Sakhamuru
-
చెప్పింది విను.. ఇచ్చింది తీస్కో
శాఖమూరు ఎస్సీలకు టీడీపీ నేత బెదిరింపులు తుళ్లూరు రూరల్ : ‘మేం చెప్పినట్టు వింటే మీకు కొంతైనా ప్రయోజనం ఉంటుంది. వినకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం’ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు శాఖమూరు దళితులను బెదిరిస్తున్నారు. 1991లో 44 మంది ఎస్సీలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారికి తెలియకుండా ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చేసిన టీడీపీకి చెందిన బడా రైతు పరిహారం కింద వచ్చే ప్లాట్లు, కౌలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఆ నాయకుడి అక్రమాన్ని ఇటీవల సాక్షి వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఉలిక్కిపడ్డ ఆ నాయకుడు ఎస్సీల్లో కొందరిని బెదిరించే పనిలో నిమగ్నమయ్యాడు. నయానో, భయానో వారిని నోరెత్తకుండా చేసి మొత్తం భూమిని కాజేయాలనేది ఆయన ఎత్తుగడగా తెలుస్తోంది. ఒకవేళ ఒప్పుకోకపోతే సగానికి తెగ్గొట్టి మిగిలిన సగం తన సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. శాఖమూరుకు చెందిన 44 మంది దళితులు, ఎరుకుల కులస్తులకు 1991లో సర్వే నంబర్ 86/ఏ లోని 2.40 ఎకరాలను 4 సెంట్ల చొప్పున నివాస స్థలాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అందులో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకుంటే... మరి కొందరు ఆర్థిక ఇబ్బందులతో ఖాళీగా ఉంచారు. గ్రామంలో ఖాళీ స్థలం ఉండటంతో టీడీపీ నాయకుడు రెవెన్యూ అధికారుల సహకారంతో రికార్డులను తారుమారు చేసి కాజేసే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న రైతులు వైఎస్సార్సీపీ నేతలను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సాక్షిలో కథనం రావడంతో రెవెన్యూ అధికారులు తామేమీ చేయలేమని చేతులెత్తేసినట్లు తెలిసింది. దీంతో ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చిన టీడీపీ నాయకుడు ఎస్సీలను పిలిచి తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. ‘ఇంతటితో ఆగిపోతే ఉన్న భూమిలో సగమైనా వచ్చేలా చేస్తా.. లేదంటే పూర్తిగా రాకుండా చేస్తాను. తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీచేసినట్లు బాధితులు వివరించారు. -
అదనపు కట్నం కోసం 4 రోజులుగా ఇంట్లోనే శవం!
-
అదనపు కట్నం కోసం 4 రోజులుగా ఇంట్లోనే శవం!
గుంటూరు: తుళ్లూరు మండలం శాఖమూరులో అత్తింటి వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కోడలు ఆత్మహత్య చేసుకున్న అదనపు కట్నం కోరిన అత్తమామలు - నాలుగు రోజులుగా ఇంట్లోనే శవం - భర్తపై భార్య బంధువుల దాడి... దాంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అత్తవారి వేధింపులకు తట్టుకోలేక శ్రీలక్ష్మి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.కోడలు చనిపోయినా అత్తమామలకు కనికరంలేదు. ఇంకా అదనపు కట్నం కావాలని శ్రీలక్ష్మి మృతదేహాన్ని నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంచారు. ఎట్టకేలకు పెద్దల సమక్షంలో పంచాయతీ కుదిరింది. అత్యక్రియల సమయంలో శ్రీలక్ష్మి భర్తపై ఆమె బంధువులు దాడి చేశారు. దాంతో భర్త బంధువులు శ్రీలక్ష్మి మృతదేహాన్ని రోడ్డు మీదే వదలి వెళ్లిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షస్తున్నారు. -
'చంద్రబాబును నమ్మలేకపోతున్నాం'
గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నమ్మలేకపోతున్నామని శాఖమూరు, అనంతవరం గ్రామాల రైతులు చెప్పారు. రాజధాని కోసం భూములు ఇస్తే, రుణమాఫీలా చేస్తారేమోనని భయంగా ఉందన్నారు. భూములు ఇవ్వడానికి పలు గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. రైతులు, కూలీల అభిప్రాయం తెలుసుకునేందుకు వైఎస్ఆర్ సీపీ కమిటీ సభ్యులు ఈరోజు ఆయా గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు, కూలీల అభిప్రాయాలు తెలుసుకునేందుకే తాము ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఏ వర్గానికి నష్టం జరిగినా పోరాటానికి తాము సిద్ధంగా ఉంటామని చెప్పారు. కూలీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిన తరువాతే భూమిని సేకరించాలని వారు అన్నారు. రైతుల డిమాండ్లు అన్నిటినీ ఏపీ ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. **