తుళ్లూరు మండలం శాఖమూరులో అత్తింటి వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కోడలు ఆత్మహత్య చేసుకున్న అదనపు కట్నం కోరిన అత్తమామలు - నాలుగు రోజులుగా ఇంట్లోనే శవం - భర్తపై భార్య బంధువుల దాడి... దాంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అత్తవారి వేధింపులకు తట్టుకోలేక శ్రీలక్ష్మి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.కోడలు చనిపోయినా అత్తమామలకు కనికరంలేదు. ఇంకా అదనపు కట్నం కావాలని శ్రీలక్ష్మి మృతదేహాన్ని నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంచారు.