సైబర్ మోసం సొమ్ముతో ఇల్లు కొన్న నిందితుడు
యజమాని బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్
ఇల్లు ఆక్రమించుకున్న మోసగాడు
లబోదిబోమంటున్న ఎన్‌ఆర్‌ఐ
బంజారాహిల్స్: సైబర్ మోసంలో సంపాదించిన డబ్బుతో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ ఇల్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి పథకం ప్రకారం ఆమె ఇంటిని కబ్జా చేసి ఆమె బ్యాంకు ఖాతాను సైబర్ పోలీసులు సీజ్ చేసే విధంగా పావులు కదిపిన ఘటనలో నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలో నివసించే డాక్టర్ బినోతి మార్తాండ్‌కు జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లోని నందగిరిహిల్స్ లే అవుట్‌లో ప్లాట్ నెంబర్ 81లో 334 గజాల్లో ఇల్లు ఉంది. 2022లో సదరు ఇంటిని అమ్మకానికి పెట్టిన ఆమె ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో కూడా వివరాలు నమోదు చేశారు.
అలాగే గురునాథ్ అనే వ్యక్తిని అమ్మకానికి సంబంధించి ఎంక్వైరీ కోసం ఏజెంట్‌గా నియమించుకున్నారు. 2022లో ఆమె యూఎస్‌లో ఉండగా ఎస్‌బీకే గ్రూప్ చైర్మన్ బాబు అలియాస్ షేక్ బషీర్ పేరుతో వాట్సాప్ కాల్ వచి్చంది. నందగిరిహిల్స్‌లోని మీ ప్లాట్‌ను కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు షేక్ బషీర్ చెప్పడంతో ఆమె ఇంటిని రూ. 12.50 కోట్లకు విక్రయిస్తున్నట్లు తెలిపింది. సదరు మొత్తాన్ని షేక్ బషీర్ ఆరీ్టజీఎస్ ద్వారా పలుమార్లు ఆమె ఖాతాకు బదిలీ చేశాడు. ఈ ఏడాది జూలై 18న ఈ మొత్తం ఆమె ఖాతాలో జమ చేసినట్లు ఆధారాలు పంపించిన అతను అదే రోజు తాను ఇంట్లో దిగుతున్నానంటూ ఆమెకు ఫోన్‌చేసి చెప్పి ఇంటిని తన ఆ«దీనంలోకి తీసుకున్నాడు. జూలై 19న ఆమెకు బ్యాంకు నుంచి మీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నామంటూ సైబర్ పోలీసులు నోటీసు పంపడంతో నివ్వెరపోయింది.
వెంటనే ఆమె బాబు అలియాస్ షేక్ బషీర్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. బ్యాంకు అధికారులను ఆరా తీయగా ఈ మొత్తం డబ్బు సైబర్ మోసం ద్వారా సంపాదించినదని చెప్పారు. అంతే కాకుండా షేక్ బషీర్ ఆమె ఇంటిని ఆక్రమించమే కాకుండా చంపేస్తానని బెదిరించాడు. ఆమె ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు తొలగించి తాజాగా తన సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు. జూలై 28న ఇండియాకు వచి్చన బాధితురాలు తన కుమారుడితో కలిసి ఇంటికి వెళ్లగా బషీర్ అనుచరులు అందులో ఉన్నారు. తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఇంటిని స్వా«దీనం చేసుకున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు బషీర్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment