుల్ తన తప్పును గ్రహించి డొమైన్లనుంచి ఓ క్రమ పద్ధతిలో నాకు ఈ మెయిల్ పంపారు. దాంతో నా ఓనర్ షిప్ రద్దయింది'' అంటూ తన్మయ్ తన అనుభవాన్ని ఎంతో ఆనందంగా చెప్తున్నాడు. ఏది ఏమైనా కేవలం ఒక్కనిమిషమైనా నేను గూగుల్ డాట్ కామ్ కు యజమాని కాగలిగానని గర్వంగా చెప్తున్నాడు తన్మయ్. ఇటీవల గూగుల్ సంస్థ అధీనంలో అనేక అనుబంధ సంస్థలను ఏబీసీడీ పద్ధతిలో తీసుకువచ్చింది. ఆయా వెబ్ సైట్ల డొమైన్లను కొన్ని ప్రముఖ కంపెనీలు తమ స్వంతం చేసుకున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీ బీఎమ్ డబ్ల్యూ... ఆల్ఫాబీట్ డాట్ కామ్ ను, జెర్మనీకి చెందిన కార్లు తయారీ కంపెనీ.. ఫ్లీట్ సర్వీసెస్ ఆల్ఫాబీట్స్ నుంచి వెరీ యాక్టివ్ వెబ్ సైట్ ను కొనుగోలు చేసింది. అలాగే ప్రపంచంలోని గూగుల్ అధీనంలో పనిచేస్తున్న మరెన్నో సంస్థలు తమ డొమైన్లను అమ్మకానికి పెడుతుంటాయి. ప్రస్తుతానికి గూగుల్ ఓనర్ షిప్ డొమైన్.. బహిరంగ మార్కెట్లో అమ్మకానికి ఎలా పెట్టిందో తెలీదు కానీ సన్మయ్ కి ఒక్క నిమిషం ఓనర్ అయ్యే అవకాశం కలిగింది.