రోగాలను నిర్థారించడంలో తలెత్తిన లోపాల కారణంగా ఏటా లక్షలాదిమంది ప్రాణాలను కోల్పోతున్నారట. ఈ విషయాన్ని యూఎస్‌కి చెందిన ఓ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రతి ఏడాది దాదాపు ఎనిమిది లక్షల మంది దాక చనిపోతున్నట్లు యూఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన నివేదికలో వెల్లడించింది.
ఈ మేరకు జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వే ప్రకారం ..ప్రతి ఏడాది వ్యాధులను సరిగా గుర్తించడంలో వైఫల్యం కారణంగా ఏటా మూడు లక్షల మరణాలు, నాలుగు లక్షల మందికి అంగవైకల్యం, మరికొందరూ ఇతర శారీరక రుగ్మతలతో బాధ పడుతున్నట్లు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన అధ్యయనంలో పేర్కొంది. శాస్త్రవేత్తలు 15 రకాల వ్యాధులను గుర్తించడంలో వైద్యులు విపలమవుతున్నట్లు పేర్కొన్నారు.
అలాగే ఈ రోగ నిర్థారణ లోపాల్లో చాలా వరకు ఆస్పత్రుల్లో సరైన విధంగా వనరులు అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమని అని తెలిపింది. ఇక వైద్యులు ఊపితిత్తుల క్యాన్సర్, సెప్సిన్, న్యుమోనియా, సిరలలో రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, తదితర వ్యాధులను తప్పుగా నిర్థారిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యాధులు సాధారణ వ్యాధుల లక్షణాలను చూపించడంతో తరుచుగా వైద్యులు ఆయా వ్యాధులను గుర్తించడంలో విఫలమవుతున్నట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ న్యూమాన్-టోకర్ వెల్లడించారు.
(చదవండి: ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు)
Comments
Please login to add a commentAdd a comment