అదనపు కట్నం కోసం వేధించడమేగాకుండా, తనను వదిలించుకునేందుకు అర్ధరాత్రి పసిబిడ్డతో సహా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిర్ధాక్షిణ్యంగా తన భర్త తనను వదిలి వెళ్లాడని ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ వాపోయింది.గురువారం బాలల హక్కుల సంఘం నేతలతో కలిసి వివరాలు వెల్లడించింది. వనస్థలిపురంకు చెందిన శిరీషను, రామంతపూర్‌కు చెందిన యలాల కీర్తిసాయిరెడ్డికి ఇచ్చి 2015జూన్‌లో పెళ్లి చేశారు. పెళ్‌లైన పదిరోజులకు భర్తతో కలిసి అమెరికాలోని వర్జినియాకు వెళ్లింది. కొద్ది రోజులకే భర్త కీర్తిసాయిరెడ్డి, అత్త వనిత నుంచి ఆమెకు వేధింపులు మొదలైయ్యాయి.