స్టాక్ మార్కెట్‌లోని మదుపరులకు శుభవార్త. దాదాపూ 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా 23.6 శాతం వాటాకు సమానమైన 9.57 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది.
ఇందులో భాగంగా టాటా టెక్నాలజీస్ మాతృ సంస్థ టాటా మోటార్స్ 8.11 కోట్ల షేర్లను లేదా 20 శాతం వాటాను వదులుకోనుంది. టాటా గ్రూప్ నుంచి 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐపీఓకు వచ్చింది. తాజాగా అదే గ్రూప్ నుంచి మరో ఐపీఓ రావడం పట్ల మదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ఐపీఓ కోసం టాటా టెక్నాలజీస్ ఈ ఏడాది మార్చిలో సెబీకి సంబంధిత పత్రాలను సమర్పించింది. కాగా, ఈ ఐపీవో ద్వారా ఎంత మొత్తాన్ని సేకరించనుందనే అంశాన్నీ టాటా టెక్నాలజీస్ వెల్లడించలేదు. అయితే, సెబీ ఆమోదం పొందిన ఈ ఐపీఓ పరిమాణామం రూ.4,000 కోట్లు ఉండొచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment