
న్యూఢిల్లీ: టారిఫ్ విధానాలపై అస్పష్టత నెలకొనడం వల్ల అమెరికాలో పెట్టుబడుల ప్రతిపాదనలను అమలు చేయడంలో జాప్యం జరగొచ్చని టాటా టెక్నాలజీస్ సీఈవో వారెన్ హారిస్ తెలిపారు. అయితే, వచ్చే నెలా, రెణ్నెల్లలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఉత్తర అమెరికా మార్కెట్‌పై మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా తాము చాలా బులిష్‌గా ఉన్నట్లు వివరించారు.
టారిఫ్‌లు నచ్చడం, నచ్చకపోవడాన్ని పక్కన పెడితే స్పష్టతనేది కీలకంగా ఉంటుందని హారిస్ చెప్పారు. తమ కస్టమర్లకు ఒక అవగాహన వచ్చిన తర్వాత తగు నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. తమ సంస్థ స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతు పలికినప్పటికీ, వివిధ మార్కెట్లలో పరిస్థితులు వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి తదనుగుణంగా వ్యాపారాలను నిర్వహించాల్సి ఉంటుందని హారిస్ తెలిపారు.
‘ఉత్తర అమెరికాకు యూరప్ చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే, భారత్‌కి భిన్నంగా చైనా ఉంటుంది. కాబట్టి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడాన్ని మేము అలవర్చుకున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment