
పైసల్లేక.. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఓ పెద్దావిడ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పెద్దావిడ మంగళవారం రాత్రి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది గమించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలిని మారెమ్మ(70)గా గుర్తించారు. ఆమె స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ గ్రామంగా తేలింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మారెమ్మ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com