వార్‌బర్గ్ చేతికి టాటా టెక్నాలజీస్‌లో వాటా
డీల్ విలువ 36 కోట్ల డాలర్లు
ముంబై: అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్‌బర్గ్ పిన్‌కస్ సంస్థ, టాటా టెక్నాలజీస్ సంస్థలో 43 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. ఈ వాటా కోసం వార్‌బర్గ్ పిన్‌కస్ సంస్థ 36 కోట్ల డాలర్లు వెచ్చించనున్నది. టాటా టెక్నాలజీస్‌లో టాటా క్యాపిటల్‌కు ఉన్న మొత్తం 13 శాతం వాటాను, టాటా మోటార్స్‌కు ఉన్న 43 శాతం వాటాలో 30 శాతం వాటాను, మొత్తం 43 శాతం వాటాను వార్‌బర్గ్ పిన్‌కస్ కొనుగోలు చేస్తుంది. టాటా క్యాపిటల్ సంస్థకు... టాటా గ్రోత్‌ఫండ్, ఆల్ఫా టీసీ హోల్డింగ్స్‌ల ద్వారా 13 శాతం వాటా ఉంది. ఈ డీల్ కారణంగా టాటా టెక్నాలజీస్ నుంచి టాటా క్యాపిటల్ సంస్థ పూర్తిగా, టాటా మోటార్స్ పాక్షికంగా వైదొలుగుతాయి.