
డాక్టర్ పిల్లా శ్రీధర్
విశాఖ: ఇటీవల నగరంలో ఓ స్టార్ హోటల్ లో ఓ ఎన్ఆర్ఐ మహిళ మృతికి సంబంధించిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు, అనుమానితులు ఎవరూ లేరని తొలుత ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న పోలీసులు.. చివరకు ఆమె వెంటే ఉన్న డాక్టర్ శ్రీధర్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి అనుమానాలు ఎక్కువ కావడంతో పాటు ‘సాక్షి’ వరుస కథనాలతో పోలీసు యంత్రాంగం కదిలింది. ఆ ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య చేసుకునేలా డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రేరేపించాడని అభియోగాలు నమోదు చేసిన పోలీసులు.. డాక్టర్ శ్రీధర్ ను అరెస్ట్ చేశారు
ఈ నెల 8వ తేదీన ఓ స్టార్ హెటల్ లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ హోటల్ వాష్ రూమ్ లో ఎన్నారై మహిళ ఉరివేసుకుని ఉంది. అయితే ఆ సమయంలోనే కూడా ఉన్న డాక్టర్ పై అనుమానాలు రేకెత్తాయి. చివరకు డాక్టర్ శ్రీధర్ ను అరెస్ట్ చేయడంతో ఈ కేసు మరో అడుగు ముందుకు కదిలింది.
బీఎన్ఎస్ 108 ప్రకారం కేసు నమోదు చేసి.. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. అయితే ఎన్నారై మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకునేలా చేశాడా?, లేక హత్య చేశాడా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. ఇక డాక్టర్ పిల్లా శ్రీధర్ ను పోలీసులు కస్టడీకి కోరతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Comments
Please login to add a commentAdd a comment