corpse at home
-
3 నెలలుగా తండ్రి శవంతోనే జీవనం .. కారణం తెలిసి కంగుతిన్న పోలీసులు
కోల్‌కతా: చనిపోయిన వారి మృతదేహాలను ఇంట్లోనే పెట్టుకుని.. వాటితో కలిసి జీవించే దృశ్యాలను ఎక్కువంగా సినిమాలో చూసుంటాం. కానీ ఇటువంటి ఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరణించిన తన తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి మూడు నెలలుగా దానితో కలిసి జీవిస్తున్నాడు. చివరికి పోలీసుల రంగప్రవేశంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని కేపీరాయ్ లేన్‌లో సంగ్రామ్ డే (70) బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో మాజీ ఉద్యోగి. గత కొన్ని నెలలుగా స్థానిక ప్రజలు సంగ్రామాన్ని చూడలేదు. అతని కొడుకు కౌశిక్ డే కూడా చుట్టు పక్కల వారితో పెద్దగా మాట్లాడడు కాబట్టి వారికి మొదట్లో అనుమానం రాలేదు. అయితే ఇటీవల కౌశిక్ ప్రవర్తన కాస్త వింతగ ఉండడం, అతని తండ్రి కనపడకపోవడంతో స్థానికులు గార్ఫా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఇంటికి వెళ్లగా కౌశిక్ తలుపులు కూడా బలవంతంగా తెరిచాడు. ఇంటిలోకి వెళ్లి చూడగా, కుళ్లిపోయిన స్థితిలో మంచంపై పడి ఉన్న సంగ్రామ్ మృతదేహాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అతని భార్య అరుణా డే పక్షవాతం కారణంగా మంచాన పడింది. మూడు నెలల క్రితం తన తండ్రి చనిపోయాడని, అయితే సంగ్రామ్ మళ్లీ మేల్కొంటాడని భావించానని కౌశిక్ పోలీసులకు చెప్పాడు. కౌశిక్ సమాధానాలు విన్న పోలీసులు అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోందిని చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. చదవండి: ‘మా పొట్ట కొట్టకండి సారూ.. గంజాయి పండించుకుంటాం’ -
షాకైన పోలీసులు.. ఆ ఇంట్లో ఏం జరిగిదంటే..?
చెన్నై: 4జీ దాటుకుని 5జీ యుగంలోకి అడుగుపెడుతున్నప్పటికీ కొందరు ఇప్పటికీ మూఢనమ్మకాలనే గుడ్డిగా నమ్ముతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి ఘటనే అందుకు ఉదాహరణ. తాజాగా తమ తల్లి చనిపోయినప్పటికీ తిరిగి బతుకుతుందనే నమ్మకంతో ఆమె మృతదేహం వద్దే మూడు రోజులుగా పూజలు చేశారు ఆమె కూతుళ్లు. ఈ వింత ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. మణపారై సమీపంలోని చొక్కంపట్టి వీజీపీ ఫ్లాట్‌కు చెందిన మేరీ (75) తన కుమార్తెలు జయంతి (43), జెసిందా (40)తో కలిసి ఉంటోంది. గత వారం మేరీకి ఆరోగ్యం సరిగా లేకోవడంతో తిరుచ్చి నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. తమ తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వెళ్లిన కూతుళ్లు ఆమె బతకాలని రెండు రోజులుగా మృతదేహం వద్ద పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ తతంగాన్ని గమనించన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపలి దృశ్యాన్ని చూసి షాక్కయ్యారు. రెండు రోజుల క్రితమే మేరీ చనిపోయినా, ఆమె బతుకుతుందనే నమ్మకంతో ఆమె మృతదేహం వద్ద ఇద్దరు కుమార్తెలు పూజలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. తమ తల్లి బతికే ఉందని, త్వరలో నిద్ర లేచివస్తుందని చెప్పిన కుమార్తెలు పోలీసులను తిరిగి వెనక్కి పంపేందుకు కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలో మేరీ మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన 108 సిబ్బందిని కూడా వారు అడ్డుకున్నారు. చివరికి ఎలానో మేరీ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు వారిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. చదవండి: Nagaon Central Jail: 85 మంది ఖైదీలకు హెచ్ఐవీ.. షాక్‌లో అధికారులు -
ఎంత చెప్పినా ఇల్లు ఖాళీ చేయకపోవడంతో..
