purchased
-
ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
ఈ చిత్రంలోని రైతు దంపతులు మీసా పరుశరాములు, రేణుక (రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్) 2.20 ఎకరాల సొంత భూమితో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. పండిన ధాన్యాన్ని 17 రోజుల క్రితం ముస్తాబాద్‌లోని కొనుగోలు కేంద్రానికి తెచ్చారు. కానీ ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. అప్ప ట్నుంచి ఇప్పటివరకు మూడుసార్లు వర్షాలతో ధాన్యం తడిసింది. ఇప్పుడు 17% తేమ వచ్చే వరకు కొనలేమని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టడం, ఈలోగా మళ్లీ వర్షం పడటం, మళ్లీ ఆరబెట్టడం నిత్యకృత్యంగా మారడంతో ఈ దంపతులు లబోదిబోమంటున్నారు. సాక్షి, హైదరాబాద్: తడిచిన ధాన్యాన్ని సైతం కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇచి్చన హామీలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ రైతులు రోజుల తరబడి వేచి చూస్తున్నా.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు 17 శాతం తేమ వచ్చేదాకా ధాన్యం కాంటా వేయలేమని కరాఖండిగా చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఇప్పటికే చాలాసార్లు తడిచింది. ధాన్యం తడవడం, రైతులు ఆరబెట్టేందుకు అష్టకష్టాలూ పడటం నిత్యకృత్యమైంది. మరోవైపు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చేస్తున్న సూచనలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 45 రోజుల్లో 27 ఎల్‌ఎంటీలే సేకరణ రాష్ట్రంలో గత 15 రోజుల నుంచి అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రైతుల పంటను నీళ్లపాలు చేస్తున్నాయి. వర్షం పడిన ప్రతిసారీ పౌరసరఫరాల శాఖ తడిచిన ధాన్యం కొంటామనే హామీ ఇవ్వడమే తప్ప అమలుపై శ్రద్ధ చూపించడం లేదు. దీంతో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే రైతుల వడ్లు పలుమార్లు నీళ్లలో తడిశాయి. చాలాచోట్ల ధాన్యం వరదల్లో కొట్టుకుపోయింది.ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు మొదలై 45 రోజులు దాటినప్పటికీ, ఇప్పటివరకు 27 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించింది. నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సైతం కోతలు దాదాపుగా ముగిశాయి. వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కోతలు కొంత ఆలస్యం అయ్యాయి. అయితే వరి కోసి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెస్తున్న రైతులు అక్కడే ఆరబెట్టి, తమ వంతు వచ్చేంత వరకు కాంటా కోసం వేచిచూస్తున్నారు.రైతుల పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ ఫోన్ నంబర్‌తో లింక్ అయితేనే కొనుగోళ్లు జరుపుతుండడంతో కొందరు రైతులతో పాటు కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా తేమ 17 శాతానికి చేరుకునే వరకు వేచి ఉండాలని చెబుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.మిల్లర్ల కొర్రీలు మరోవైపు కొంచెం తేమ శాతం ఎక్కువగా ఉన్నా మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవడం లేదు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టిన తరువాత ధాన్యం రంగు మారినా తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. అలాంటి ధాన్యం లోడ్లు మిల్లులకు వస్తే నేరుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, రైతులకు ఫోన్లు చేసి పచ్చి ధాన్యాన్ని తీసుకోబోమని తేల్చిచెబుతున్నారు. తీసుకునే పక్షంలో క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల తరుగు తీయాల్సి ఉంటుందంటూ మెలిక పెడుతున్నారు.ధాన్యం కాంటాకే ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు విధిలేని పరిస్థితుల్లో మిల్లర్లు చెప్పినట్లు వింటూ దోపిడీకి గురవుతున్నారు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ ఈ అంశంపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షంతో తడిచిన ధాన్యం గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటాం. – ఇటీవల హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి -
జియో చేతికి యూఎస్ కంపెనీ.. 5జీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలకు మద్దతు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ తాజాగా యూఎస్ కంపెనీ మిమోసా నెట్‌వర్క్స్‌ను కొనుగోలు చేసింది. ఇందుకు 6 కోట్ల డాలర్ల(రూ. 492 కోట్లు) విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కమ్యూనికేషన్ సంబంధ పరికరాలు తయారు చేసే మిమోసా కొనుగోలుతో 5జీ టెలికం, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను మరింత విస్తరించేందుకు వీలు చిక్కనుంది. అనుబంధ సంస్థ రాడిసిస్ కార్పొరేషన్ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జియో ప్లాట్‌ఫామ్స్ పేర్కొంది. రుణరహిత, క్యాష్ ఫ్రీ ప్రాతిపదికన మిమోసాను సొంతం చేసుకునేందుకు ఎయిర్‌స్పాన్ నెట్వర్క్స్ హోల్డింగ్స్‌తో 6 కోట్ల డాలర్లకు ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. మిమోసా వైఫై–5 ఆధారిత పాయింట్ టు మల్టీపాయింట్ ప్రొడక్టులతోపాటు.. ఆధునిక వైఫై 6ఈ టెక్నాలజీలు, సంబంధిత పరికరాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 2018లో మిమోసాను ఎయిర్‌స్పాన్ కొనుగోలు చేసింది. కాగా.. చైనీస్ టెక్నాలజీ నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దూరం జరుగుతున్న నేపథ్యంలో మిమోసా కొనుగోలు జియో ప్లాట్‌ఫామ్స్‌కు కీలకంగా నిలవనుంది. మిమోసాకు జియో ప్రధాన కస్టమర్‌కావడం గమనార్హం! -
చైనా జెట్ విమానాలు కొన్న పాక్
ఇస్లామాబాద్: చైనా తయారీ జే–10సీ జెట్ విమానాల ఫుల్ స్క్వాడ్రన్ (25 విమానాలు)ను పాకిస్థాన్ కొనుగోలు చేసింది. ఇండియా ఇటీవల జరిపిన రఫేల్ విమానాల కొనుగోలుకు బదులుగా చైనా జెట్లను కొన్నామని పాక్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ చెప్పారు. అన్ని రకాల వాతావరణాల్లో ప్రయాణం చేయగల ఈ జెట్ విమానాలు వచ్చే ఏడాది మార్చి 23న పాకిస్తాన్ డే రోజున కవాతులో పాల్గొంటాయని చెప్పారు. గతేడాది పాక్, చైనా సంయుక్త విన్యాసాల్లో ఈ జెట్లు పాల్గొన్నాయి. ప్రస్తుతం పాక్ వద్ద యూఎస్ తయారీ ఎఫ్–16 విమానాలున్నాయి. ఇవి రఫేల్‌కు దీటు రాగలవని నిపుణుల అంచనా. అయితే వీటికన్నా మరింత మెరుగైన జెట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో పాక్ తాజాగా చైనా జెట్లను కొనుగోలు చేసింది. వీటి ఖరీదు ఒక్కోటి సుమారు 3.5 కోట్ల డాలర్లు. అయితే రఫేల్‌ను ఎదుర్కొనేందుకు ఎఫ్ 16 విమానాలుండగా ఇప్పుడీ జెట్లను ఎందుకు కొన్నారో తెలియదని, రఫేల్‌తో పోలిస్తే ఇవేమంత గొప్పవి కావని పాక్ రక్షణ నిపుణుడు, సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్ వ్యాఖ్యానించారు. -
‘ఏబీవీ’ బినామీ బాగోతం బట్టబయలు
సాక్షి, మహబూబ్‌నగర్: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు బినామీ బాగోతం బట్టబయలైంది. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల, చిట్యాల గ్రామాల్లో 117.14 ఎకరాల భూములను 11 మంది బినామీల పేరిట ఆయన కొనుగోలు చేసిన ఉదంతం వెలుగుచూసింది. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన వెంకటేశ్వరరావు ఏడీజీపీగా పనిచేసిన కాలంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలడం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ ఇచ్చిన నివేదిక మేరకు ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యల కింద వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. అయితే వెంకటేశ్వరరావు తన హోదాను అడ్డుపెట్టుకొని భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మక్తల్ మండల పరిధిలోని పసుపుల, చిట్యాల గ్రామాల్లో బినామీల పేరిట 117.14 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. భూముల కొనుగోలు సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా బంధువులు, కుటుంబ సభ్యులతోపాటు తన నమ్మకస్తుల పేరిట పట్టా చేయించారు. రెండు గ్రామాలు... 117.14 ఎకరాలు పదేళ్ల క్రితం నుంచే పసుపుల గ్రామంలో 52.19 ఎకరాలు, చిట్యాలలో 64.35 ఎకరాల చొప్పున మొత్తం 117.14 ఎకరాలను వెంకటేశ్వరరావు బినామీల పేరిట కొనుగోలు చేశారు. ప్రత్యక్షంగా భూ లావాదేవీలు కొనసాగిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని ముందే ఊహించిన ఆయన... ముందు జాగ్రత్తగా భూముల కొనుగోళ్ల విషయంలో మండలానికి చెందిన ఓ రాజకీయ నాయకుడిని రంగంలో దింపారు. ఆయన మధ్యవర్తిత్వంతో ఆయా గ్రామాల్లో భూములను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూముల్లో సాగు చేస్తున్న వెంకటేశ్వరరావు... రైతులతో సాగు చేయిస్తే విషయం బయటకు పొక్కుతుందని భావించి ఆధునిక పద్ధతులను ఎంచుకున్నారు. మందుల పిచికారీ, నూర్పిడి, విత్తనాలు విత్తడం వంటి పనులను యంత్రాల ద్వారా నిర్వహిస్తూ కూలీల అవసరాన్ని తగ్గించి జాగ్రత్తపడినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పొలంలోనే ఫాంహౌస్ ఏర్పాటు చేసుకున్న వెంకటేశ్వరరావు... నెలకోసారి కచ్చితంగా వ్యవసాయ క్షేత్రానికి వచ్చి వెళతారని గ్రామస్తులు తెలిపారు. కృష్ణా నది టు వ్యవసాయ క్షేత్రం.. కృష్ణానది వద్ద మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్న దృశ్యం తన వ్యవసాయ క్షేత్రం నుంచి సుమారు 3 కి.మీ. మేర కృష్ణా నది ఒడ్డున ఉన్న దత్తాత్రేయస్వామి ఎత్తిపోతల పథకం పక్కనే దానికి సమాంతరంగా మరో చిన్నపాటి ఎత్తిపోతలను వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు 10 హెచ్‌పీ మోటార్లను ఏర్పాటు చేసి కృష్ణా నది భూగర్భం నుంచి పెద్ద పైప్లైన్ల ద్వారా నీటిని వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తున్నారు. ఇదే తరహాలో చిట్యాల వాగులోనూ 10 హెచ్‌పీ మోటారును ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి తరలిస్తున్న నీటిని వ్యవసాయ క్షేత్రంలో భారీగా నిర్మించిన సంప్‌లో నిల్వ చేస్తున్నారు. అక్కడ ప్రత్యేక మోటార్ల ద్వారా పంటలకు సాగునీరు చేరవేస్తున్నారు. వాటికితోడు పొలంలో అక్కడక్కడా మరో 8 బోర్లు కూడా వేశారు. గతంలో పండ్ల తోటలు వేసిన ఆయన తర్వాత వరిని సాగు చేస్తున్నారు. కృష్ణా నది గర్భం నుంచి నేరుగా తన పొలాలకు సాగునీరు చేరవేస్తున్న వెంకటేశ్వరరావు తీరుపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భూముల కొనుగోళ్ల విషయంలోనూ తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని పసుపుల గ్రామానికి చెందిన ఆనంద్‌గౌడ్ ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. పడకేసిన లిఫ్టు.. 3,500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పసుపులలో రూ. 76 లక్షలతో 1987లో నిర్మించిన దత్తాత్రేయ ఎత్తిపోతల పథకం ప్రస్తుతం పడకేసింది. దాని నిర్వహణ బాధ్యతను మొదట్లో ప్రభుత్వమే చూసుకున్నా 2002లో రైతులకు అప్పగించడంతో నిర్వహణ భారమై రైతులు ఉపయోగించుకోలేకపోయారు. తాజాగా ఆ లిఫ్టుకు పక్కనే ఆ పథకానికి సమాంతరంగా వెంకటేశ్వరరావు భారీ మోటార్లతో నీటిని తరలించడం గ్రామస్తులను విస్మయానికి గురి చేస్తోంది. భారీగా విద్యుత్ వినియోగం.. వ్యవసాయ క్షేత్రానికి నీటి తరలింపు కోసం ఏర్పాటు చేసిన మోటార్లతో విద్యుత్ వినియోగం భారీగా ఉంటోంది. కృష్ణా తీరం వద్ద ఉన్న నాలుగు 10 హెచ్‌పీ మోటార్లలో ఒక్కొక్కటి 12 గంటలు పని చేస్తే.. ఏడు కిలోవాట్ల విద్యుత్ వినియోగం జరుగుతుందని, దీన్ని కమర్షియల్‌గా లెక్కిస్తే రూ. 900 బిల్లు అవుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. అదే 5 హెచ్‌పీ మోటార్లు పనిచేస్తే రూ. 450 వరకు బిల్లు వస్తుందన్నారు. ఈ లెక్కన ఏళ్ల నుంచి నిరంతరంగా పని చేస్తున్న ఈ భారీ మోటార్లతో విద్యుత్ వినియోగం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే సర్వీసు చార్జీల కింద రైతులు ప్రతి నెలా చెల్లించే రూ. 30 మాదిరిగానే ఈ భారీ మోటార్లకూ వెంకటేశ్వరరావు అదే చెల్లింపులు చేయడం గమనార్హం. 11 మంది మీద పట్టాలు... రెండు గ్రామాల్లో తాను కొనుగోలు చేసిన 117.14 ఎకరాలను వెంకటేశ్వరరావు 11 మంది పేరిట పట్టాలు చేసినట్లు రెవెన్యూ రికార్డులు చూపుతున్నాయి. అయితే వారందరూ స్థానికేతరులు కావడం గమనార్హం. వారు ఎవరో? ఎక్కడి వారో తెలియదని గ్రామస్తులు చెబుతున్నారు. పట్టాలు పొందిన వారిలో కొరుమర్లు వెంకట సత్యనాగమణి తప్ప మిగిలిన వారందరూ తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతు బంధు పేరిట ఆర్థిక సహాయాన్ని సైతం పొందడం గమనార్హం. 2018 ఖరీఫ్, రబీ, 2019 ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం కింద మొత్తం రూ. 9,23,900 లబ్ధి పొందారు. మరో రూ. 10,98,400 మంజూరై చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. భూమికి భూమి ఇస్తామని ఇవ్వలేదు... మేం ఆరుగురు అన్నదమ్ములం. గ్రామంలో మాకు 12.24 ఎకరాల భూమి ఉండేది. అందులో రెండెకరాల భూమిని అన్నదమ్ములం అందరి సమ్మతంతో మా గ్రామానికి చెందిన ఆశప్పకు అమ్మినం. 2005లో మా గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి వెంకటేశ్వరరావు సార్ మీ పదెకరాల భూమి అడుగుతుండ్రు. దానికి బదులు మరోచోట పంటలు బాగా పండే భూమి ఇస్తరు అన్నరు. అప్పుడు మేం ఇద్దరినీ నమ్మి భూమి రిజిస్ట్రేషన్ చేసినం. అప్పట్నుంచీ ఇప్పటివరకు మాకు ఎక్కడా భూమి ఇవ్వలేదు. రూ. 20 వేలు మాత్రమే ఇచ్చారు. భూమి ఇప్పించాలని అడుగుతుంటే మా గ్రామ పెద్ద మనిషి తిప్పించుకుంటున్నడు. నాకు న్యాయం చేయండి. – ఆనంద్‌గౌడ్ (పసుపుల గ్రామం) తక్కువ ధరలకు భూములు కొన్నారు.. ఎవరో డీఐజీ సార్ అట. అప్పట్లో తక్కువ ధరలకు ఇక్కడ భూములు కొన్నారు. కృష్ణా నది నుంచి పైప్లైన్ల ద్వారా నేరుగా పొలాలకు నీరు తీసుకెళ్తున్నరు. డబ్బున్న వాళ్లకు ఏదైనా చెల్లుతది. మా లాంటి వాళ్లకు అన్నీ ఆంక్షలే. – లక్ష్మణ్, స్థానికుడు ఏబీ వెంకటేశ్వరరావు బినామీల పేరిట చేపట్టిన భూ కొనుగోళ్లు ఇలా.. (నోట్: ఎకరం=40 గుంటలు) -
వార్బర్గ్ చేతికి టాటా టెక్నాలజీస్‌లో వాటా
డీల్ విలువ 36 కోట్ల డాలర్లు ముంబై: అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పిన్కస్ సంస్థ, టాటా టెక్నాలజీస్ సంస్థలో 43 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. ఈ వాటా కోసం వార్బర్గ్ పిన్కస్ సంస్థ 36 కోట్ల డాలర్లు వెచ్చించనున్నది. టాటా టెక్నాలజీస్‌లో టాటా క్యాపిటల్‌కు ఉన్న మొత్తం 13 శాతం వాటాను, టాటా మోటార్స్‌కు ఉన్న 43 శాతం వాటాలో 30 శాతం వాటాను, మొత్తం 43 శాతం వాటాను వార్బర్గ్ పిన్కస్ కొనుగోలు చేస్తుంది. టాటా క్యాపిటల్ సంస్థకు... టాటా గ్రోత్‌ఫండ్, ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ల ద్వారా 13 శాతం వాటా ఉంది. ఈ డీల్ కారణంగా టాటా టెక్నాలజీస్ నుంచి టాటా క్యాపిటల్ సంస్థ పూర్తిగా, టాటా మోటార్స్ పాక్షికంగా వైదొలుగుతాయి. -
మాల్యా ఆస్తుల అమ్మకం యోచనలో యూఎస్ఎల్
న్యూఢిల్లీ: ఒప్పందం ప్రకారం వ్యాపారవేత్త, మాజీ చైర్మన్ విజయ్ మాల్యా గడువులోగా నిర్దిష్ట 13 ప్రాపర్టీలను తిరిగి కొనుగోలు చేయకపోవడంతో వాటిని విక్రయించాలని యునైటెడ్ స్పిరిట్స్ యోచిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో యూఎస్ఎల్ను డియాజియో సంస్థ దక్కించుకున్న దరిమిలా కుదిరిన 75 మిలియన్ డాలర్ల డీల్ కింద నిర్దేశిత గడువులోగా మాల్యా తన ప్రాపర్టీలను తిరిగి కొనుక్కోవాల్సి ఉంది. అయితే, గడువు తీరిపోయినప్పటికీ మాల్యా గానీ ఆయన నామినీ గానీ కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్ రేటు ప్రకారం వీటిని విక్రయించాలని యోచిస్తున్నట్లు యూఎస్ఎల్ తెలిపింది. నష్టాల్లోకి యునైటెడ్ స్పిరిట్స్ లిక్కర్ కింగ్ యునైటెడ్ స్పిరిట్స్ మార్చి క్వార్టర్లో రూ.104 కోట్ల నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.1.4 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. ఆదాయం మాత్రం 9 శాతం వృద్ధితో రూ.5,931 కోట్ల నుంచి రూ.6,474 కోట్లకు వృద్ధి చెందింది. 2016–17లో మాత్రం కంపెనీ లాభం రూ.170 కోట్లు, ఆదాయం రూ.25,354 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.122 కోట్లు, రూ.23,384 కోట్లుగా ఉన్నాయి. -
ఫిన్లాండ్ కంపెనీపై మదర్సన్ కన్ను
• పీకేసీ గ్రూప్ కొనుగోలుకు • రూ. 4,146 కోట్ల ఆఫర్ న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరికరాల తయారీ దిగ్గజం మదర్సన్ సుమి సిస్టమ్ .. అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఫిన్లాండ్కి చెందిన ట్రక్ వైర్ హార్నెస్ తయారీ సంస్థ పీకేసీ గ్రూప్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దీనికోసం 571 మిలియన్ యూరోలు (సుమారు రూ. 4,146 కోట్లు) చెల్లించనుంది. పీకేసీ షేరు ఒక్కింటికి 23.55 యూరోలు ఆఫర్ చేసినట్లు మదర్సన్ తెలిపింది. గురువారం నాటి పీకేసీ షేరు ధరతో పోలిస్తే ఇది 51 శాతం అధికం. మార్చి ఆఖరు నాటికి డీల్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్‌కి తాము మద్దతునిస్తున్నట్లు పీకేసీ మరో ప్రకటనలో తెలిపింది. ఇరు కంపెనీల విలీనంతో అంతర్జాతీయ రవాణా రంగానికి అవసరమైన వైరింగ్ సిస్టమ్స్, పరికరాల తయారీ సంస్థగా ఆవిర్భవించవచ్చని పేర్కొంది. అమెరికా, యూరప్ వాణిజ్య వాహనాల మార్కెట్లలో మదర్సన్ .. ఆసియా పసిఫిక్ ప్రాంత మార్కెట్లో పీకేసీ కార్యకలాపాలు విస్తరించేందుకు ఈ డీల్ తోడ్పడనుంది. -
గూగుల్ డాట్ కామ్ అమ్మేశారు!
ప్రపంచంలోనే అత్యధిక వినియోగదారులున్న గూగుల్ డాట్ కామ్ అమ్మేశారట... అదేమిటీ గూగుల్ అమ్మేయడం అనుకుంటున్నారా? ఇది నిజమే... కానీ అదీ.. ఒక్క నిమిషానికి... కేవలం పన్నెండు డాలర్లకు. సన్మయ్ వేద్ అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు కానీ.. డొమైన్ నేమ్ అమ్మకానికి పెట్టారు. వెంటనే గమనించిన సన్మయ్... తన అదృష్టాన్ని పరీక్షించుకునాడు. ఒక్క నిమిషం.. గూగుల్ కు ఓనర్ అనిపించుకున్నాడు. ఇంతలోనే తమ ఎర్రర్ ను గమనించిన గూగుల్ నాలుక్కరచుకొని అమ్మకానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఓ మాజీ గూగుల్ ఉద్యోగి గూగుల్ కు ఓ నిమిషం పాటు యజమాని అయిపోయాడు. అయితే ఆ ఒక్క నిమిషంలోనే తమ తప్పును తెలుసుకున్న గూగుల్... వెంటనే అమ్మకాన్ని నిలిపివేస్తూ ప్రకటన చేసింది. ఇడ్లీ డొమైన్ ద్వారా పేర్లు అమ్మకాలు జరుగుతాయని తెలిసిన గూగుల్ మాజీ ఉద్యోగి (డిస్ ప్లే స్పెషలిస్ట్) సన్మయ్... స్క్రోల్ చేస్తుండగా లిస్టులో గూగుల్ కనిపించింది. ఒక్క సెకన్ కూడ ఆలస్యం చేయకుండా సన్మయ్ గూగుల్ ను 12 డాలర్లకు కొనేశాడు. ఏకంగా కన్ఫర్మేషన్ మెసేజ్ కూడ వచ్చేసింది. ఇంతలోనే తేరుకున్న గూగుల్ తమ అమ్మకాలను నిలిపివేసింది. నిజంగా నేను షాక్ అయ్యాను. నా కార్డు నుంచి పన్నెండు డాలర్లు కట్ అవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ లింక్ డెత్ లో సన్మయ్ తన అనుభవాన్ని రాసుకున్నాడు. నిజానికి డొమైన్ తన కార్ట్ లో కూడ గ్రీన్ చెక్ బాక్స్ లో యాడ్ అయ్యి ఉండటం గమనించానని, అది చూసి ఆశ్చర్యపోయానని బోస్టన్ కు చెందిన ఓ ఆన్ లైన్ రిటైల్ ఎక్స్ పర్ట్ కూడా తన అనుభవాన్ని వివరించాడు.నిజానికి ఆ సమయంలో గూగుల్ డొమైన్స్ ఆర్డర్ లిస్టులో కూడ డొమైన ఆర్డర్ హిస్టరీ మెసేజ్ లు అప్ డేట్ అయ్యి ఉన్నాయట. అయితే అనుభవజ్ఞుడు కావడంతో సన్మయ్ తనకు వచ్చిన కన్ఫర్మేషన్ ను చూసి వెంటనే తన ఓనర్ షిష్పును మెసేజ్ ద్వారా ప్రకటించుకున్నాడు. అటువంటి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ గూగుల్ లోని వెబ్ మాస్టర్స్ కు మాత్రమే తెలుస్తుంది. సన్మయ్ కూడ మాజీ డిస్ ప్లే స్పెషలిస్టు కావడంతో ఆ అవకాశాన్ని అతడు అంత త్వరగా గుర్తించగలిగాడు. ''నా ఆర్డర్ విజయవంతమైంది. చాలా స్పష్టంగా యాజమాన్యం నాకు గూగుల్ మంజూరు చేసింది'' నాకు వెంటనే నోటిఫికేషన్లు రావడం మొదలయ్యాయి. కానీ లావాదేవీలు జరిగిన ఒక్క నిమిషం లోపే గూగుల్ తన తప్పును గ్రహించి డొమైన్లనుంచి ఓ క్రమ పద్ధతిలో నాకు ఈ మెయిల్ పంపారు. దాంతో నా ఓనర్ షిప్ రద్దయింది'' అంటూ తన్మయ్ తన అనుభవాన్ని ఎంతో ఆనందంగా చెప్తున్నాడు. ఏది ఏమైనా కేవలం ఒక్కనిమిషమైనా నేను గూగుల్ డాట్ కామ్ కు యజమాని కాగలిగానని గర్వంగా చెప్తున్నాడు తన్మయ్. ఇటీవల గూగుల్ సంస్థ అధీనంలో అనేక అనుబంధ సంస్థలను ఏబీసీడీ పద్ధతిలో తీసుకువచ్చింది. ఆయా వెబ్ సైట్ల డొమైన్లను కొన్ని ప్రముఖ కంపెనీలు తమ స్వంతం చేసుకున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీ బీఎమ్ డబ్ల్యూ... ఆల్ఫాబీట్ డాట్ కామ్ ను, జెర్మనీకి చెందిన కార్లు తయారీ కంపెనీ.. ఫ్లీట్ సర్వీసెస్ ఆల్ఫాబీట్స్ నుంచి వెరీ యాక్టివ్ వెబ్ సైట్ ను కొనుగోలు చేసింది. అలాగే ప్రపంచంలోని గూగుల్ అధీనంలో పనిచేస్తున్న మరెన్నో సంస్థలు తమ డొమైన్లను అమ్మకానికి పెడుతుంటాయి. ప్రస్తుతానికి గూగుల్ ఓనర్ షిప్ డొమైన్.. బహిరంగ మార్కెట్లో అమ్మకానికి ఎలా పెట్టిందో తెలీదు కానీ సన్మయ్ కి ఒక్క నిమిషం ఓనర్ అయ్యే అవకాశం కలిగింది. -
ఆత్మహత్యలొద్దు..ఆదుకుంటాం