మారుతున్న కాలంతో పాటు మనిషి కూడా మారుతూ ఉండాలి. లేకుంటే మనుగడ కష్టమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చిన తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై తాజాగా ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్' స్పందించారు.
ఏఐ వల్ల ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయనే మాట నిజమే.. కానీ ఉద్యోగుల్లో కూడా మార్పు వస్తుందని ఆల్ట్‌మన్ అన్నారు. ఏఐ ఉద్యోగులకు పని లేకుండా చేస్తుందేమో అని భయం ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి సృజనాత్మకతతో మరిన్ని మార్గాలను అన్వేషించగలడు. ఇదే వారి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
ఈ రోజు చేస్తున్న ఉద్యోగాలు కొన్ని సంవత్సరాల క్రితం లేదు, అదే విధంగా ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగాలు రాబోయే తరాలకు చాలా చిన్నవిగా లేదా అనవసరమైనవిగా కూడా అనిపించవచ్చు. కొత్తగా వచ్చిన మార్పులను మనిషి ఎలా స్వీకరించారో.. ఏఐ వల్ల వచ్చే మార్పులను కూడా స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆల్ట్‌మన్ అన్నారు. ఏఐ ఉద్యోగుల మీద మాత్రమే కాకుండా.. సమాజం మీద కూడా ప్రభావం చూపుతుందని అన్నారు.
ఇదీ చదవండి: ఎక్స్‌లో బ్లాక్ బటన్ తొలగింపు: మస్క్ ట్వీట్ వైరల్
ఈ రోజు ఏఐ ఎంతలా విస్తరించింది అంటే.. విద్య, వైద్యం వంటి చాలా రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో ఏఐ పెద్ద పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఏఐ రాక జీవితాలను ఇప్పుడున్నదానికంటే ఉన్నతంగా మార్చుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టెక్నాలజీని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆల్ట్‌మన్ హెచ్చరించారు. ఏఐ వల్ల అనుకూల ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. ప్రతికూలతలు ఉన్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment