Tata Technologies
-
టాటా సంస్థల త్రైమాసిక ఫలితాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టాటా టెక్నాలజీస్ నికర లాభం సుమారు రెండు శాతం తగ్గి రూ.157 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో ఇది రూ.162 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం రూ.1,269 కోట్ల నుంచి రూ.1,296 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.1,086 కోట్ల నుంచి రూ.1,095 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన సర్వీసుల వ్యాపార విభాగం పుంజుకుందని, 2 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేసిందని సంస్థ సీఈవో వారెన్ హ్యారిస్ తెలిపారు. ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉందని, ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మరింత మెరుగ్గా ఉండగలదని ఆయన వివరించారు. టాటా పవర్.. ఫర్వాలేదుటాటాపవర్ సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 8 శాతం పెరిగి రూ.1,093 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,017 కోట్లుగా ఉంది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.16,029 కోట్ల నుంచి రూ.16,211 కోట్లకు చేరింది. ‘ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, రెన్యువబుల్ వ్యాపారం స్థిరమైన వృద్ధిని కొనసాగించాయి. అన్ని విభాగాలు చెప్పుకోతగ్గ మేర పనితీరు చూపించాయి. దీంతో వరుసగా 20వ త్రైమాసికంలోనూ నికర లాభాన్ని నమోదు చేశాం. భారత్‌లో తయారీ లక్ష్యానికి అనుగుణంగా తమిళనాడులో మేము చెపట్టిన 4.3 గిగావాట్ సెల్ అండ్ మాడ్యూల్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా.. 2 గిగావాట్ సెల్ తయారీ సెప్టెంబర్ క్వార్టర్లో మొదలైంది. వచ్చే నెల చివరికి పూర్తి స్థాయి సామర్థ్యానికి తయారీ పెరగనుంది’ అని టాటా పవర్ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా తెలిపారు.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!పూర్తి ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్ల మూలధన వ్యయాల ప్రణాళిక ప్రకటించగా.. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ.9,100 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా, పునరుత్పాదక విద్యుత్ తయారీ, హైడ్రో ప్రాజెక్టులపై తాము చేస్తున్న పెట్టుబడులతో దేశ ఇంధన సామర్థ్యం బలోపేతం అవుతుందన్నారు. బీఎస్ఈలో టాటా పవర్ 1 శాతం లాభపడి రూ.445 వద్ద ముగిసింది. -
బీఎండబ్ల్యూ, టాటా టెక్ జత
న్యూఢిల్లీ: ఆటో రంగ జర్మన్ దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్, దేశీ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ సర్విసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ చేతులు కలపనున్నాయి. తద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ అభివృద్ధిసహా.. దేశీయంగా ఐటీ డెవలప్మెంట్ హబ్‌కు తెరతీయనున్నట్లు సంయుక్తంగా వెల్లడించాయి. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశాయి. ప్రణాళికల్లో భాగంగా పుణే, బెంగళూరు, చెన్నైలలో ఐటీ అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నాయి. బెంగళూరు, పుణేలలో ప్రధాన అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. చెన్నైలో ఐటీ సొల్యూషన్ల బిజినెస్‌పై దృష్టి కేంద్రీకరించనున్నట్లు పేర్కొన్నాయి. అధీకృత సంస్థల అనుమతుల ఆధారంగా భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనున్నట్లు వెల్లడించాయి. జేవీతో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్‌ను అందించనున్నాయి. ఎస్‌డీవీ సొల్యూషన్లు జేవీ ప్రధానంగా బీఎండబ్ల్యూ గ్రూప్ ప్రీమియం వాహనాలకు సాఫ్ట్వేర్ ఆధారిత వాహన(ఎస్‌డీవీ) సొల్యూషన్లు సమకూర్చనుంది. అంతేకాకుండా ఐటీ బిజినెస్‌కు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్లు సైతం అందించనుంది. సుమారు 100 ఇన్నోవేటర్లతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంయుక్త ప్రకటనలో బీఎండబ్ల్యూ, టాటా టెక్ వెల్లడించాయి. రానున్న కాలంలో వీలైనంత త్వరాగా ఈ సంఖ్యను నాలుగంకెలకు పెంచనున్నట్లు తెలియజేశాయి. సాఫ్ట్వేర్, ఐటీ కేంద్రాల బీఎండబ్ల్యూ గ్లోబల్ నెట్‌వర్క్‌లో జేవీ భాగంకానున్నట్లు పేర్కొన్నాయి. బీఎండబ్ల్యూ గ్రూప్‌తో చేతులు కలపడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, డిజిటల్ ఇంజ నీరింగ్‌లో కస్టమర్లకు అత్యున్నత సొల్యూషన్లు అందించేందుకు కట్టుబడి ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నట్లు టాటా టెక్ సీఈవో, ఎండీ వారెన్ హారిస్ పేర్కొన్నారు. టాటా టెక్‌తో భాగస్వామ్యం ఎస్‌డీవీ విభాగంలో పురోగతికి సహకరించనున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ గ్రోట్ తెలియజేశారు. -
65 ఐటీఐల్లో స్కిల్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఐటీఐ కళాశాలలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్ సెంటర్లు) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో అధికారులు ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉపాధి శిక్షణ శాఖ స్పెషల్ సీఎస్ రాణి కుముదిని, టాటా టెక్నాలజీస్ ప్రెసిడెంట్ పవన్ భగేరియాతో పాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విస్తరిస్తున్న పరిశ్రమల అవసరాలకు, ఇప్పుడున్న కోర్సులకు మధ్య భారీ అంతరముందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంతరాన్ని తగ్గించి యువతకు ఉపాధి అవకాశాలను అందించే కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు. రూ.2,700 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్ల ఖర్చుతో ఐటీఐలలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. అవసరమైన వర్కషాప్ల నిర్మాణం, యంత్రపరికరాల సామగ్రితో పాటు శిక్షణను అందించే ట్యూటర్ల నియామకాన్ని టాటా టెక్నాలజీస్ చేపడుతుంది. ప్రాజెక్టులో భాగంగా ఐటీఐలలో కొత్తగా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు ప్రవేశపెడతారు. అన్ని రంగాల్లో యువత ఉపాధి అవకాశాలందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులను ఎంపిక చేశారు. ప్రతి ఏడాదీ వీటితో 9000 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. దాదాపు లక్ష మందికి షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా శిక్షణను అందిస్తారు. ఈ విద్యా సంవత్సరం (2024–25) నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ నుంచి మొదలయ్యే అకడమిక్ సెషన్‌కు వర్క్ షాప్‌లను అందుబాటులో ఉంచాలని, సరిపడేంత మంది ట్యూటర్లను నియమించాలని ముఖ్యమంత్రి టాటా టెక్నాలజీ ప్రతినిధులకు సూచించారు. కేవలం శిక్షణనివ్వటమే కాకుండా యువతకు ఉపాధి కల్పించేందుకు క్యాంపస్ ప్లేస్మెంట్లపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక ప్లేస్‌మెంట్‌సెల్ ఏర్పాటుకు సహకరించాలని సీఎం రేవంత్ సూచించారు. త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు హైదరాబాద్‌ను స్కిల్ డెవెలప్మెంట్హబ్గా తయారు చేసేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించేందుకు త్వరలోనే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. -
టాటా టెక్నాలజీస్ ఫర్వాలేదు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ టాటా టెక్నాలజీస్ డిసెంబర్‌తో అంతమైన త్రైమాసికంలో రూ.170 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.148 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం ఇదే కాలంలో 15 శాతం వృద్ధితో రూ.1,289 కోట్లకు చేరింది. ‘‘డిసెంబర్ క్వార్టర్లో ఐదు పెద్ద ఆర్డర్లను సొంతం చేసుకున్నాం. ఇందులో ఒక డీల్ మొత్తం విలువ 50 మిలియన్ డాలర్లకు (రూ.415 కోట్లు) పైనే ఉంది. మరొక డీల్ విలువ 25 మిలియన్ డాలర్లు. ఆటోమోటివ్ విభాగంలో కస్టమర్ల వ్యయాల పట్ల సానుకూలంగా ఉన్నాం. ఎందుకంటే ఓఈఎంలు ఎలక్ట్రిఫికేషన్ వైపు, ఇతర ప్రత్యామ్నాయ ప్రొపల్షన్ సిస్టమ్లవైపు దృష్టి సారిస్తున్నాయి. ఏరోస్పేస్ పరిశ్రమ కూడా ఉత్సాహంగా కనిపిస్తోంది. మా సామర్థ్యాలను భారీగా నిర్మించుకోవడంపై పెట్టుబడులు పెడుతున్నాం. కనుక దీర్ఘకాలానికి మా వ్యాపార మూలాల పట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నాం’’ అని టాటా టెక్నాలజీస్ సీఈవో, ఎండీ వారెన్ హారిస్ ప్రకటించారు. డిసెంబర్ త్రైమాసికంలో కొత్తగా 172 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 12,623కు పెరిగింది. -
రాష్ట్రంలో ‘ఇండస్ట్రీ 4.0’ ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 50 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో రూ. 1,500 – 2,000 కోట్లతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించడానికి టాటా టెక్నాలజీస్ ముందుకొచ్చింది. ‘ఇండస్ట్రీ 4.0’ ప్రాజెక్టు పేరుతో ఐటీఐల ద్వారా యువతకు ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్ తయారీ, అధునాతన సీఎస్సీ మెషినింగ్ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫయర్ వంటి కోర్సుల్లో నైపుణ్య శిక్షణ అందించడానికి టాటా సంస్థ ముందుకు రాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. రాష్ట్రంలో ‘ఇండస్ట్రీ 4.0’ స్కిల్ సెంటర్లను ఏర్పాటుచేయడంతోపాటు వాటి నిర్వహణకు కావాల్సిన పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను టాటా సంస్థ అందిస్తుంది. దాదాపు లక్ష మంది విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ అందించడంతోపాటు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా వారి నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేమయ్యారు. నైపుణ్యాభివృద్ధిలో టాటా సంస్థతో ప్రభుత్వం కలసి పనిచేస్తుందని, ఇందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. టాటా టెక్నాలజీస్‌తో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవడానికి ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఐదేళ్ల పాటు ఉచిత సహకారం ‘ఇండ్రస్ట్రీ 4.0’ ప్రాజెక్టులోని కోర్సుల నిర్వహ ణకు అవసరమైన యంత్రాలు, సాఫ్ట్వేర్ అందించడంతో పాటు ప్రతీ ఐటీఐకి ఇద్దరు మాస్టర్ ట్రెయినర్లను టాటా సంస్థ అందిస్తుంది. ఈ ప్రాజెక్టును ఐదేళ్లపాటు టాటా సంస్థ ఉచితంగా నిర్వహించనుంది. ఆధునిక సాంకేతిక వర్క్‌షాపులు, తయారీ రంగంలో అత్యధి క డిమాండ్ కలిగి ఉపాధికి అవకాశాలున్న 22 స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను పాలిటె క్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ అందిస్తుంది. ఎంఓయూ విధివిధానాల ఖరారుకు ఉపాధికల్పన, కార్మిక శాఖ టాటా సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. దీని ఆధారంగానే రాష్ట్రంలో 50 ప్రభుత్వ ఐటీఐలను గుర్తిస్తారని అధికారులు చెప్పారు. ప్రపంచంతో పోటీపడేలా..: సీఎం ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి కృతనిశ్చయంతో ఉన్నామ న్నారు. కోర్సులు పూర్తైన వెంటనే ఉద్యోగం, ఉపాధి, సొంతంగా పరిశ్రమ లను ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని, విద్యను వృథా చేయకుండా ఆధునా తన కోర్సుల్లో శిక్షణ కోసం చర్యలు తీసుకోవాల న్నారు. ఈ సమావేశంలో టాటా టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీవీ కౌల్గుడ్, గ్లోబల్ హెడ్ వైస్ ప్రెసిడెంట్ సుశీల్ కుమార్, కార్మిక, ఉపాధికల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎంఓ అధికారులు శేషాద్రి, షానవాజ్, అజిత్ రెడ్డి పాల్గొన్నారు. -
టాటా టెక్ సూపర్ హిట్.. గాంధార్ ఆయిల్ ఘనం
న్యూఢిల్లీ: టాటా టెక్నాలజీ షేరు లిస్టింగ్ రోజే భారీ లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.500)తో పోలిస్తే 140% ప్రీమియంతో రూ.1,200 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 180% ఎగసి రూ.1,400 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 163% లాభపడి రూ.1,314 వద్ద స్థిరపడింది. వెరసి ఈ ఏడాది(2023) లిస్టింగ్ రోజు అత్యధిక లాభాలు పంచిన షేరుగా రికార్డు సృష్టించింది. కంపెనీ విలువ రూ.52,940 కోట్లుగా నమోదైంది. గాంధార్ సెంచరీ... గాంధార్ ఆయిల్ రిఫైనరీ షేరు ఘనంగా లిస్టయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.169)తో పోలిస్తే 75% ప్రీమియంతో రూ.295 వద్ద లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌లో మరింత దూసుకెళ్లింది. ఒక దశలో 104% ర్యాలీ చేసి రూ.345 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగింపు సమయంలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. చివరికి 78% లాభంతో రూ.301.50 వద్ద ముగిసింది. బీఎస్ఈలో మొత్తం 29.06 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,951 కోట్లుగా నమోదైంది. ఫెడ్ ఫినా.. ప్చ్! ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేరు లిస్టింగ్‌లో నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ. 140)తో పోలిస్తే 1.50% డిస్కౌంట్‌తో రూ.138 వద్ద లిస్టయ్యింది. ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లిస్టింగ్ నష్టాలు భర్తీ చేసుకొంది. ఒక దశలో 6% ర్యాలీ చేసి రూ.148 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో చివరికి ఇష్యూ ధర రూ.140 వద్దే ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.5,378 కోట్లుగా నమోదైంది. -
దూసుకెళ్లిన టాటా షేర్లు, ఒక్కో షేర్‌ను రూ. 500కి కొంటే.. ఒక్కరోజే ఇంత లాభమా!
దేశీయ స్టాక్ మార్కెట్లో టాటా టెక్నాలజీ షేర్లు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. ఐపీఓ తర్వాత ప్రారంభమైన తొలిరోజు ఇంట్రా- డే ట్రేడింగ్‌లో టాటా టెక్నాలజీ షేర్లు 180 శాతం లాభంతో ట్రేడింగ్‌ను మొదలు పెట్టాయి. ఫలితంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐపీఓ తర్వాత ప్రారంభమైన ట్రేడింగ్ టాటా టెక్నాలజీ షేర్ల తరహాలో ఇతర ఏ కంపెనీ ఈ స్థాయిలో షేర్లు రాణించలేదు. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో టాటా టెక్నాలజీ షేర్ ధర రూ.1,200 అమాంతం పెరగగా, బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో అదే షేర్ వ్యాల్యూ రూ.1,199కి చేరింది. దీంతో ఆ స్టాక్ వ్యాల్యూ ఐపీఓ సమయంలో ఉన్న ధర కంటే 140 శాతం రెట్టింపు అయ్యింది. సరిగ్గా ఉదయం 11.47 గంటల సమయానికి 167 శాతానికి రూ.1338 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించాయి. ఇక మార్కెట్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో టాటా టెక్నాలజీ ధర రూ.1,327 వద్ద స్ధిరపడింది. బీఎస్ఈలో రూ.1,326 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. టాటా గ్రూప్ నుంచి రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన టాటా టెక్నాలజీస్ రూ.3042 కోట్లను సమీకరించేందుకు ఐపీఓకు భారీ స్థాయిలో సబ్స్క్రిప్షన్ వచ్చింది. మొత్తం 4.5 కోట్ల షేర్లు సబ్‌స్క్రిప్షన్‌కు ఉంచగా.. చివరి రోజు పూర్తయ్యే సరికి 69.4 రెట్ల స్పందన లభించింది. మొత్తం 312.42 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూ ధర రూ.500 దగ్గర లెక్కిస్తే ఈ మొత్తం రూ.1.56 లక్షల కోట్లతో సమానం. -
పబ్లిక్ ఆఫర్.. బంపర్ హిట్!
టాటా టెక్ @ 69 రెట్లు న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సరీ్వసుల కంపెనీ కి భారీ స్పందన లభించింది. ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో చివరి రోజు శుక్రవారానికల్లా 69 రెట్లుపైగా అధిక సబ్ర్స్కిప్షన్ లభించింది. కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 312 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 203 రెట్లు బిడ్స్ దాఖలుకాగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 62 రెట్లు, రిటైలర్ల నుంచి 17 రెట్లు చొప్పున దరఖాస్తులు లభించాయి. టీసీఎస్ (2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లు అందుకుంది. ఫ్లెయిర్ రైటింగ్..@47 రెట్లు పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల కంపెనీ ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ ఐపీవో చివరి రోజు శుక్రవారానికల్లా 47 రెట్లు అధిక సబ్‌్రస్కిప్షన్‌ను సాధించింది. కంపెనీ 1,44,13,188 షేర్లను ఆఫర్ చేయగా.. 67 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. క్విబ్ విభాగంలో 116 రెట్లు అధిక బిడ్స్ నమోదుకాగా, రిటైలర్ల నుంచి 13 రెట్లు బిడ్స్ దాఖలయ్యాయి. ఫెడ్‌ఫినా@ 22 రెట్లు ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఫెడ్‌ఫినా) ఐపీవోకు మంచి స్పందన లభించింది. 5.59 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 12 కోట్లకుపైగా షేర్లకు (2.2 రెట్లు) బిడ్స్ వచ్చాయి. క్విబ్ విభాగంలో 3.5 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.5 రెట్లు, రిటైలర్ల నుంచి 1.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. గాంధార్ ఆయిల్ @ 64 రెట్లు ప్రైవేట్ రంగ కంపెనీ గాంధార్ ఆయిల్ రిఫైనరీ (ఇండియా) ఐపీవో చివరి రోజు శుక్రవారానికల్లా 64 రెట్లు అధిక సబ్‌్రస్కిప్షన్‌ను సాధించింది. కంపెనీ 2,12,43,940 షేర్లను ఆఫర్ చేయగా.. 136 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల (క్విబ్) విభాగంలో 129 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 62 రెట్లు, రిటైలర్ల నుంచి 29 రెట్లు చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. దీంతో షేరుకి రూ. 160–169 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 501 కోట్ల మేర నిధులను సమీకరించింది. ఇష్యూలో భాగంగా రూ. 302 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.17 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. ఈ నాలుగు ఇష్యూలకూ గురువారాని (30)కల్లా షేర్ల కేటాయింపు జరిగే వీలుంది. రిఫండ్స్ శుక్రవారం, షేర్లు సోమవారం (4న) రావచ్చు. వచ్చే నెల 5న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నట్లు తెలుస్తోంది. -
టాటా టెక్నాలజీ ఐపీఓ : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ముఖ్యగమనిక!
ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి భారీ స్పందన లభిస్తోంది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో రెండో రోజు గురువారానికల్లా 15 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ నమోదైంది. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేసింది. అయితే దాదాపు 67 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. దీంతో నేడు(24న) ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లవరకూ అందుకోనుంది. టీసీఎస్(2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 8.5 రెట్లు బిడ్స్ లభించగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 31 రెట్లు, రిటైలర్ల నుంచి 11 రెట్లు చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా మంగళవారం(21న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 791 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఫెడ్‌ఫినా స్పందన.. అంతంతే! రెండో రోజుకల్లా 90 శాతం బిడ్స్ : దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు పలు ఇష్యూలతో సందడి చేస్తున్నాయి. టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్, ఇరెడా పబ్లిక్ ఇష్యూలు భారీస్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఫెడ్‌ఫినా) ఐపీవోకు స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ఇష్యూ రెండో రోజు గురువారానికల్లా 90 శాతమే సబ్స్క్రయిబ్ అయ్యింది. ఐపీవోలో భాగంగా 5.59 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.. 5.03 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 56 శాతం, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 52 శాతం చొప్పున బిడ్స్ లభించగా.. రిటైలర్లు 1.25 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 133–140 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ. 1,093 కోట్లు సమీకరించా లని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 601 కో ట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 3,51,61,723 షేర్ల(రూ. 492 కోట్ల విలువ)ను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదా రులు విక్రయానికి ఉంచనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా మంగళవారం(21న) రూ. 325 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. -
Tata Tech: గంటలోనే అమ్ముడైన 4.5 కోట్ల షేర్లు
ఇరవై ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓ వచ్చింది. మదుపరులు ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ 22న ప్రారంభమయింది. నవంబర్ 24తో సబ్స్క్రిప్షన్ ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.3042.5 కోట్లు సమీకరించనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద 22వ తేదీన 4,50,29,207 (నాలుగున్నర కోట్లు) షేర్లను అందుబాటులో ఉంచగా ఐపీఓ మొదలైన గంటలోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. టాటా మోటార్స్‌కు చెందిన టాటా టెక్నాలజీస్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసెస్ సంస్థ. టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ సహా టాటా గ్రూప్‌లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది. ఐపీఓలో భాగంగా టాటా మోటార్స్ 11.4 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించనుంది. ఇతర ప్రైవేటు ఈక్విటీ సంస్థలైన ఆల్ఫా టీసీ హోల్డింగ్ 2.4 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1.2 శాతం చొప్పున తమ వాటాలను విక్రయించనున్నాయి. ఐపీఓలో భాగంగా టాటా టెక్నాలజీస్, టాటా మోటార్స్ ఉద్యోగులకు 10 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. టాటా టెక్నాలజీస్ ఐపీఓకు జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం ఉదయం 11 గంటలకు 8,73,22,890 బిడ్లు దాఖలయ్యాయి. అంటే 1.94 రెట్లు సబ్‌స్క్రైబ్ అయినట్లు తెలుస్తోంది. కేటగిరీ వారీగా నాన్ ఇన్స్టిట్యూషనల్ మదుపర్లు 2.72 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ మదుపర్ల 1.98 రెట్లు, రిటైల్ విభాగంలో 1.63 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి టాటా టెక్ రూ.791 కోట్లు సమీకరించింది. -
బంపరాఫర్, ఐపీఓకి టాటా టెక్నాలజీ.. ఒక్కోషేర్ ధర ఎంతంటే?
మదుపర్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఇంజినీరింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ సంస్థ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభమై 24న ముగియనుంది. ఇందుకు వీలుగా ఈ నెల 13న ఆర్వోసీ మహారాష్ట్రకు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ఈక్విటీలో 15 శాతానికి సమానమైన 6.08 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో మాతృ సంస్థ టాటా మోటార్స్ 11.4 శాతం వాటాను ఆఫర్ చేయనుండగా.. పీఈ సంస్థ అల్ఫా టీసీ హోల్డింగ్స్ 2.4 శాతం వాటాను విక్రయించనుంది. ఇక టాటా క్యాపిటల్ సైతం 1.2 శాతం వాటాను ఆఫర్ చేస్తోంది. తాజాగా ధరల శ్రేణి, కనీస పెట్టుబడి సహా ఇతర కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఐపీఓలో ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.475-500గా నిర్ణయించింది. ఈ లెక్కన అత్యధిక ధర వద్ద కంపెనీ రూ.3,042 కోట్లు సమీకరించనుంది. కాగా.. టాటా టెక్నాలజీస్‌లో టీపీజీ రైజ్ క్లయిమేట్కు 9.9 శాతం వాటాను విక్రయించేందుకు గత నెలలో టాటా మోటార్స్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 1,614 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. -
టాటా టెక్నాలజీస్‌లో వాటా అమ్మకం.. ఎంతంటే?
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ సర్వీసెస్ అనుబంధ కంపెనీ టాటా టెక్నాలజీస్‌లో 9.9 శాతం వాటా విక్రయించనున్నట్లు మాతృ సంస్థ, ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా పేర్కొంది. ఇందుకు టీపీజీ రైజ్ క్లయిమేట్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్ విలువను దాదాపు రూ. 1,614 కోట్లుగా వెల్లడించింది. వెరసి రూ. 16,300 కోట్ల ఈక్విటీ విలువలో టాటా టెక్ వాటాను టీపీజీ రైజ్ కొనుగోలు చేయనుంది. డీల్ రెండు వారాలలో పూర్తికావచ్చని టాటా మోటా ర్స్ అంచనా వేస్తోంది. తాజా లావాదేవీ ద్వా రా రుణ భారాన్ని తగ్గించుకునే లక్ష్యంవైపు సా గుతున్నట్లు టాటా మోటార్స్ తెలియజేసింది. టీపీజీ రైజ్ ఇంతక్రితం వ్యూహాత్మక భాగస్వామిగా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌లో బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. టాటా టెక్నాలజీస్ ఆటోమోటివ్ పరిశ్రమలో లోతైన(డొమైన్) నైపుణ్యాన్ని కలిగి ఉంది. బీఎస్ఈలో టాటా మోటార్స్ షేరు శుక్రవారం 5 శాతం జంప్‌చేసి రూ. 667 వద్ద ముగిసింది. -
మదుపర్లకు శుభవార్త, 20 ఏళ్ల తర్వాత ఐపీఓకు టాటా టెక్నాలజీస్
స్టాక్ మార్కెట్లోని మదుపరులకు శుభవార్త. దాదాపూ 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా 23.6 శాతం వాటాకు సమానమైన 9.57 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. ఇందులో భాగంగా టాటా టెక్నాలజీస్ మాతృ సంస్థ టాటా మోటార్స్ 8.11 కోట్ల షేర్లను లేదా 20 శాతం వాటాను వదులుకోనుంది. టాటా గ్రూప్ నుంచి 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐపీఓకు వచ్చింది. తాజాగా అదే గ్రూప్ నుంచి మరో ఐపీఓ రావడం పట్ల మదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఐపీఓ కోసం టాటా టెక్నాలజీస్ ఈ ఏడాది మార్చిలో సెబీకి సంబంధిత పత్రాలను సమర్పించింది. కాగా, ఈ ఐపీవో ద్వారా ఎంత మొత్తాన్ని సేకరించనుందనే అంశాన్నీ టాటా టెక్నాలజీస్ వెల్లడించలేదు. అయితే, సెబీ ఆమోదం పొందిన ఈ ఐపీఓ పరిమాణామం రూ.4,000 కోట్లు ఉండొచ్చని అంచనా. -
మహిళా ఇంజనీర్లకు టాటా టెక్నాలజీస్ ప్రాధాన్యం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ మరింత మంది మహిళలను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది. కార్యాలయాల్లో లింగ వైవిధ్యాన్ని పాటించే క్రమంలో ’రెయిన్బో’ కార్యక్రమం కింద 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1,000 మంది పైగా మహిళా ఇంజనీర్లను తీసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. అలాగే, నాయకత్వ బాధ్యతలను చేపట్టేలా మహిళా ఉద్యోగులను తీర్చిదిద్దే దిశగా ఆరు నెలల లీడర్‌బ్రిడ్జ్–వింగ్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు వివరించింది. ఉద్యోగినులు నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని టాటా టెక్నాలజీస్ వివరించింది. సంస్థలో సమ్మిళిత సంస్కృతిని పెంపొందించేందుకు, ఉద్యోగులు చురుగ్గా పాలుపంచుకునేందుకు మరిన్ని కొత్త ప్లాట్‌ఫామ్‌లను కూడా ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. -
టాటా టెక్నాలజీస్‌తో టిహాన్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ’టిహాన్’ ఐఐటీ హైదరాబాద్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఇంజినీరింగ్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ వెల్లడించింది. సాఫ్ట్వేర్ ఆధారిత వాహనాలు (ఎస్‌డీవీ), అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) విభాగాల్లో కలిసి పని చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. ఆటోమోటివ్ కంపెనీలు సాఫ్డ్‌వేర్ ఆధారిత వాహనాలను రూపొందించే కొద్దీ వ్యయాలను తగ్గించుకునే దిశగా వినూత్న సొల్యూషన్స్ కోసం అన్వేషిస్తుంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో తగు ప్లాట్‌ఫామ్‌లను రూపొందించడం, తమ ఇంజినీర్లకు కొత్త సాంకేతికతలపై టిహాన్లో శిక్షణ కల్పించడంపై ఎంవోయూ కింద ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు టాటా టెక్నాలజీస్ ఎండీ వారెన్ హారిస్ తెలిపారు. ఈ భాగస్వామ్య ఒప్పందంతో ఆటోమోటివ్ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలకు ఊతం లభించగలదని ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీ–హెచ్) డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు. స్వయం చాలిత టెక్నాలజీలకు సంబంధించి ఐఐటీ–హెచ్లో ఏర్పాటు చేసిన హబ్‌ను టిహాన్గా వ్యవహరిస్తున్నారు. -
ఐపీవోకు టాటా టెక్నాలజీస్
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. గ్లోబల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అందించే టాటా టెక్నాలజీస్ ఐపీవో సన్నాహాలు ప్రారంభించింది. సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌కు ఇది అనుబంధ సంస్థకాగా.. ఇంతక్రితం ఐటీ సేవల నంబర్ వన్ కంపెనీ టీసీఎస్ 2004లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. ఐపీవోలో భాగంగా టాటా టెక్నాలజీస్ 9.57 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. -
టాటా టెక్నాలజీస్ ఐపీవో
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్‌లో పాక్షిక వాటాను విక్రయించే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ పేర్కొంది. ఇందుకు పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. సోమవారం(12న) సమావేశమైన ఐపీవో కమిటీ తాజా ప్రతిపాదనకు సూత్రప్రాయ అనుమతినిచ్చినట్లు తెలియజేసింది. అయితే మార్కెట్ పరిస్థితులు, అవసరమైన, సెబీ సహా నియంత్రణ సంస్థల అనుమతులు ఆధారంగా ఐపీవోను చేపట్టనున్నట్లు వివరించింది. టాటా టెక్నాలజీస్ గ్లోబల్ ఇంజినీరింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసులందిస్తోంది. ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ హెవీ మెషీనరీ తదితర పరిశ్రమలకు సర్వీసులు సమకూర్చుతోంది. విదేశీ విస్తరణ మార్చితో ముగిసిన గతేడాది(2021–22) 47.35 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,910 కోట్లు) ఆదాయం సాధించింది. ఎయిర్‌బస్‌కు వ్యూహాత్మక సరఫరాదారుగా నిలుస్తున్న కంపెనీ ఇటీవలే ఫ్రాన్స్‌లోని టోలౌజ్లో ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. తద్వారా అంతర్జాతీయ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రొడక్ట్ ఇంజినీరింగ్, డిజిటల్ సర్వీసులను అందించనుంది. సస్టెయినబుల్ మొబిలిటీ సొల్యూషన్స్ అభివృద్ధికి సహకరించేందుకు ఈ ఏడాది జూన్‌లో ఫాక్స్‌కాన్ ప్రారంభించిన ఎంఐహెచ్ కన్సార్షియంలో చేరింది. దీంతో పరిశ్రమలో సహకారానికి ప్రోత్సాహాన్నివ్వనుంది. హార్మనీ కన్సార్షియం మొబిలిటీ(ఎంఐహెచ్)లో సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, సర్వీసుల రంగాలకు చెందిన 2,300 సభ్య సంస్థలున్నాయి. -
రెడీగా ఉండండి.. 18 ఏళ్ల తర్వాత ఆ దిగ్గజ సంస్థ నుంచి ఐపీఓ
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. ఈ మేరకు సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. 2004లో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకు వచ్చిన తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓకు వస్తున్న సంస్థ ఇదే. టాటా టెక్నాలజీస్ ఐపీఓ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు గత వారమే ఓ వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ ఐపీఓకు సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు సిటీ గ్రూప్‌ను టాటా నియమించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు టాటా గ్రూప్ మరో అనుబంధ సంస్థ అయిన టాటా స్కై కూడా ఐపీఓకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఐపీఓ వార్తలపై టాటా గ్రూప్ స్పందించేందుకు నిరాకరించాయి. చదవండి: Anand Mahindra: ఎలాన్ మస్క్‌పై ఆనంద్ మహీంద్రా ట్విట్.. అది పొగిడినట్లు లేదే..! -
వార్బర్గ్ చేతికి టాటా టెక్నాలజీస్‌లో వాటా
డీల్ విలువ 36 కోట్ల డాలర్లు ముంబై: అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పిన్కస్ సంస్థ, టాటా టెక్నాలజీస్ సంస్థలో 43 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. ఈ వాటా కోసం వార్బర్గ్ పిన్కస్ సంస్థ 36 కోట్ల డాలర్లు వెచ్చించనున్నది. టాటా టెక్నాలజీస్‌లో టాటా క్యాపిటల్‌కు ఉన్న మొత్తం 13 శాతం వాటాను, టాటా మోటార్స్‌కు ఉన్న 43 శాతం వాటాలో 30 శాతం వాటాను, మొత్తం 43 శాతం వాటాను వార్బర్గ్ పిన్కస్ కొనుగోలు చేస్తుంది. టాటా క్యాపిటల్ సంస్థకు... టాటా గ్రోత్‌ఫండ్, ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ల ద్వారా 13 శాతం వాటా ఉంది. ఈ డీల్ కారణంగా టాటా టెక్నాలజీస్ నుంచి టాటా క్యాపిటల్ సంస్థ పూర్తిగా, టాటా మోటార్స్ పాక్షికంగా వైదొలుగుతాయి.