huge amount of cash
-
AP: వచ్చీ ఉపయోగం లేదు
సాక్షి ప్రతినిధి: వరద నీరు ముంచెత్తి ప్రజలు దిక్కుతోచక ఇళ్లలోనే బందీలై సాయం కోసం హాహాకారాలు చేస్తుంటే ఒక రోజు తరువాత తీరిగ్గా బోట్లను తెప్పించింది ప్రభుత్వం. పోనీ అప్పుడైనా అన్నింటినీ రంగంలోకి దిగి బాధితులను ఒడ్డుకు చేర్చిందా అంటే అదీ లేదు. ఇతర ప్రాంతాల నుంచి తెప్పించిన పడవలను లారీల నుంచి కిందకు దించలేదు. రోడ్లమీదే ఆ లారీలను నిలిపివేశారు. దీంతో అవి వచ్చినా ఉపయోగంలేకపోయింది. కొన్ని బోట్లు అధికారులు, రాజకీయ నాయకులను తిప్పడానికే సరిపోయాయి. దీంతో ప్రైవేటు బోట్ల నిర్వాహకులు పలువురు బాధితులను దోచుకొన్నారు. ఒడ్డుకు చేర్చడానికి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకూ డిమాండ్ చేశారని బాధితులు సాక్షి బృందం వద్ద తమ గోడును చెప్పుకున్నారు. ‘ఆదివారం నుంచి వరదలోనే ఉన్నాం. అధికారులెవరూ పట్టించుకోలేదు. స్థానికంగా ఉండే కుర్రాళ్లు కొందరు నన్ను, నా మనమరాళ్లను బయటకు తీసుకువచ్చారు. మనుమడు ఇంకా వరదలోనే ఉన్నాడు. బోట్ల వారిని అడిగితే రూ.10 వేలు అడిగారు. అంత డబ్బు మా దగ్గర ఎలా ఉంటుంది? సింగ్ నగర్ వంతెనపైనే తిండి, నీరు లేకుండా కూర్చున్నాం. ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మని పోలీసులు తరుముతున్నారు. ఎక్కడికిపోవాలి? ఎలా బతకాలి?’ అంటూ రాజరాజేశ్వరిపేటకు చెందిన దుర్గమ్మ కన్నీరు పెట్టుకుంది. ఎంతగా బతిమిలాడినా పంపలేదు: 10 మంది చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నారని, బోట్లు పంపాలంటూ ఎంతగా బతిమిలాడినా పంపలేదని నందమూరి నగర్ 10వ లైన్‌కు చెందిన రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణలో ఎన్నికలు..కర్ణాటకలో కోట్ల డబ్బు సీజ్..
-
కర్ణాటకలో పెద్ద మొత్తంలో పట్టుబడిన డబ్బు కట్టలు
-
టీడీపీ నేత ఇంట్లో భారీగా పట్టుబడ్డ డబ్బు
-
100 డాలర్లు రీఫండ్ అడిగితే, కోటి ఇచ్చారా? ఇదెక్కడి చోద్యం రా మామా!
న్యూఢిల్లీ:చిన్న పొరపాటు, నిర్లక్క్ష్యం ఒక్కోసారి భారీ ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఉదంతాలు గతంలో చాలానే చూశాం. తాజాగా పొరపాటుగా ఒక మహిళ ఖాతాలో మిలియన్ల డాలర్లను పంపించిన ఘటన ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. అంతేకాదు ఇంకొక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే దీన్ని గుర్తించడానికి సంస్థకు ఏకంగా ఏడునెలలు పట్టిందిట. (WhatsApp:బీ అలర్ట్: ఈ ఫోన్లలో వాట్సాప్ అక్టోబరు నుంచి పనిచేయదు) సింగపూర్-ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ క్రిప్టో డాట్‌కామ్ ఈ పొరపాటుచేసింది. అనుకోకుండా ఆస్ట్రేలియన్ మహిళ దేవమనోగారి మణివేల్ ఖాతాకు ఏకంగా 10.5 మిలియన్ల డాలర్లను సెండ్ చేసింది. అదీ కేవలం 100 డాలర్ల రీఫండ్‌కు బదులుగా ఇంత సొమ్మును ఆమె ఖాతాలో జమ చేసింది. గత ఏడాది మేలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆలస్యంగా పొరపాటును గ్రహించి చర్యలకు దిగింది. ఆమె ఖాతాలో అంత పెద్ద మొత్తంలో సొమ్మును జతచేశామంటూ లబోదిబోమంది. ఆ డబ్బులు ఇప్పించండి మహాప్రభో అంటూ దేవమనోగారి మణివేల్ , ఆమె సోదరిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది చదవండి: Starbucks: స్టార్‌బక్స్ సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్, ప్రత్యేకత ఏంటంటే? ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే తనఖాతాలో వచ్చిన సొమ్ము ద్వారా గుట్టుచప్పుడుకాకుండా మెల్బోర్న్లో 1.35 మిలియన్ డాలర్లు విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసింది మణివేల్. ఆ తరువాత తెలివిగా ఆ ఇంటిని సోదరి పేరుతో బదిలీ కూడా చేసేసింది. దీంతోపాటు 4,30,000 డాలర్లను తన కుమార్తెకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇంత చేసినా.. తప్పించుకోలేకపోయింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఆస్తిని విక్రయించి, మిగిలిన డబ్బును వడ్డీతో సహా తిరిగి క్రిప్టో డాట్‌కాంకు ఇవ్వాలని ఆదేశించారు. -
మావోయిస్టులకు చెందిన రూ.5కోట్లు స్వాధీనం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర సరిహద్దులో భారీగా నగదు పట్టుబడింది. మావోయిస్టులకు సంబంధించిన 5 కోట్ల రూపాయలను సోమవారం ఉదయం మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులోని శివారు ప్రాంతమైన గోరఖ్ దందా గ్రామంలో రూ .5 కోట్ల అక్రమ రవాణాకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణా మావోయిస్టులకు ఇవ్వడానికి ఈ డబ్బులు తీసుకెళ్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పట్టుబడిన నగదుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: బావ కోసం దళంలో చేరి... -
అలాంటి సొమ్ము నాకొద్దు; ఏకంగా 14 కోట్లు తిరస్కరించిన యువతి
ఆమ్స్టర్డామ్: ప్రపంచంలో ప్రస్తుతం ప్రతీది పైసాతోనే నడుస్తోంది. ఇక డబ్బు కోసం ఎంతోమంది నేరాలకు పాల్పడుతున్న ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అలాంటి పరిణామాలు జరుగుతున్న ఈ రోజులల్లో ఓ యువతి కోట్ల రుపాయలను ఖర్చులకోసం ఇస్తుంటే సున్నితంగా తిరస్కరించింది. ఇది నమ్మలేకున్నా నమ్మాల్సిన నిజమండి. వివరాలల్లోకి వెళితే.. డచ్ సింహాసనం వారసురాలు నెదర్లాండ్స్ యువరాణి కాథరినా అమాలియా తనకు రానున్న భారీ వార్షిక అలవెన్స్ హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కింగ్ విల్లెం-అలెగ్జాండర్, క్వీన్ మాగ్జిమా పెద్ద కుమార్తె శుక్రవారం డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టేకు ఓ లేఖను రాసి పంపింది. అందులో.. ఆమె రాజ విధులు చేపట్టే వరకు దాదాపు 2 మిలియన్ డాలర్ల భత్యాన్ని తిరస్కరించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేసింది. రాచరికపు నిబంధనల ప్రకారం ఆమెకు 18 ఏట నుంచి.. ప్రతి సంవత్సరం అలవెన్స్‌ల కింద సుమారు రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 7న అమ్మడుకు 18 ఏళ్లు రానుండగా.. ఆమె దీనిని వద్దంటూ వివరణగా.. కష్టపడకుండా వచ్చే డబ్బులు తనకొద్దని తెలిపింది. View this post on Instagram A post shared by Koninklijk Huis (@koninklijkhuis) చదవండి: టెన్త్ ఫెయిల్, కానీ మనోడి స్టోరీ రాజమౌళికి తెలిస్తే ఇక సినిమానే!? -
రూ.6 కోట్లు: ఈ ఆలయం ముందు తిరుమల చిన్నదే
జైపూర్: రోజురోజుకు ప్రజల్లో భక్తి భావన పెరుగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఎన్నో రంగాలు బతుకుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెంచేవి కావడంతో ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా రెట్టింపవుతోంది. పరిస్థితి ఇలా ఉండడంతో ఎక్కడ ఉత్సవాలు జరిగినా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని ఓ ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో ఆదాయం ఊహించని రీతిలో వచ్చింది. ఆ ఆదాయం చూస్తే దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న ఆలయాలు షిర్డీ, తిరుమల చిన్నబోయేట్టు ఉన్నాయి. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గడ్‌లో సన్వాలియా సేథ్ ఆలయం ఉంది. ఆ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన దేవాలయం. ఇటీవల చతుర్ధశి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలు ముగియడంతో హుండీని తెరిచారు. హుండీలు బరువుగా ఉన్నాయి. తెరచి చూడగా అధికారులు ఊహించని స్థాయిలో కానుకలు వచ్చాయి. నగదుతో పాటు బంగారం, వెండి కానుకలు భారీగా ఉన్నాయి. మొత్తం లెక్కించగా హుండీ ఆదాయం అక్షరాల 6 కోట్ల 17 లక్షల 12 వేల 200 రూపాయలు వచ్చింది. ఇక బంగారం 91 గ్రాములు, వెండి 4 కిలోల 200 గ్రాములు కానుకగా వచ్చింది. నేడు కూడా హుండీ లెక్కింపు కొనసాగుతోంది. ఆలయ అధికారులు, కలెక్టర్ ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. మొత్తం కలిపితే ఆదాయం ఎంత వస్తుందోనని ఆసక్తికరంగా మారింది. -
అదృష్టమంటే ఇదే.. ఆరోసారి జాక్‌పాట్
వాషింగ్టన్ : లాటరీ ఆయన ఇంటి పేరుగా మారినట్టు ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు లాటరీ గెలవగా తాజాగా ఆరోసారి కూడా లాటరీ గెలిచి వార్తల్లో నిలిచాడు. అన్ని లాటరీల్లో కన్నా ఆరోసారి లాటరీలోనే అత్యధికంగా నగదు సొంతం చేసుకున్నాడు. ఏకంగా 2,50,000 డాలర్లు సొంతం చేసుకున్నాడు. అది మన కరెన్సీలో అయితే 1 కోటి 82 లక్షలు. అయితే ఆయన లాటరీల్లో సొంతం చేసుకున్న నగదును సమాజానికి వినియోగిస్తుండడం అభినందించే విషయం. ఇంతకు అతనెవరో కాదు బ్రియాన్ మోస్ అనే వ్యక్తి అమెరికాలోని ఇదహో రాష్ట్రానికి చెందినవాడు. ఆయన తాజాగా క్రాస్ వర్డ్ స్క్రాచ్ గేమ్ ఆడాడు. ఆ గేమ్‌లో వచ్చిన లాటరీలో ఆయన 1 కోటి 82 లక్షల నగదు బహుమతి సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. అయితే అలా లాటరీల్లో గెలిచిన నగదును ఆయన విలాసాలకు కాకుండా సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. ఇదహోలోని ప్రభుత్వ పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాల కల్పనకు వెచ్చిస్తున్నాడు. దాంతోపాటు తన కూతురి చదువు కోసం కొంత లాటరీ నగదును ఉపయోగిస్తున్నాడు. ‘‘ప్రభుత్వ విద్యాలయాల బాగుకు పని చేయడం నాకు గర్వంగా ఉంది. అందుకే లాటరీల్లో పాల్గొంటున్నా’’ అని బ్రియాన్ మోస్ తెలిపాడు. -
కాస్ట్లీ కరోనా టెస్టులు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకుండా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.2,200 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా, దానికి రెట్టింపునకు మించి మరి వసూలు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కరోనా అనుమానిత లక్షణాలున్న వారు గగ్గోలు పెడుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.2,200తో పాటు కొన్ని చోట్ల వచ్చిన వ్యక్తికి ఒక పీపీఈ కిట్ వేస్తున్నారు. శాంపిల్ తీసే వ్యక్తి కూడా మరోటి వేసుకుంటున్నాడు. ఈ రెండిం టికి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం పీపీఈ కిట్ ధర రూ.300కు మించి లేదు. కానీ ఒక్కో పీపీఈ కిట్‌కు రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్లయితే సాధారణ మాస్క్ కాకుండా, తప్పనిసరిగా ఎన్–95 మాస్క్ ధరించాల్సిందేనని ఇచ్చి, దానికి కూడా రూ. 300 వసూలు చేస్తున్నా రు. ఇలా అవకాశమున్నంత మేరకు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. కిట్ తీసుకుంటేనే టెస్ట్ ఇక కిట్‌కు టెస్ట్‌కు ముడి పెట్టడం మరో ఘోరమై న దోపిడీగా బాధితులు చెబుతున్నారు. బంజారాహి ల్స్‌లో ఉన్న ఒక కార్పొరేట్ ఆసుపత్రికి ఎవరైనా కరోనా లక్షణాలున్నాయన్న అనుమానం తో టెస్ట్ కోసం వెళ్తే పరీక్ష మాత్రమే చేసి పంప డం లేదు. కరోనా కిట్‌కు రూ.13,500 చెల్లిస్తేనే టెస్ట్ చేస్తున్నారు. తమకు నెగెటివ్ వస్తే కిట్‌తో ఉపయోగమేంటని ప్రశ్నిస్తే, అది తమ ఆసుపత్రి ప్రొటోకాల్ అని చెబుతున్నారు. ఒకవేళ మున్ముందు బాధితుల ఇంట్లో ఎవరికైనాపాజిటివ్ వచ్చి సీరియస్ అయితే బెడ్ కూడా సులువుగా దొరుకుతుందని మభ్యపెడుతున్నారు. ఇలా కిట్ల కూ టెస్టులకే కాకుండా బెడ్‌కూ ముడిపెడుతూ బాధితుల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. మరో ఆసుపత్రిలోనైతే ఏకంగా రూ.20 వేల హోం ఐసోలేషన్ కిట్ కొంటేనే టెస్ట్ చేస్తున్నారు. ఇక కొన్ని ఆసుపత్రులకు కరోనా టెస్ట్‌లు చేసే అనుమతి లేదు. దీంతో తమ వద్దకు వచ్చే బాధితులకు సీటీ స్కాన్ చేసి కరోనా నిర్ధారణ చేస్తున్నారు. సీటీ స్కాన్ కోసమే బాధితులు ఐదు వేల రూపాయలకు పైగా చెల్లించాల్సి వస్తుంది. చర్యలకు సిద్ధం.. రాష్ట్రంలో 23 ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టెస్టుల్లో జరుగుతున్న దోపిడీ.. కిట్ తీసుకుంటేనే టెస్ట్.. అనవసర సీటీ స్కాన్లపై వైద్య, ఆరోగ్య శాఖ సీరియస్‌గా ఉంది. దీనిపై గురువారం అధికారులు చర్చించారు. ఇలా ఇష్టారాజ్యంగా టెస్టులకు వసూళ్లు చేస్తున్న ఆసుపత్రులు, ల్యాబ్‌లపైనా చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నారు. మొదట్లో టెస్టులు సక్రమంగా చేయకపోవడం, శాంపిళ్ల సేకరణలోనూ లోపాలు వంటి వాటిపై 12 లేబొరేటరీలకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వేటిపైనా చర్యలు తీసుకోలేదు. దీన్నే అలుసుగా తీసుకొని కొన్ని ఆసుపత్రులు, లేబొరేటరీలు టెస్టులకు అధికంగా వసూలు చేస్తుండటంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వాటిపై నివేదిక కోరామని.. అనంతరం చర్యలు తీసుకుంటామని ఒక ఉన్నతాధికారి తెలిపారు. -
‘పుట్ట’లోంచి బయటపడుతున్న కట్టల పాములు!
ఆపరేషన్ వన్ వీక్... డిసెంబర్ 1నుంచి ఎన్నికలు జరిగే 7వ తేదీవరకు ఆపరేషన్ వన్‌వీక్ పేరుతో ఎన్నికల స్క్వాడ్స్, పోలీస్ బృందాలు, రెవెన్యూ పరిశీలకులు, పోలీస్ పరిశీలకులు ప్రత్యేక నిఘా పెట్టబోతున్నారు. అభ్యర్థుల అనుచరులు, వారి కదలికలను పసిగట్టి ఎక్కడికక్కడ దాడులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలు స్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే ఎనిమిది ప్రధాన మార్గాల్లో 18 చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. ఇప్పుడు మరో 8 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు తెలిసింది. అదే విధంగా జిల్లాల సరిహద్దుల్లో 58కి పైగా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అయితే ఇప్పుడు జిల్లాలు, ప్రధాన అర్బన్ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాల్లోకి వెళ్లే రూట్లలో ఒక్కో మార్గానికి 5 నుంచి 6 చెక్‌పోస్టులు ఏర్పాటుచేసేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక చెక్‌పోస్టు నుంచి తప్పించుకున్నప్పటికీ మరో చెక్‌పోస్టులో దొరికిపోయే అవకాశం ఉంటుందన్న పరిశీలకుల నివేదికతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పట్టుబడుతున్న మద్యం, నగదు చూసి ఎన్నికల సంఘం షాక్ తింటోంది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గరినుంచి ఇప్పటివరకు దాదాపుగా రూ.100 కోట్ల విలువైన మద్యం, నగదు, ఇతర వస్తువులను ఎన్నికల, పోలీస్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ఉధృతం చేస్తుండటం, ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రలోభాలు తీవ్రతరం కాబోతున్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీస్ శాఖ, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రత్యేక బృందాలు చివరి వారంరోజుల్లో మరిన్ని దాడులు, సోదాలు నిర్వహించబోతున్నాయి. ఇన్నాళ్లు జరిగింది ఒక ఎత్తు, ఈ వారంరోజులు జరగబోయే తంతు మరో ఎత్తుగా ప్రత్యేక బృందాలు భావిస్తున్నాయి. బంగారం, వెండి, గంజాయి.. టికెట్ల కేటాయింపు దగ్గరి నుంచి ప్రచారం ముగిసే ఆఖరిరోజు వరకు కార్యకర్తలు, నేతలతోపాటు ఓటర్లను ప్రలోభానికి గురిచేసేందుకు రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో నగదు, మద్యం, ఇతర కానుకలను ఇచ్చి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. డిసెంబర్ 7న జరిగే ఎన్నికలకు సరిగ్గా వారం రోజులముందు అంటే డిసెంబర్ 1నుంచి ఎన్నికల ప్రక్రియ జరిగే వరకు కీలకమైన రోజులను పార్టీలు, అభ్యర్థులు పెద్దఎత్తున ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేస్తాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనమవడమే ప్రలోభాల స్థాయికి పెద్ద ఉదాహరణ అని పోలీస్ శాఖ భావిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో పోలీస్ శాఖ తనిఖీల్లో రూ.62.18 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా ఐటీ విభాగం రూ.21.22 కోట్లను స్వాధీనపర్చుకుంది. అంటే, మొత్తం నగదు రూ.83 కోట్లుగా ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించారు. ఇక పోలీస్ శాఖ తనిఖీల్లో రూ.87లక్షల విలువైన 24,087 లీటర్ల మద్యం పట్టుబడింది. ఎక్సైజ్ నేతృత్వంలో దాడులు నిర్వహించగా రూ.9.20 కోట్ల విలువైన 41వేల లీటర్ల మద్యం పట్టుబడినట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. మొత్తంగా రూ.10 కోట్లకు పైగా విలువైన మద్యం ఎన్నికల నేపథ్యంలో స్వాధీనపరుచుకున్నారు. పోలీస్ శాఖ జరుపుతున్న తనిఖీల్లో భాగంగా బంగారం, వెండి, గుట్కా ప్యాకెట్లు, గంజాయి తదితరాలు సైతం పట్టుబడ్డాయి. ఇలా రూ.7.50 కోట్ల విలువైన బంగారం, వెండి, గుట్కా అక్రమ మార్గంలో రాష్ట్రానికి చేరినట్టు పోలీస్ శాఖ నివేదించింది. మొత్తంగా రూ.100 కోట్ల మేర నగదు, మద్యం, ఇతర వస్తువులు పట్టుబడటం ఎన్నికల కమిషన్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జహీరాబాద్‌లో రూ. 50 లక్షలు పట్టివేత జహీరాబాద్ టౌన్: కారులో తరలిస్తున్న రూ. 50 లక్షలను జహీరాబాద్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. స్థానిక డీఎస్పీ నల్లమల రవి వివరాలను వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దులోని చిరాగ్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని మాడ్గి చౌరస్తాలో జాతీయ రహదారిపై వాహనాలను తని ఖీలు చేస్తుండగా బొలేరో వాహనంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన అబ్దుల్ సత్తార్ వద్ద రూ.50 లక్షలు లభించాయన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసి ఎన్నికల సెల్‌కు సమాచారం అందించామని చెప్పారు. -
ప్రేయసి పోయింది.. లాటరీ తగిలింది..
లండన్: అదృష్టవంతుడిని ఆపలేరు.. దురదృష్టవంతుడిని మార్చలేరు అని ఓ సామెత ఉంది. చాలా మందికి అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. నిన్న మొన్నటిదాకా అతనో సాధారణ మనిషి. ఉద్యోగం కూడా లేదు. ఈ మధ్యనే ఆయన్ను కూడా ప్రేయసి వద్దు పొమ్మంది. జీవితం ఇంతే అనుకున్న తరుణంలో హఠాత్తుగా భాగ్యలక్ష్మి వచ్చి పడింది. బంపర్ లాటరీ తగిలింది. ఒక్కసారిగా లక్షాధికారి అయ్యాడు. యూకేకి చెందిన పాల్ లాంగ్ అనే ఓ నిరుద్యోగి కథ ఇది. పాల్ లాటరీలో 9.3 మిలియన్స్ పౌండ్స్(దాదాపు 851.62 లక్షలు) తగలడంతో ఒక్క రోజులోనే కోటీశ్వరైపోయాడు. లాల్‌కి లాటరీ తగిలిన విషయం యూకే పత్రికల్లో ద్వారా దేశం అంతటా తెలిసింది. దీంతో లాల్ ఆనందానికి అవద్దుల్లేకుండా పోయింది. ‘కొద్ది రోజులుగా జీవితంలో గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ 24 గంటలతో నా జీవితమే మారిందంటే నమ్మలేకపోతున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. నా ప్రేయసి నాతో కలిసి ఉన్నప్పుడే నేను లాటరీ వేశాను. ఇప్పుడు ఆమె నాతో లేదు. మేమిద్దరం స్నేహపూర్వకంగానే విడిపోయాం. ఆమెను పిలిచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని ది మిర్రర్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ చెప్పారు. పాల్ మాజీ ప్రేయసి జూలీ వెస్ట్(52) మాట్లాడుతూ.. పాల్కి లాటరీ తగలడం సంతోషంగా ఉంది. మేమిద్దరం కొన్ని కారణాల వల్ల విడిపోయాం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన జీవితం బాగుండాలని కోరుకుంటున్నానన్నారు. గతంలో ఫోర్డ్ ప్లాంట్లోలో ఉద్యోగం చేసిన పాల్, ఆరోగ్యకారణాల వల్ల ఉద్యోగం మానేశారు. ‘లాటరీ డబ్బులను వృధాగా ఖర్ఛు చేయను. ఓ కారును కొంటాను. మిగతా డబ్బుతో కుటుంబానికి, స్నేహితులకి సహాయం చేస్తాను. పిల్లల ఆరోగ్య సమస్యలకై కొంత డబ్బు డిపాజిట్ చేస్తాను. నేను సాధారణ వ్యక్తిని. ఇప్పుడు కూడా సాధారణంగానే ఉంటాను. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేస్తాను’ అని పాల్ పేర్కొన్నారు. -
చెన్నై రైల్లో భారీ లూటీ
-
చెన్నై రైల్లో భారీ లూటీ
5.78 కోట్ల ఆర్బీఐ సొమ్ము ఎత్తుకెళ్లినదుండగులు సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి చెన్నై ఎగ్మూరుకు వస్తున్న రైలులో రూ.5.78 కోట్ల డబ్బును దొంగలు దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. చిరిగిపోయిన, 2005కు ముందు ముద్రించిన నోట్లను సేలం నుంచి చెన్నై ఆర్బీఐ (భారతీయ రిజర్వు బ్యాంకు) శాఖకు తరలిస్తుండగా దొంగతనం జరిగింది. ఈ నోట్ల మొత్తం విలువ రూ.340 కోట్లు కాగా దొంగలు రూ.5 కోట్లను ఎత్తుకెళ్లారు. నోట్లను 226 చెక్కడబ్బాల్లో అమర్చి, మూడు ప్రత్యేక బోగీల్లో పెట్టారు. బోగీలను సోమవారం రాత్రి సేలం-ఎగ్మూరు రైలుకు తగిలించి చెన్నైకి తరలిస్తుండగా మార్గమధ్యంలో దొంగతనం జరిగింది. మూడు బోగీల్లో ఒకదానికి పైన రంధ్రం వేసి ఉంది. అందులోని 4 చెక్కడబ్బాలను పగ లగొట్టి దొంగలు డబ్బు దోచుకెళ్లారు. రైలు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు చెన్నై ఎగ్మూరుకు చేరుకుంది. డబ్బు స్వాధీనం చేసుకోడానికి స్టేషన్‌కు 11 గంటలకు వచ్చిన ఆర్బీఐ అధికారులు బోగీ పైభాగంలో మనిషి దూరేంత రంధ్రం ఉండడాన్ని గుర్తించారు. రూ.5 కోట్ల డబ్బు మాయమైనట్లు ప్రకటించారు. సేలం-విరుధాచలం స్టేషన్ల మధ్య ైరె లు పట్టాలపై విద్యుత్తు తీగలు లేవనీ, కాబట్టి రైలు ఈ స్టేషన్ల మధ్య ఉన్నపుడే దొంగలు బోగీపైన రంధ్రం చేసుకుని లోపలికి దిగి దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రైలులో రూ.342 కోట్ల డబ్బు మాయం