
అతియా షకీర్ మృతదేహం
బంజారాహిల్స్: తన చుట్టూ ఆత్మలు తిరుగుతున్నాయని తనను భూతం ఆవహించిందని రాత్రిళ్ళు శ్మశానంలోకి రావాలంటూ పిలుపులు వస్తున్నాయని మానసికంగా ఆందోళన చెందుతున్న ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.10, జహీరానగర్‌కు చెందిన అతియా షకీర్(42) కెనెడాలో ఉండేది.
ఆమెకు ఐదుగురు సంతానం. కొంత కాలంగా తన చుట్టూ ఆత్మలు తిరుగుతున్నాయంటూ ఆందోళన చెందుతున్న ఆమె చికిత్స నిమిత్తం జహీరానగర్‌లోని తన ఇంటికి వచ్చింది. మూడు రోజులుగా మతిస్తిమితం కోల్పోయిన ఆమె మంగళవారం తెల్లవారుజామున తన ఇంటి ఐదో అంతస్తుపైకి ఎక్కి కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment