ఓపెన్ఏఐ చేతికి రూ.126 కోట్ల డొమైన్ | OpenAI Buys Chat Com Domain | Sakshi

ఓపెన్ఏఐ చేతికి రూ.126 కోట్ల డొమైన్

Nov 15 2024 5:39 PM | Updated on Nov 15 2024 5:58 PM

OpenAI Buys Chat Com Domain

ఓపెన్ఏఐ పురాతన డొమైన్ పేర్లలో ఒకటైన 'చాట్.కామ్'ను హబ్‌స్పాట్ ఫౌండర్ 'ధర్మేష్ షా' నుంచి 15 మిలియన్లకు (సుమారు రూ.126 కోట్లు)  కొనుగోలు చేసింది. మార్చిలో ధర్మేష్ షా చాట్.కామ్ డొమైన్‌ను విక్రయించారు. అయితే అప్పట్లో దీనిని ఎవరికి విక్రయించారు అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.

సెప్టెంబర్ 1996లో రిజిస్టర్ అయిన చాట్.కామ్ వానిటీ డొమైన్‌ను వానిటీ డొమైన్ అని కూడా పిలుస్తారు. దీనిని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ కొనుగోలు చేసినట్లు.. ధర్మేష్ షా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఇప్పుడు వెబ్‌సైట్‌ను క్లిక్ చేస్తే.. అది చాట్‌జీపీటీకి వెళ్తుంది. సామ్ ఆల్ట్‌మాన్ కూడా తన ఎక్స్ ఖాతాలో చాట్.కామ్ అని పేర్కొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని.. ప్రపంచ వ్యాప్తంగా మరింత ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఓపెన్ఏఐ చాట్.కామ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. చాట్.కామ్ కొనుగోలుకు ఎంత మొత్తం వెచ్చించారు అనేది సామ్ ఆల్ట్‌మాన్ అధికారికంగా వెల్లడించలేదు.

ఇదీ చదవండి: లేటు వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన ప్రపంచ కుబేరుడు.. ఆరేళ్లుగా!

నిజానికి వానిటీ డొమైన్‌లు చాలా విలువైనవి. ఎందుకంటే.. చిన్నవిగా ఉండటం వల్ల ఉచ్చరించడానికి మాత్రమే కాకుండా, గుర్తుంచుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది యూజర్లు ఇలాంటి పేర్లను సులభంగా గుర్తుంచుకుని సెర్చ్ చేస్తారు. దీనివల్ల ఇలాంటి డొమైన్స్ ధర కొంత అధికం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement