25-Year-Old Indian-American Woman From Texas Found Dead Mysteriously In Oklahoma - Sakshi
Sakshi News home page

అమెరికాలో అదృశ్యమైన ఎన్‌ఆర్‌ఐ లహరి మృతి

Published Thu, May 18 2023 8:03 AM | Last Updated on Thu, May 18 2023 9:23 AM

Missing NRI Found Dead In Texas - Sakshi

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌లో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన లహరి పతివాడ(25) అనే భారతీయ-అమెరికన్ మహిళ శవమై కనిపించింది. సరిహద్దు రాష్ట్రమైన ఓక్లహోమాలో దాదాపు 322 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం లభ్యమైంది.

నివేదికల ప్రకారం.. టెక్సాస్‌లోని కాలిన్స్ కౌంటీలోని మెకిన్నే ప్రాంతంలో నివాసం ఉంటున్న లహరి పతివాడ  చివరి సారిగా డల్లాస్ పరిసరాల్లోని ఎల్ డొరాడో పార్క్‌వే , హార్డిన్ బౌలెవార్డ్ బ్లాక్ ప్రాంతాల్లో టయోటా కారు నడుపుతూ కనిపించారు.

వావ్ అనే స్థానిక టెక్సాస్ సంస్థ ద్వారా ఆమె అదృశ్యమైన వార్త సోషల్ మీడియాలో వ్యాపించింది. మే 12న ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో ఆమె స్నేహితులు ఓక్లహోమాలో ఆమె ఫోన్‌ను ట్రాక్ చేశారు.

ఆమె ఫేస్‌బుక్ పేజీ ప్రకారం.. లహరి ఓవర్‌ల్యాండ్ పార్క్ ప్రాంతీయ వైద్య కేంద్రంలో పనిచేసేవారు. బ్లూ వ్యాలీ వెస్ట్‌ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె కాన్సాస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు.

ఇదీ చదవండి: Viral Video: ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్‌ హతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement