కృష్ణరాజపురం : భార్యను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా ఆమెపై అనుమానం పెంచుకున్న భర్త.. ఇంట్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాడు. భర్త పైశాచికత్వాన్ని భరించలేని భార్య పోలీసులను ఆశ్రయించింది.ఈ ఘటన బెంగళూరులోని రామ్మూర్తినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన ప్రదీప్ మూపర్తి బెంగళూరు నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన అనూపతో వివాహమైంది. ఆ సమయంలో రూ.15 లక్షల నగదు, 12 తులాల బంగారం ఇచ్చి రూ.45 లక్షలు ఖర్చు చేసి పెళ్లిని ఘనంగా వివాహం జరిపించారు. కొద్ది కాలం భార్యను బాగానే చూసుకున్న ప్రదీప్.. మెల్లగా తనలోని పైశాచికత్వాన్ని బహిర్గతం చేశాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ప్రదీప్ పడకగదిలో, వంటగదిలో, హాల్‌లో సీసీ కెమెరాలు అమర్చాడు. దీంతోపాటు కెమెరాతో వీడియో తీస్తూ తన ముందు నగ్నంగా నడవాలంటూ అనూపను వేధించేవాడు. అందుకు నిరాకరించిన అనూపను శారీరకంగా కూడా వేధించాడు. మరో వైపు బెంగళూరులోనే ఉంటున్న ప్రదీప్ అక్క ప్రశాంతి, ఆమె భర్త సంజీవ్‌లు అనూపను శారీరకంగా, మానసికంగా హింసించా రు. ఓ దశలో అనూపను పుట్టింటికి పం పించారు. దీంతో అనూప తల్లితండ్రులు అదనంగా రూ.5 లక్షలు ఇచ్చారు. దీన్ని అదునుగా భావించి ముగ్గురు మరింత అదనపు కట్నం తేవాలంటూ వేధించసాగారు.
విడాకులు విషయం దాచి రెండో పెళ్లి...
ప్రదీప్‌కు ఇదివరకే వివాహం కాగా మొదటి భార్యను కూడా ఇదే విధంగా వేధింపులకు గురి చేయడంతో సదరు మహిళ విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని దాచిపెట్టిన ప్రదీప్ తల్లితండ్రులు మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన అనూపతో వివాహం జరిపించారు. కొద్ది కాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్న ప్రదీప్ అక్క ప్రశాంతి.. కొద్ది రోజుల క్రితం అనూపను తన ఇంటికి తీసుకెళ్లి ప్రదీప్ మొదటి వివాహం సీడీని చూపించి మొదటి భార్య తల్లితండ్రులు ఇంకా ఎక్కువ మొత్తంలో తన తమ్మడికి కట్నకానుకలు ఇచ్చారని అంతకంటే ఎక్కువ మొత్తంలో అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధిం చింది. అనూప తల్లితండ్రులు వచ్చి ఆరా తీయగా ప్రదీప్ మొదటి వివాహం వ్యవహార ం వెలుగు చూసింది. అంతేగాకుండా ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చి నగ్నవీడియోలు చిత్రీకరించిన విషయం కూడా బహిర్గతమైంది. దీంతో అనూప ఈనెల 4వ తేదీ భర్త ప్రదీప్‌తో పాటు ప్రదీప్ అక్కబావలైన ప్రశాంతి, సంజీవ్‌కుమార్‌లపై రామ్మూర్తినగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరాలు అమర్చి పైశాచికత్వం
Published Sat, Jan 19 2019 9:09 AM | Last Updated on Sat, Jan 19 2019 9:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment