bhuvaneswar train
-
ఒడిశాలో ఏం జరుగుతోంది? మరో రష్యా పౌరుడు మిస్సింగ్!
భువనేశ్వర్: పది నెలలుగా ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తోన్న రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ దేశ పౌరులు ఇటీవల ఒడిశాలోని రాయగడ హోటల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పావెల్ అంటోవ్(65) అనే ఎంపీ, ఆయన స్నేహితుడు ఇరువురు రెండ్రోజుల వ్యవధిలో హోటల్లో రక్తపు మడుగులో పడి కనిపించటం కలకలం రేపింది. ప్రస్తుతం పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన మరో రష్యా పౌరుడు కనిపించకుండా పోయాడనే వార్త కలకలం సృష్టిస్తోంది. ఒడిశాలో ఏం జరుగుతోంది? అక్కడి పోలీసులు ఏం చెబుతున్నారు. ఇదీ జరిగింది.. ఒడిశా రాజధాని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం.. రష్యాకు చెందిన ఓ 60ఏళ్ల వ్యక్తి ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. తాను రష్య వసలదారుడినని, తాను యుద్ధానికి, పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. తాను నిరాశ్రయుడిగా మారానని, తనకు సాయం చేయాలని కోరాడు. మరోవైపు.. రైల్వే స్టేషన్లో ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి ఆచూకీ గల్లంతైనట్లు వార్తలు చక్కర్లు కొంటాయి. ఆయనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాయి. ఒడిశా రాయగడలోని హోటల్లో ఇద్దరు రష్యన్ వ్యక్తులు మరణించిన క్రమంలో ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే, ఆ వార్తలను కొట్టిపారేశారు ఒడిశా పోలీసులు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి అదృశ్యం కేసు నమోదు కాలేదని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ‘నవంబర్లోనూ ఆ వ్యక్తి ప్లకార్డు పట్టుకుని రైల్వే స్టేషన్లో కనిపించాడు. ఆయన పాస్‌పోర్టును తనిఖీ చేశాం. ప్రయాణికుల నుంచి డబ్బులు అడుక్కుంటున్నాడు. అతడి వివరాలు తనిఖీ చేసి పూరీకి పంపించాం. అప్పటి నుంచి తనవారితో అక్కడే ఉంటున్నాడు. రాయగడ హోటల్ ఘటనలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు’అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: రష్యా పౌరుడి అనుమానాస్పద మృతి.. వాళ్లిదరూ ఒకే గదిలో.. -
ఎన్ఆర్ఐ మహిళ అదృశ్యం
ముంబై : భారత సంతతికి చెందిన మహిళ అదృశ్యమైన ఘటన ముంబై నగరంలో కలకలం రేపింది. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న 76 ఏళ్ల దేవికమ్మ పిళ్లై అనే మహిళ లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి భువనేశ్వర్‌లో రైలులో బయలు దేరిన అదృశ్యమైనట్టు రైల్వే పోలీసులు తెలిపారు. సెలవులు గడపడానికి నెల కిందట వచ్చిన ఆమె ఫిబ్రవరి 21 నుంచి దక్షిణ ముంబైలో కొలబ ప్రాంతంలోని గెస్ట్ హౌస్‌లో ఉంటోంది. ఫిబ్రవరి 23న భువనేశ్వర్‌కు రైలులో వెళ్లినప్పటి నుంచి కనిపించటం లేదని ఆమె కూతురు సమాచారమిచ్చినట్లు రైల్వే పోలీసులు చెప్పారు. చివరిసారిగా ఆమె మహారాష్ట్రలోని గోండిగా ప్రాంతంలో ఉన్నట్లు ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించినట్టు వెల్లడించారు. మార్చి 1న దేవికమ్మ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దక్షిణాఫ్రికా నుంచి ఆమె కూతురు గెస్ట్ హౌస్‌కు ఫోన్ చేసింది. ఆమె అక్కడి నుంచి వెళ్లపోయి, ఇంటికి తిరిగి రాకపోవడంతో ముంబైలోని పోలీసులను సంప్రదించింది. ఆమె కనిపించకుండా పోవడంతో గెస్ట్‌హౌస్ మెనేజర్ ఫిర్యాదు చేశాడు. భువనేశ్వర్‌లో ఆమె ఏ స్నేహితురాలిని కలుస్తానని వెళ్లిందో తెలుసుకున్నామని రైల్వేపోలీసు అధికారి మహేశ్ బల్వంత్‌రావ్ అన్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేసి ఆమె ఆచూకీ కనుగొంటామన్నారు. -
శేషాద్రి, సింహాద్రి, యశ్వంత్‌పూర్ ఎక్స్ప్రెస్ల్లో దోపిడీ
ప్రకాశం: ప్రకాశం జిల్లా వద్ద దోపిడీ దొంగలు పలు రైళ్లలో బీభత్సం సృష్టించారు. ఈ రోజు తెల్లవారుజామున శేషాద్రి, సింహాద్రి, యశ్వంత్‌పూర్, సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు దోపిడీకీ పాల్పడ్డారు. సింగరాయకొండ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి అయిదు గంటల సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ మరమ్మతుల సందర్భంగా రైలు తక్కువ వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు ప్రయాణికుల్ని బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. మరో రెండు రైళ్లలో దోపిడికి విఫలయత్నం చేశారు. ప్రయాణికుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.