దేశీయ స్టాక్ మార్కెట్‌లో టాటా టెక్నాలజీ షేర్లు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. ఐపీఓ తర్వాత ప్రారంభమైన తొలిరోజు ఇంట్రా- డే ట్రేడింగ్‌లో టాటా టెక్నాలజీ షేర్లు 180 శాతం లాభంతో ట్రేడింగ్‌ను మొదలు పెట్టాయి. ఫలితంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐపీఓ తర్వాత ప్రారంభమైన ట్రేడింగ్ టాటా టెక్నాలజీ షేర్ల తరహాలో ఇతర ఏ కంపెనీ ఈ స్థాయిలో షేర్లు రాణించలేదు.
నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో టాటా టెక్నాలజీ షేర్ ధర రూ.1,200 అమాంతం పెరగగా, బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో అదే షేర్ వ్యాల్యూ రూ.1,199కి చేరింది. దీంతో ఆ స్టాక్ వ్యాల్యూ ఐపీఓ సమయంలో ఉన్న ధర కంటే 140 శాతం రెట్టింపు అయ్యింది.
సరిగ్గా ఉదయం 11.47 గంటల సమయానికి 167 శాతానికి రూ.1338 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించాయి. ఇక మార్కెట్ ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో టాటా టెక్నాలజీ ధర రూ.1,327 వద్ద స్ధిరపడింది. బీఎస్‌ఈలో రూ.1,326 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.
టాటా గ్రూప్ నుంచి రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన టాటా టెక్నాలజీస్ రూ.3042 కోట్లను సమీకరించేందుకు ఐపీఓకు భారీ స్థాయిలో సబ్‌స్క్రిప్షన్ వచ్చింది. మొత్తం 4.5 కోట్ల షేర్లు సబ్‌స్క్రిప్షన్‌కు ఉంచగా.. చివరి రోజు పూర్తయ్యే సరికి 69.4 రెట్ల స్పందన లభించింది. మొత్తం 312.42 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూ ధర రూ.500 దగ్గర లెక్కిస్తే ఈ మొత్తం రూ.1.56 లక్షల కోట్లతో సమానం.
Comments
Please login to add a commentAdd a comment