
టోక్యో : తల్లి శవాన్ని 10 ఏళ్ల పాటు ఫ్రీజర్‌లో దాచిపెట్టిన ఉదంతం జపాన్‌లో వెలుగుచూసింది. టోక్యోలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 48 ఏళ్ల యుమి యోషినో అనే మహిళ మున్సిపల్ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తల్లితో కలిసి నివసిస్తోంది. ఈ నేపథ్యంలో జనవరిలో అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాల్సిందిగా యజమాని ఆదేశించారు. అయితే ఎంతచెప్పినా ఇంటిని వదిలి వెళ్లకపోవడంతో ఆమెపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది.
(అధ్యక్షుడి హత్యకు కుట్ర.. విషంతో లేఖ)
తన తల్లి చనిపోయాక ఆమెను విడిచి ఉండలేక పోయానని, అందుకే తనతోనే అపార్ట్‌మెంట్‌లో ఉంచుకున్నానని యోషినో తెలిపింది. గత పదేళ్లుగా తల్లి శవాన్ని ఫ్రీజర్‌లోనే దాచి ఉంచినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. మహిళ చనిపోయే నాటికి 60 ఏళ్ల వయసు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులోనూ ఆమె ఎప్పుడు చనిపోయింది? ఏ కారణంగా చనిపోయింది అన్నది వెల్లడి కాలేదని పేర్కొన్నారు. (లేడీ డాక్టర్‌ను కాల్చిచంపిన ఇండియన్ డాక్టర్)
Comments
Please login to add a commentAdd a comment