టోక్యో : తల్లి శవాన్ని 10 ఏళ్ల పాటు ఫ్రీజర్‌లో దాచిపెట్టిన ఉదంతం జపాన్‌లో వెలుగుచూసింది. టోక్యోలోని ఓ అపార్ట్మెంట్లో 48 ఏళ్ల యుమి యోషినో అనే మహిళ మున్సిపల్ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో తల్లితో కలిసి నివసిస్తోంది. ఈ నేపథ్యంలో జనవరిలో అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాల్సిందిగా యజమాని ఆదేశించారు. అయితే ఎంతచెప్పినా ఇంటిని వదిలి వెళ్లకపోవడంతో ఆమెపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. (అధ్యక్షుడి హత్యకు కుట్ర.. విషంతో లేఖ) తన తల్లి చనిపోయాక ఆమెను విడిచి ఉండలేక పోయానని, అందుకే తనతోనే అపార్ట్మెంట్లో ఉంచుకున్నానని యోషినో తెలిపింది. గత పదేళ్లుగా తల్లి శవాన్ని ఫ్రీజర్‌లోనే దాచి ఉంచినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. మహిళ చనిపోయే నాటికి 60 ఏళ్ల వయసు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులోనూ ఆమె ఎప్పుడు చనిపోయింది? ఏ కారణంగా చనిపోయింది అన్నది వెల్లడి కాలేదని పేర్కొన్నారు. (లేడీ డాక్టర్‌ను కాల్చిచంపిన ఇండియన్ డాక్టర్) -
కలకలం.. శవంతో సావాసం!
సాక్షి, శ్రీకాకుళం రూరల్: ఇంట్లోనే శవం ఉన్నా కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. కనీసం ఆమె ఉన్నారో..లేదో కూడా వారికి జ్ఞాపకం లేదు. శవం కుళ్లిపోయి దుర్వాస వచ్చినా తెలియరాలేదు. చివరకు ఆ వీధిలో వారు విపరీతంగా వస్తున్న వాసనను భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటన శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యనగర్ కాలనీలో శుక్రవారం వెలుగుచూసింది.రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలాకి సత్యనారాయణ ఇరిగేషన్ శాఖలో అటెండర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. ఇతనికి భార్య ఈశ్వరమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా ఆదిత్యనగర్ కాలనీలో సొంత ఇంట్లో నివసిస్తున్నారు. అయితే వీరికి ఇరుగుపొరుగు వారితో ఎలాంటి సబంధం లేదు. దీంతో వీరిని కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఈ క్రమంలోనే సత్యనారాయణ భార్య ఈశ్వరమ్మ(60) ఓ గదిలో చనిపోయారు. అయితే ఎప్పుడు చనిపోయిందో కానీ ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. (చదవండి: దారుణం: జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ..) శవం కుళ్లిపోయి వాసన వస్తున్నా గుర్తించలేకపోయారు. రోజురోజుకూ పెరిగిపోతున్న దుర్వాసనను భరించలేని స్థానికులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది, రెడ్‌క్రాస్ ప్రతినిధులు అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. మంచంపై కుళ్లిపోయి ఈశ్వరమ్మ శవం కనిపించింది. ఇళ్లంతా చెత్తతో నిండి ఉంది. అందులో ఉంటున్నవారంతా మతిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కనిపించారు. వారి నుంచి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నించినా సమాధానం చెప్పలేకపోయారు. మానసికంగా ఇంట్లో అందరి పరిస్థితి ఒకేలా ఉండడం, ఈశ్వరమ్మకు తిండి లేకపోవడంతోనే చనిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు స్వర్గధామ రథంలో మృతదేహాన్ని రోటరీ శ్మశానవాటికకు తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. కాగా ఈ కుటుంబం గురించి స్థానికులతో పోలీసులు మాట్లాడగా.. అప్పుడప్పుడూ సత్యనారాయణ బయటకు వెళ్లి సామాన్లు తీసుకొని వచ్చేవారని, ఎవరితో మాట్లాడేవారు కాదని, ఇంటినిండా చెత్తను ఉంచుకునేవారని చెప్పారు. (చదవండి: సోషల్ మీడియాలో పరిచయం.. ఆపై) -
అదనపు కట్నం కోసం 4 రోజులుగా ఇంట్లోనే శవం!
-
అదనపు కట్నం కోసం 4 రోజులుగా ఇంట్లోనే శవం!
గుంటూరు: తుళ్లూరు మండలం శాఖమూరులో అత్తింటి వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కోడలు ఆత్మహత్య చేసుకున్న అదనపు కట్నం కోరిన అత్తమామలు - నాలుగు రోజులుగా ఇంట్లోనే శవం - భర్తపై భార్య బంధువుల దాడి... దాంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అత్తవారి వేధింపులకు తట్టుకోలేక శ్రీలక్ష్మి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.కోడలు చనిపోయినా అత్తమామలకు కనికరంలేదు. ఇంకా అదనపు కట్నం కావాలని శ్రీలక్ష్మి మృతదేహాన్ని నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంచారు. ఎట్టకేలకు పెద్దల సమక్షంలో పంచాయతీ కుదిరింది. అత్యక్రియల సమయంలో శ్రీలక్ష్మి భర్తపై ఆమె బంధువులు దాడి చేశారు. దాంతో భర్త బంధువులు శ్రీలక్ష్మి మృతదేహాన్ని రోడ్డు మీదే వదలి వెళ్లిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షస్తున్నారు.