దేవికమ్మ పిళ్లై(ఫైల్ ఫోటో)
ముంబై : భారత సంతతికి చెందిన మహిళ అదృశ్యమైన ఘటన ముంబై నగరంలో కలకలం రేపింది. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న 76 ఏళ్ల దేవికమ్మ పిళ్లై అనే మహిళ లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి భువనేశ్వర్‌లో రైలులో బయలు దేరిన అదృశ్యమైనట్టు రైల్వే పోలీసులు తెలిపారు. సెలవులు గడపడానికి నెల కిందట వచ్చిన ఆమె ఫిబ్రవరి 21 నుంచి దక్షిణ ముంబైలో కొలబ ప్రాంతంలోని గెస్ట్ హౌస్‌లో ఉంటోంది. ఫిబ్రవరి 23న భువనేశ్వర్‌కు రైలులో వెళ్లినప్పటి నుంచి కనిపించటం లేదని ఆమె కూతురు సమాచారమిచ్చినట్లు రైల్వే పోలీసులు చెప్పారు. చివరిసారిగా ఆమె మహారాష్ట్రలోని గోండిగా ప్రాంతంలో ఉన్నట్లు ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించినట్టు వెల్లడించారు.
మార్చి 1న దేవికమ్మ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దక్షిణాఫ్రికా నుంచి ఆమె కూతురు గెస్ట్ హౌస్‌కు ఫోన్ చేసింది. ఆమె అక్కడి నుంచి వెళ్లపోయి, ఇంటికి తిరిగి రాకపోవడంతో ముంబైలోని పోలీసులను సంప్రదించింది. ఆమె కనిపించకుండా పోవడంతో గెస్ట్‌హౌస్ మెనేజర్ ఫిర్యాదు చేశాడు. భువనేశ్వర్‌లో ఆమె ఏ స్నేహితురాలిని కలుస్తానని వెళ్లిందో తెలుసుకున్నామని రైల్వేపోలీసు అధికారి మహేశ్ బల్వంత్‌రావ్ అన్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేసి ఆమె ఆచూకీ కనుగొంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment