అదనపు కట్నం కోసం 4 రోజులుగా ఇంట్లోనే శవం!
గుంటూరు: తుళ్లూరు మండలం శాఖమూరులో అత్తింటి వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కోడలు ఆత్మహత్య చేసుకున్న అదనపు కట్నం కోరిన అత్తమామలు - నాలుగు రోజులుగా ఇంట్లోనే శవం - భర్తపై భార్య బంధువుల దాడి... దాంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అత్తవారి వేధింపులకు తట్టుకోలేక శ్రీలక్ష్మి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.కోడలు చనిపోయినా అత్తమామలకు కనికరంలేదు. ఇంకా అదనపు కట్నం కావాలని శ్రీలక్ష్మి మృతదేహాన్ని నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంచారు.
ఎట్టకేలకు పెద్దల సమక్షంలో పంచాయతీ కుదిరింది. అత్యక్రియల సమయంలో శ్రీలక్ష్మి భర్తపై ఆమె బంధువులు దాడి చేశారు. దాంతో భర్త బంధువులు శ్రీలక్ష్మి మృతదేహాన్ని రోడ్డు మీదే వదలి వెళ్లిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షస్తున్నారు.