NRI woman
-
సైబర్ క్రైమ్ సొమ్ముతో ఎన్నారై మహిళకు టోకరా
బంజారాహిల్స్: సైబర్ మోసంలో సంపాదించిన డబ్బుతో ఓ ఎన్ఆర్ఐ మహిళ ఇల్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి పథకం ప్రకారం ఆమె ఇంటిని కబ్జా చేసి ఆమె బ్యాంకు ఖాతాను సైబర్ పోలీసులు సీజ్ చేసే విధంగా పావులు కదిపిన ఘటనలో నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలో నివసించే డాక్టర్ బినోతి మార్తాండ్‌కు జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లోని నందగిరిహిల్స్ లే అవుట్లో ప్లాట్ నెంబర్ 81లో 334 గజాల్లో ఇల్లు ఉంది. 2022లో సదరు ఇంటిని అమ్మకానికి పెట్టిన ఆమె ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా వివరాలు నమోదు చేశారు. అలాగే గురునాథ్ అనే వ్యక్తిని అమ్మకానికి సంబంధించి ఎంక్వైరీ కోసం ఏజెంట్‌గా నియమించుకున్నారు. 2022లో ఆమె యూఎస్‌లో ఉండగా ఎస్బీకే గ్రూప్ చైర్మన్ బాబు అలియాస్ షేక్ బషీర్ పేరుతో వాట్సాప్ కాల్ వచి్చంది. నందగిరిహిల్స్‌లోని మీ ప్లాట్‌ను కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు షేక్ బషీర్ చెప్పడంతో ఆమె ఇంటిని రూ. 12.50 కోట్లకు విక్రయిస్తున్నట్లు తెలిపింది. సదరు మొత్తాన్ని షేక్ బషీర్ ఆరీ్టజీఎస్ ద్వారా పలుమార్లు ఆమె ఖాతాకు బదిలీ చేశాడు. ఈ ఏడాది జూలై 18న ఈ మొత్తం ఆమె ఖాతాలో జమ చేసినట్లు ఆధారాలు పంపించిన అతను అదే రోజు తాను ఇంట్లో దిగుతున్నానంటూ ఆమెకు ఫోన్‌చేసి చెప్పి ఇంటిని తన ఆ«దీనంలోకి తీసుకున్నాడు. జూలై 19న ఆమెకు బ్యాంకు నుంచి మీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నామంటూ సైబర్ పోలీసులు నోటీసు పంపడంతో నివ్వెరపోయింది. వెంటనే ఆమె బాబు అలియాస్ షేక్ బషీర్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. బ్యాంకు అధికారులను ఆరా తీయగా ఈ మొత్తం డబ్బు సైబర్ మోసం ద్వారా సంపాదించినదని చెప్పారు. అంతే కాకుండా షేక్ బషీర్ ఆమె ఇంటిని ఆక్రమించమే కాకుండా చంపేస్తానని బెదిరించాడు. ఆమె ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు తొలగించి తాజాగా తన సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు. జూలై 28న ఇండియాకు వచి్చన బాధితురాలు తన కుమారుడితో కలిసి ఇంటికి వెళ్లగా బషీర్ అనుచరులు అందులో ఉన్నారు. తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఇంటిని స్వా«దీనం చేసుకున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు బషీర్ కోసం గాలిస్తున్నారు. -
అమెరికాలో అదృశ్యమైన ఎన్ఆర్ఐ లహరి మృతి
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన లహరి పతివాడ(25) అనే భారతీయ-అమెరికన్ మహిళ శవమై కనిపించింది. సరిహద్దు రాష్ట్రమైన ఓక్లహోమాలో దాదాపు 322 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం లభ్యమైంది. నివేదికల ప్రకారం.. టెక్సాస్‌లోని కాలిన్స్ కౌంటీలోని మెకిన్నే ప్రాంతంలో నివాసం ఉంటున్న లహరి పతివాడ చివరి సారిగా డల్లాస్ పరిసరాల్లోని ఎల్ డొరాడో పార్క్‌వే , హార్డిన్ బౌలెవార్డ్ బ్లాక్ ప్రాంతాల్లో టయోటా కారు నడుపుతూ కనిపించారు. వావ్ అనే స్థానిక టెక్సాస్ సంస్థ ద్వారా ఆమె అదృశ్యమైన వార్త సోషల్ మీడియాలో వ్యాపించింది. మే 12న ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో ఆమె స్నేహితులు ఓక్లహోమాలో ఆమె ఫోన్‌ను ట్రాక్ చేశారు. ఆమె ఫేస్బుక్ పేజీ ప్రకారం.. లహరి ఓవర్‌ల్యాండ్ పార్క్ ప్రాంతీయ వైద్య కేంద్రంలో పనిచేసేవారు. బ్లూ వ్యాలీ వెస్ట్ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె కాన్సాస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు. ఇదీ చదవండి: Viral Video: ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్ హతం -
ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతి
-
హైదరాబాద్‌లో ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య
నేరేడ్మెట్: మూడుముళ్ల బంధంతో ఎన్నో కలలతో జీవించడానికి ఖండాంతారాలు దాటి వెళ్లిన ఆమెకు భర్త నరకాన్ని చూపించాడు. దేశంకాని దేశంలో అండగా ఉండాల్సిన భర్త పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవాలని వేధింపులకు దిగాడు. భర్త వేధింపులతో విసుగు చెందిన ఆమె అమెరికా నుంచి భారత్‌కు వచ్చేసింది. వచ్చిన రోజుల వ్యవధిలోనే పుట్టింట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈసంఘటన నేరేడ్మెట్ పోలీసుస్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. నేరేడ్మెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని కాకతీయనగర్‌కు చెందిన గంగాదేవి, మల్దారి దంపతుల కూతురు మాధురి(27)తో 2016 నవంబర్‌లో ఇదే ప్రాంతానికి చెందిన కోటేశ్వర్‌రావుతో వివాహం జరిపించారు. పెళ్లి తరువాత భార్యాభర్తలిద్దరూ అమెరికాకు వెళ్లారు. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. అక్కడికి వెళ్లిన తరువాత వీకెండ్ పార్టీల్లో పాల్గొనాలని, మద్యం తాగాలని, పేకాట ఆడటం, స్నేహితులను ఇంటికి పిలిచి..వారితో డాన్స్ చేయాలని భార్యను వేధింపులకు గురి చేశాడు. భర్త చేష్టలతో విసుగి చెందిన భార్య ఈ విషయాలను తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ విషయమై తల్లిదండ్రులు పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఈనెల 11న మాధురి భారత్‌కు వచ్చి కాకతీయనగర్‌లోని పుట్టింట్లో ఉంటుంది. తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు, మృతదేహాన్ని శవపంచనామ కోసం ఆసుపత్రికి తరలించామని సీఐ తెలిపారు. -
ఆత్మలు తిరుగుతున్నాయని ఎన్ఆర్ఐ మహిళ..
బంజారాహిల్స్: తన చుట్టూ ఆత్మలు తిరుగుతున్నాయని తనను భూతం ఆవహించిందని రాత్రిళ్ళు శ్మశానంలోకి రావాలంటూ పిలుపులు వస్తున్నాయని మానసికంగా ఆందోళన చెందుతున్న ఓ ఎన్ఆర్ఐ మహిళ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.10, జహీరానగర్‌కు చెందిన అతియా షకీర్(42) కెనెడాలో ఉండేది. ఆమెకు ఐదుగురు సంతానం. కొంత కాలంగా తన చుట్టూ ఆత్మలు తిరుగుతున్నాయంటూ ఆందోళన చెందుతున్న ఆమె చికిత్స నిమిత్తం జహీరానగర్‌లోని తన ఇంటికి వచ్చింది. మూడు రోజులుగా మతిస్తిమితం కోల్పోయిన ఆమె మంగళవారం తెల్లవారుజామున తన ఇంటి ఐదో అంతస్తుపైకి ఎక్కి కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాత్ టబ్‌లో పడి ఎన్నారై మహిళ మృతి!
ఫరిదాబాద్: హరియాణాలో ఓ ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఫరిదాబాద్‌లోని తాజ్ వివాంట హోటల్లో బాత్ టబ్‌లో పడి ఉన్న మహిళ మృతదేహన్ని ఆలస్యంగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లండన్‌లో స్థిరపడిన భారత సంతతి మహిళ రీతూ కుమార్ (40) ఈ నెల 22న భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఫరిదాబాద్‌లోని తాజ్ వివాంట హోటల్ బస చేస్తున్నారు. కాగా ఆమె కుటుంబ సభ్యులు గురువారం రీతూ కుమార్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో వారు ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం హోటల్లోని వచ్చి ఆమె గదిలోకి వెళ్లి చూడగా బాత్రూంలో ఆమె మృతదేహం లభించింది. కాగా ఆమె గత కొద్ది రోజులుగా తన భర్తతో కలిసి ఉండడం లేదని, ఆమె గదికి కూడా హోటల్ సిబ్బందిని రావద్దని చెప్పినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు. -
ఎన్ఆర్ఐ మహిళ అదృశ్యం
ముంబై : భారత సంతతికి చెందిన మహిళ అదృశ్యమైన ఘటన ముంబై నగరంలో కలకలం రేపింది. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న 76 ఏళ్ల దేవికమ్మ పిళ్లై అనే మహిళ లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి భువనేశ్వర్‌లో రైలులో బయలు దేరిన అదృశ్యమైనట్టు రైల్వే పోలీసులు తెలిపారు. సెలవులు గడపడానికి నెల కిందట వచ్చిన ఆమె ఫిబ్రవరి 21 నుంచి దక్షిణ ముంబైలో కొలబ ప్రాంతంలోని గెస్ట్ హౌస్‌లో ఉంటోంది. ఫిబ్రవరి 23న భువనేశ్వర్‌కు రైలులో వెళ్లినప్పటి నుంచి కనిపించటం లేదని ఆమె కూతురు సమాచారమిచ్చినట్లు రైల్వే పోలీసులు చెప్పారు. చివరిసారిగా ఆమె మహారాష్ట్రలోని గోండిగా ప్రాంతంలో ఉన్నట్లు ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించినట్టు వెల్లడించారు. మార్చి 1న దేవికమ్మ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దక్షిణాఫ్రికా నుంచి ఆమె కూతురు గెస్ట్ హౌస్‌కు ఫోన్ చేసింది. ఆమె అక్కడి నుంచి వెళ్లపోయి, ఇంటికి తిరిగి రాకపోవడంతో ముంబైలోని పోలీసులను సంప్రదించింది. ఆమె కనిపించకుండా పోవడంతో గెస్ట్‌హౌస్ మెనేజర్ ఫిర్యాదు చేశాడు. భువనేశ్వర్‌లో ఆమె ఏ స్నేహితురాలిని కలుస్తానని వెళ్లిందో తెలుసుకున్నామని రైల్వేపోలీసు అధికారి మహేశ్ బల్వంత్‌రావ్ అన్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేసి ఆమె ఆచూకీ కనుగొంటామన్నారు. -
రేప్ చేశాడని ఫిర్యాదు చేసి.. జడ్జీ ముందు..
సాక్షి, న్యూఢిల్లీ: తనపై అత్యాచారం జరిగిందంటూ ఫిర్యాదు చేసిన ఎన్నారై మహిళ మేజిస్టేట్ ముందు మాట మార్చింది. న్యూజిల్యాండ్‌కు చెందిన ఎన్నారై మహిళ ఈశాన్య ఢిల్లీలోని మహరాణి బాగ్‌లో తనపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెల 29న వ్యాపార కారణాలతో తాను అతన్ని కలిసి సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని పేర్కొంది. వ్యాపార వ్యవహారాల నిమిత్తం తాను ఢిల్లీకి వచ్చానని, గత నెల 27న తాను, తన భర్త అతన్ని కలిసి డిన్నర్ చేశాడని ఫిర్యాదులో తెలిపింది. గత నెల 29న తన మహరాణి బాగ్‌లోని తన నివాసానికి డిన్నర్‌కు ఆహ్వానించాడని, హోటల్ నుంచి తనను పికప్ చేసుకొని తీసుకువెళ్లాడని, ఇంటికి వెళ్లాక డ్రింక్స్ ఇచ్చి.. ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. హోటల్‌కు వచ్చిన తర్వాత జరిగిన ఘటన గురించి భర్తకు తెలుపడంతో ఇద్దరు కలిసి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె తాజాగా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇస్తూ తనపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలను తోసిపుచ్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని, ఇంకా నిందితుడిని అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు. -
'ఎమ్మెల్సీ పదవికి ఫరూక్ అనర్హుడు'
-
బాస్ రేప్ చేసి.. ఆస్ట్రేలియా వరకు వెంటాడాడు!
దేశంలో మహిళలపై కామాంధుల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. హర్యానాలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కొడుకు కిరాతకంగా ఒక యువతిని వెంటాడిన ఘటన నేపథ్యంలోనే మరో షాకింగ్ కేసు వెలుగుచూసింది. ఓ మాజీ సీనియర్ సహోద్యోగి భారత్‌లో తనను వేధించి.. లైంగిక దాడి చేయడమే కాకుండా.. తనను వెంటాడుతూ ఆస్ట్రేలియా కూడా వచ్చాడని, అతని బారినుంచి తప్పించుకునేందుకు భర్త, ఇద్దరు పిల్లలతో ఆస్ట్రేలియా వచ్చినా.. అక్కడ వేధింపులకు దిగాడని 38 ఏళ్ల ఎన్నారై మహిళ ఫిర్యాదు చేసింది. వెంటాడి వేధించడం, డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడటం, లైంగిక దాడి చేయడం వంటి పలు అభియోగాల కింద నిందితుడిపై కేసు నమోదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. బాధితురాలు నిందితుడిని తొలిసారి తను పనిచేసే గురుగ్రామ్‌లోని కార్యాలయంలో కలిసింది. హైదరాబాద్‌కు చెందిన అతను, ఆమె ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. తన ఉద్యోగంలో భాగంగా తరచూ ఆమె అతనితో సంప్రదింపులు జరిపేది. 'మేం తరచూ టెలిఫోన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడేవాళ్లం. పని నిమిత్తం అతను తరచూ గురుగ్రామ్ వచ్చేవాడు. అతని ప్రాజెక్టుల్లో నన్ను కలుపుకుంటూ.. నాతో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించేవాడు. బహిరంగంగా నా పనితీరును పొడిగేవాడు. తన భార్య దుర్మార్గురాలని, స్వార్థపరురాలని, కజిన్‌తో ఆమె లేచిపోయిందని తరచూ చెప్పేవాడు. కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా కూతురిని సొంతంగా పెంచుతున్నట్టు చెప్పేవాడు. తన కష్టాలు పంచుకోవడానికి ఒక స్నేహితుడు తోడు ఉంటే బాగుండేదని చెప్పేవాడు. తన సమస్యలు చెప్పేందుకు తరచూ నాకు ఫోన్ చేసేవాడు' అని ఆమె తెలిపింది. '2013 మార్చ్‌లో ఒక రోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని ఫోన్ ద్వారా తెలుసుకున్న అతను వెంటనే సాయంత్రం వచ్చాడు. ఇంటికి వచ్చిన అతనికి కూల్ డ్రీంక్ ఇచ్చాను. ఆ తర్వాత నేను కూల్‌డ్రింక్ తాగాను. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన నేను కళ్లు తెరిచి చూసేసరికి బెడ్రూమ్లో నగ్నంగా ఉన్నాను. పక్కన చైర్లో కూర్చున్న అతను జరిగిన దానిని మరిచిపోవాలని, ఈ విషయం బయట తెలిస్తే నీ పరువు పోవడంతోపాటు ఉద్యోగం కూడా పోతుందని బెదిరించాడు. ఆ తర్వాత నా అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించి.. తనను ఎప్పుడు సంతోష పెట్టాలని బలవంతపెట్టేవాడు' అని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత తన వెంట పలు నగరాల్లోని పెద్ద పెద్ద హోటళ్లకు బలవంతంగా తీసుకెళ్లాడని, తనను విడిచిపెట్టాలని వేడుకోవడంతో డబ్బులు ఇవ్వమంటూ బెదిరించాడని, దీంతో గత్యంతరం లేక లక్షలకొద్దీ డబ్బు ఇచ్చానని బాధితురాలు తెలిపింది. 'దాడులను ఆపాలంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని కోరాడు. అందుకు నేను అంగీకరించాను. అయినా, కొన్నిరోజుల తర్వాత మళ్లీ నాపై దాడి చేశాడు' అని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత తనను వెంబడించి.. తాను ఆస్ట్రేలియా వెళుతున్న విషయాన్ని తెలుసుకొని.. అక్కడికి వచ్చి మరీ వేధించాడని, తన భర్తకు ఈమెయిళ్లు పంపుతూ.. తనను ఇప్పటికీ వెన్నాడుతున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. -
అర్ధరాత్రి ఎయిర్‌పోర్టులో వదిలేశాడు
-
అర్ధరాత్రి ఎయిర్‌పోర్టులో వదిలేశాడు
• బిడ్డకు పాలు పట్టనివ్వకుండా వేధింపులు • కట్నం కోసం భర్త, అత్త దాష్టీకం • ఎన్ఆర్ఐ ఆవేదన హిమాయత్‌నగర్: అదనపు కట్నం కోసం వేధించడమేగాకుండా, తనను వదిలించుకునేందుకు అర్ధరాత్రి పసిబిడ్డతో సహా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిర్ధాక్షిణ్యంగా తన భర్త తనను వదిలి వెళ్లాడని ఓ ఎన్ఆర్ఐ మహిళ వాపోయింది.గురువారం బాలల హక్కుల సంఘం నేతలతో కలిసి వివరాలు వెల్లడించింది. వనస్థలిపురంకు చెందిన శిరీషను, రామంతపూర్‌కు చెందిన యలాల కీర్తిసాయిరెడ్డికి ఇచ్చి 2015జూన్‌లో పెళ్లి చేశారు. పెళ్లైన పదిరోజులకు భర్తతో కలిసి అమెరికాలోని వర్జినియాకు వెళ్లింది. కొద్ది రోజులకే భర్త కీర్తిసాయిరెడ్డి, అత్త వనిత నుంచి ఆమెకు వేధింపులు మొదలైయ్యాయి. పెళ్లి సమయంలో 36తులాల బంగారం, ఎకరం భూమి, వెండి, రూ.లక్ష నగదును ఇచ్చామని, అయినా తన అత్త వనిత అదనపు కట్నం కావాలని వేధించడమేగాక, భర్తను అందుకు పురిగొల్పేదన్నారు. తన భర్త కీర్తిసాయి రెడ్డి ఇంట్లో సీసీకెమెరాలు అమర్చి తాను ఎవరితో మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో ప్రతిదీ గమనించి సాయంత్రం ఇంటికి రాగానే గొడవ పెట్టుకునేవాడన్నారు. పుట్టిన బిడ్డకు పాలు ఇస్తే తనకు దగ్గరవుతాడని, తన కుమారుడికి పాలుపట్టనిచ్చేవారు కాదన్నారు. అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరిన తాము శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే సరికి అర్థరాత్రి 2.30గంటలు అయ్యిందన్నారు. ఆ సమయంలో తనను, బిడ్డతో సహా ఒంటరిగా వదిలేసి తాను ఒక్కడే వదిలేసి వెళ్లాడని ఆవేదన వ్యక్తం చేసింది.చేతిలో రూపాయి లేక, ఫోన్ చేసేందుకు సెల్‌ఫోన్ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను గుర్తించిన ఓ ఏఎస్సై క్యాబ్‌లో కానిస్టేబుల్‌ను తోడుగా ఇచ్చి ఇంటికి పంపారని తెలిపింది. అచ్యుతరావు మాట్లాడుతూ పసికందు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్న కీర్తిసాయిరెడ్డి, వనితలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. -
ఎన్నారై మహిళకు టీడీపీ నేతకొడుకు వేధింపులు
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు పెనమలూరు: అమెరికాలో నివసిస్తున్న మహిళను వికృత చేష్టలు, అసభ్య సమాచారంతో వేధిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడిని కృష్ణా జిల్లా, పెనమలూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గతంలో ఓ మహిళ పెనమలూరు మండలం, కానూరు అశోక్‌నగర్‌లో నివసించారు. ఆమె ఇంటి సమీపంలో జగ్గయ్యపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే అక్కినేని లోకేశ్వరరావు కుమారుడు విజయ్‌కృష్ణ అప్పట్లో నివాసముండేవాడు. అయితే ఆ మహిళ 16 ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లి వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. విజయకృష్ణకు వివాహమై, భార్యకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సదరు మహిళను విజయకృష్ణ ఫోన్, వాట్సాప్ ద్వారా బెదిరిస్తూ, అసభ్య ఈ–మెయిల్స్ పంపుతున్నాడు. దీంతో నగర పోలీస్ కమిషనర్ గౌతమ్‌సవాంగ్‌కు ఆ మహిళ ఈ– మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. పెనమలూరు పోలీసులు విచారణ చేయగా విజయకృష్ణ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడు ఉపయోగించిన ల్యాప్‌టాప్, ఐపాడ్, సెల్‌ఫోన్, కంప్యూటర్ సీపీయూను సీజ్ చేశారు. -
ఎన్ఆర్ఐ మహిళ సాహస యాత్ర
వడోదర: మహిళలను రక్షించండి, విద్యావంతుల్ని చేయండి అని ప్రచారం చేస్తూ గుజరాత్‌కు చెందిన ఎన్ఆర్ఐ మహిళ భారులత కాంబ్లే (43) కారు యాత్ర చేపట్టారు. ఇంగ్లండ్ నుంచి 32 వేల కిలోమీటర్ల దూరం కారు నడుపుతూ స్వదేశానికి వచ్చారు. ఆమె 57 రోజుల పాటు 32 దేశాలు దాటి వచ్చారు. భారులత సొంతూరు గుజరాత్‌లోని నవ్సారి. ఆదివారం నవ్సారిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఆమెను సన్మానించారు. అంతకుముందు బరోడాలో కూడా ఆమెకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారులత మాట్లాడుతూ.. సొంతూరులో ఆస్పత్రి నిర్మించనున్నట్టు చెప్పారు. తగిన వైద్య సదుపాయాలు లేక తన తాత మరణించడం చూశానని గుర్తు చేసుకున్నారు. 32 దేశాల ప్రజలతో మాట్లాడానని, నవ్సారిలో అన్ని వసతులతో ఆస్పత్రి నిర్మాణం కోసం నిధులు సేకరించానని తెలిపారు. 57 రోజుల్లో అత్యధిక దేశాలను సందర్శించిన తొలి మహిళ తానేనని చెప్పారు. రెండు ఖండాలు, మూడు పెద్ద ఎడారులు, పర్వతాలు దాటి వచ్చారు. ఈ కారు యాత్ర గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డుల్లో నమోదైంది. -
భర్త మరణించిన బాలింతకు.. సుష్మా ఆపన్నహస్తం
ఒకవైపు గుండెపోటుతో భర్త చనిపోయి పుట్టెడు దుఃఖం.. మరోవైపు కూతురు పుట్టిన ఆనందం.. ఇంకోవైపు.. తిరిగి భారతదేశానికి ఎలా రావాలో తెలియక ఆందోళన. ఇలాంటి కష్టాల్లో ఉన్న భారతీయ మహిళను ఆదుకోడానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ముందుకొచ్చారు. అమెరికాలో ఉంటున్న దీపికా పాండే భర్త హరిఓం పాండే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఆయన బోస్టన్‌లో అక్టోబర్ 19వ తేదీన గుండెపోటుతో మరణించారు. అప్పటికే నెలలు నిండిన ఆమెను, నాలుగేళ్ల కొడుకును కుటుంబ స్నేహితులు మెరుగైన వైద్యసేవల కోసం న్యూజెర్సీకి తీసుకెళ్లారు. అక్కడి ఆస్పత్రిలో ఆమెకు కూతురు పుట్టింది. ఉత్తరప్రదేశ్‌లో ఉండే తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలంటే పుట్టిన బిడ్డకు తండ్రి జీవించి లేరు కాబట్టి పాస్‌పోర్టు రావడం కష్టం. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ బీజేపీ శాఖ సుష్మాస్వరాజ్‌కు ట్విట్టర్ ద్వారా వివరించింది. దాంతో వెంటనే స్పందించిన సుష్మా.. కష్టకాలంలో ఉన్న దీపికకు వీలైన అన్ని రకాలుగా తాను సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి ఈ మేరకు సమాచారం ఇచ్చామన్నారు. దీపికకు బోస్టన్‌లో ఇన్సూరెన్స్ ఉన్నా, అది న్యూజెర్సీలో చెల్లుబాటు కాదు కాబట్టి అక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయం కలిగించాలని కూడా దీపిక కుటుంబ సభ్యులు సుష్మాస్వరాజ్‌ను కోరారు. పుట్టిన బిడ్డకు వీలైనంత త్వరగా పాస్‌పోర్టు ఇప్పిస్తే, తమ కూతురిని, మనవడిని, మనవరాలిని సొంత దేశానికి రప్పించుకుంటామన్నారు. అలాగే పుట్టిన బిడ్డకు ఓవర్సీస్ ఇండియన్ కార్డు కూడా కావాలని, ఇవన్నీ ఉంటే తప్ప భారతదేశంలోకి ఆ బిడ్డ అడుగుపెట్టడానికి వీలుండదని తెలిపారు. Deepika - We are with you in this hour of tragedy. I have asked @IndianEmbassyUS to help you. @BJPLucknowBJP @templetree1 — Sushma Swaraj (@SushmaSwaraj) 9 November 2016 -
భర్తను తగలబెట్టిన ఎన్నారై భార్యకు 20 ఏళ్ల జైలు
ఇంటిని తగలబెట్టేసి, ఆ మంటల్లోనే భర్తను కూడా కాల్చేసిన భారతీయ మహిళకు అమెరికా కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. శ్రియా పటేల్ (27) అనే మహిళకు ట్రావిస్ కౌంటీ జ్యూరీ విధించిన ఈ శిక్షను జిల్లా జడ్జి డేవిడ్ క్రైన్ నిర్ధారించారు. శ్రియా పటేల్ తన భర్త బిమల్ మీద గ్యాసోలిన్ పోసి తగలబెట్టేసిన కేసులో వాస్తవానికి ఆమెకు మరణశిక్ష విధించాలని పోలీసులు కోరినా, కోర్టులో మాత్రం ఆమెపై మోపిన హత్యానేరం రుజువుకాలేదు. ఆస్తిని తగలబెట్టి, తద్వారా మరణానికి కారణమైనట్లు మాత్రమే రుజువు కావడంతో 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెను అమెరికా నుంచి భారతదేశానికి పంపేస్తారు. తీర్పు వెలువడే సమయంలో కూడా ఆమె ఏమాత్రం నదురు బెదురు లేకుండా చూస్తూనే ఉన్నారు. శ్రియ మరో వ్యక్తిని ప్రేమించిందని బిమల్ స్నేహితులు ఆరోపించారు. కానీ బిమల్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని, బలవంతంగా ఆమెతో తనపై గ్యాసోలిన్ పోయించుకున్నాడని శ్రియ న్యాయవాదులు వాదించారు. సాక్ష్యాధారాలు ఏమీ లేకపోవడం, సాంస్కృతిక, భాషాపరమైన సమస్యలు కూడా ఉండటంతో విచారణకు చాలా ఇబ్బంది ఎదురైందని డిఫెన్సు న్యాయవాది తెలిపారు. శ్రియాపటేల్ ఉన్నత కుటుంబానికి చెందినవారని, ఆమె ఎప్పుడూ న్యాయానికి, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించలేదని, స్వదేశంలో కూడా ఎప్పుడూ పోలీసు కేసులు లేవని చెప్పారు. లండన్‌లో చదువుకుని, దుబాయ్‌లో ఉన్న శ్రియకు తగినట్లుగా భర్త ఎప్పుడూ లేడని, దాంతో నిరాశ చెందిందని అన్నారు. బిమల్‌కు టెలిమార్కెటింగ్ ఉద్యోగం కూడా పోయిందని, దాంతో ఇంటి అద్దె కట్టడానికి సైతం ఇబ్బంది పడుతున్నాడని చెప్పారు. ఇక కోర్టులో ప్రాసిక్యూషన్ న్యాయవాదుల కథనం ప్రకారం, శ్రియ తమ ఇంటి సమీపంలోని వాల్‌మార్ట్ మాల్ నుంచి గ్యాసోలిన్, చిన్న ఎర్రటి గ్యాస్ ట్యాంక్, కొవ్వొత్తులు కొని తీసుకొచ్చి.. ఈ హత్య చేసింది.