ఎన్నారై మహిళకు టీడీపీ నేతకొడుకు వేధింపులు | Cheap Behaviour of TDP Leader's Son | Sakshi
Sakshi News home page

ఎన్నారై మహిళకు టీడీపీ నేతకొడుకు వేధింపులు

Published Fri, Feb 10 2017 1:53 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

ఎన్నారై మహిళకు టీడీపీ నేతకొడుకు వేధింపులు - Sakshi

ఎన్నారై మహిళకు టీడీపీ నేతకొడుకు వేధింపులు

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

పెనమలూరు: అమెరికాలో నివసిస్తున్న మహిళను వికృత చేష్టలు, అసభ్య సమాచారంతో వేధిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడిని కృష్ణా జిల్లా, పెనమలూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.  గతంలో ఓ మహిళ పెనమలూరు మండలం, కానూరు అశోక్‌నగర్‌లో నివసించారు. ఆమె ఇంటి సమీపంలో  జగ్గయ్యపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే అక్కినేని లోకేశ్వరరావు కుమారుడు  విజయ్‌కృష్ణ అప్పట్లో నివాసముండేవాడు. అయితే ఆ మహిళ 16 ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లి వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. విజయకృష్ణకు వివాహమై, భార్యకు దూరంగా ఉంటున్నాడు.

 ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సదరు మహిళను విజయకృష్ణ ఫోన్, వాట్సాప్‌ ద్వారా బెదిరిస్తూ, అసభ్య ఈ–మెయిల్స్‌ పంపుతున్నాడు. దీంతో నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌సవాంగ్‌కు ఆ మహిళ ఈ– మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. పెనమలూరు పోలీసులు విచారణ చేయగా విజయకృష్ణ  వేధింపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడు ఉపయోగించిన ల్యాప్‌టాప్, ఐపాడ్, సెల్‌ఫోన్, కంప్యూటర్‌ సీపీయూను సీజ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement