Vijay Krishna
-
'గణా' మూవీ రివ్యూ
విజయ్ కృష్ణ, యోగిష జంటగా నటించిన చిత్రం 'గణా'. విజయ్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. గణా సినిమాతో హీరోగానూ, దర్శకుడిగా మార్చి 17న ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి గణా సినిమా ఎలా ఉంది? సినీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. గణా (విజయ్ కృష్ణ) పోర్ట్ ఏరియాలోని ఇల్లీగల్ డ్రగ్స్ బిజినెస్‌కు కింగ్. మినిస్టర్ కోటేశ్వరరావు అండ కూడా ఉంటుంది. మినిస్టర్‌కు అడ్డు వచ్చినా వోడ్కా దాస్ (నాగ మహేష్)ను గణా చంపేస్తాడు. తన అన్నను చంపాడని దాము పగ పెంచుకుంటాడు. గణాను ఓడించాలని చూస్తాడు. ఇదే క్రమంలో మినిస్టర్‌కు సైతం గణా ఎదురు తిరుగుతాడు. ఇక గణాకు డాక్టర్ సౌమ్య (యోగిష)తో ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఇంతలో గణాకు సౌమ్య తండ్రిని చంపే కాంట్రాక్ట్ వస్తుంది? ఆ తరువాత ఏం జరుగుతుంది? గణా సౌమ్యల మధ్య ఏం జరుగుతుంది? గణా జీవితంలో ప్రియ కథ ఏంటి? అసలు గణా ఫ్లాష్ బ్యాక్ ఏంటి? చివరకు గణా ఏం చేశాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గణా సినిమాలో దర్శకుడు, హీరో ఒక్కడే కావడం ప్లస్. అదే మైనస్ కూడా. దర్శకుడిగా కంటే హీరోగానే ఎక్కువ ప్రేమ చూపించినట్టు అనిపిస్తుంది. హీరో ఎలివేషన్స్ కోసమే దర్శకుడు కొన్ని సీన్లు, షాట్స్ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రతీ సీన్లో హీరోయిజం కనిపించేలా సీన్లను డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు కమ్ హీరో విజయ్ కృష్ణ. ప్రథమార్థంలో ఎమోషనల్ పాళ్లు కాస్త తక్కువే ఉంటుంది. యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎదురన్నదే లేకుండా దూసుకుపోయే గణా పాత్రతో ప్రేక్షకుడు ప్రయాణిస్తాడు. ఇంటర్వెల్ సీన్ నుంచి ఎమోషనల్ ట్రాక్ కాస్త లైన్లోకి వస్తుంది. ద్వితీయార్థంలో ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ట్విస్టులు మెప్పిస్తాయి. ఎవరెలా చేశారంటే.. గణా సినిమాలో విజయ్ కృష్ణ ఆల్ రౌండర్‌గా అనిపిస్తాడు. యాక్షన్, కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో అందరినీ ఆకట్టుకుంటాడు. హీరోయిన్లుగా యోగిష, తేజులు అందంగా కనిపించడమే కాదు చక్కగా నటించారు. ప్రతి నాయకులుగా కనిపించిన మినిస్టర్ కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, వోడ్కా దాస్ (నాగ మహేష్), దాము వంటి పాత్రలు ఆకట్టుకుంటాయి. ప్రభు చేసిన పోలీస్ పాత్ర కూడా అందరినీ మెప్పిస్తుంది. జబర్దస్త్ అప్పారావ్, దొరబాబుల కామెడీ కూడా ఓకే అనిపిస్తుంది. సాంకేతికత విషయాకొనిస్తే పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ లోపాలున్నా కూడా అంతగా ప్రభావం చూపించదు. సినిమాటోగ్రఫీ బాగుంది.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
రాయే నువ్వు రాయే..
నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్ జంటగా నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. రాజ్ విరాట్ దర్శకత్వంలో విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మించారు. ‘రాయే నువ్వు రాయే’ అంటూ సాగే ఈ సినిమాలోని మొదటి పాటని హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా సినిమా టైటిల్, టీజర్‌కి అటు ప్రేక్షకుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్ అభిమానిగా నందు నటించాడు. నందు పాత్రకు సమానంగా రష్మి పాత్ర కూడా ఉంటుంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుజాతా సిద్ధార్థ్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది
‘‘అసుర’ సినిమా నుంచి విజయ్ కృష్ణ, నా ప్రయాణం కొనసాగుతోంది. మాకు ఒక ప్లాట్‌ఫామ్ కావాలని రెండు మూడు సినిమాలు నిర్మించాం. అందులో నేను చిన్న చిన్న వేషాలు వేశాను. నేను కొంచెం మంచి సినిమాలు చేశాక ఇద్దరం సినిమా చేద్దామనుకున్నాం. తను ఇచ్చిన మాట కోసం నాతో ‘తిప్పరా మీసం’ సినిమా చేశాడు’’ అని శ్రీవిష్ణు అన్నారు. ‘అసుర’ ఫేమ్ విజయ్ కృష్ణ ఎల్. దర్శకత్వంలో శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 8న గ్లోబల్ సినిమాస్ ద్వారా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో దర్శకుడు విజయ్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఒక మంచి సినిమా చేద్దామని నేను, శ్రీవిష్ణు ‘తిప్పరామీసం’ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత నా ఫ్రెండ్ అచ్యుత రామారావు, రిజ్వాన్ జాయిన్ అయ్యారు. శ్రీవిష్ణు, నిక్కి బాగా నటించారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన రిజ్వాన్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు నిక్కీ తంబోలి. ‘‘ఈ సినిమాకి విజయ్ హార్ట్ అయితే, శ్రీవిష్ణు ప్రాణం. వారిద్దరూ కష్టపడి ఈ సినిమా చేశారు’’ అన్నారు రిజ్వాన్. సహనిర్మాత అచ్యుత రామారావు, హాస్యనటుడు నవీన్, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఎడిటర్ ధర్మేంద్ర, పాటల రచయిత పూర్ణచారి పాల్గొన్నారు. -
ఫుల్ ప్యాకేజీ
‘‘దుర్మార్గుడు’ చిత్రంలో శ్రావణ భార్గవి పాడిన ప్రోమో సాంగ్ హార్ట్ టచింగ్‌గా ఉంది. లిరిక్స్ అద్భుతంగా కుదిరాయి. విజయ్‌కృష్ణకు ఇది మొదటి సినిమా అయినా బాడీ లాంగ్వేజ్ చాలా చక్కగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్ పనితనం కనపడుతోంది. తక్కువ బడ్జెట్ సినిమా అయినా విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా ఫుల్ ప్యాకేజీలా ఉంది’’ అని నటుడు సుమన్ అన్నారు. విజయ్ కృష్ణ, ఫిర్దోస్ భాను జంటగా సునీల్ జంపా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దుర్మార్గుడు’. బేబీ ఆరాధ్య సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆడియోను సుమన్ విడుదల చేశారు. ట్రైలర్‌ను నిర్మాతలు సి. కళ్యాణ్, బెక్కం వేణుగోపాల్ రిలీజ్ చేయగా, బిగ్ సీడీని సుమన్, సి.కళ్యాణ్, బెక్కం వేణుగోపాల్, నిర్మాత టి. రామసత్యనారాయణ సంయుక్తంగా విడుదల చేశారు. సునీల్ జంపా మాట్లాడుతూ– ‘‘1980లో కాకినాడలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రాజవంశీగారికి ధన్యవాదాలు. అపర్ణగారు కూడా ఈ సినిమా కోసం చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాతో 25 మంది నూతన నటీనటులు, టెక్నీషియన్స్ పరిచయమవుతున్నారు’’ అన్నారు. ‘‘కేవలం సంకల్ప బలంతోనే ఎలాంటి శిక్షణ తీసుకోకుండా హీరో అయ్యాను. మా సినిమాను సపోర్ట్ చేసిన హీరో శ్రీకాంత్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు విజయ్ కృష్ణ. ‘‘రెండు మూడు సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత నిర్మాతగా మారాను’’ అన్నారు నిర్మాత రాజవంశీ. -
దండుపాళ్యంలా...
విజయ్ కృష్ణ, జరాఖాన్ జంటగా సునీత్ జంపా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దుర్మార్గుడు’. ఎ.ఎ.ఎ. సినిమాస్ సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్ పతాకంపై రాజవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. మోషన్ పోస్టర్‌ను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టీజర్‌ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ రిలీజ్ చేశారు. రాజవంశీ మాట్లాడుతూ– ‘‘దండు పాళ్యం’ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న చిత్రంలా ఉంటుంది. అందరూ కొత్తవారే నటించిన పక్కా తెలుగు సినిమా ఇది. జులైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. సునీత్ జంపా మాట్లాడుతూ – ‘‘మంగళగిరిలో డిస్ట్రిబ్యూటర్‌గా చేశా. ‘మురారి’ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నప్పుడే డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన వచ్చింది. 2006లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి వచ్చా. ఈ సినిమా చూస్తున్నంతసేçపు ప్రేక్షకులు ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. మాస్, క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. హీరో విజయ్ కృష్ణ, సహనిర్మాత బాల ప్రసాద్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మల్లిక్ పుట్టా, మ్యూజిక్: చిన్ని కష్ణ, సహ నిర్మాత: బాల ప్రసాద్. -
ఎన్నారై మహిళకు టీడీపీ నేతకొడుకు వేధింపులు
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు పెనమలూరు: అమెరికాలో నివసిస్తున్న మహిళను వికృత చేష్టలు, అసభ్య సమాచారంతో వేధిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడిని కృష్ణా జిల్లా, పెనమలూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గతంలో ఓ మహిళ పెనమలూరు మండలం, కానూరు అశోక్‌నగర్‌లో నివసించారు. ఆమె ఇంటి సమీపంలో జగ్గయ్యపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే అక్కినేని లోకేశ్వరరావు కుమారుడు విజయ్‌కృష్ణ అప్పట్లో నివాసముండేవాడు. అయితే ఆ మహిళ 16 ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లి వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. విజయకృష్ణకు వివాహమై, భార్యకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సదరు మహిళను విజయకృష్ణ ఫోన్, వాట్సాప్ ద్వారా బెదిరిస్తూ, అసభ్య ఈ–మెయిల్స్ పంపుతున్నాడు. దీంతో నగర పోలీస్ కమిషనర్ గౌతమ్‌సవాంగ్‌కు ఆ మహిళ ఈ– మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. పెనమలూరు పోలీసులు విచారణ చేయగా విజయకృష్ణ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడు ఉపయోగించిన ల్యాప్‌టాప్, ఐపాడ్, సెల్‌ఫోన్, కంప్యూటర్ సీపీయూను సీజ్ చేశారు. -
శ్రీశైలంలో గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
శ్రీశైలం ఆలయ పరిధిలో తనిఖీలు చేపట్టిన పోలీసులు పెద్ద మొత్తంలో గుట్కా,ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. సున్నిపెంట వైపు నుంచి వచ్చిన వాహనాలను సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ ముఖద్వారం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.40వేల విలువైన గుట్కా, ఖైనీలను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. -
ప్రైవేటు లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక దాడి
యాదగిరిగుట్ట పట్టణంలో ప్రైవేటు లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోన్న ఐదు జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఆలేరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ దాడుల్లో ట్రైనీ ఎస్ఐ విజయ కృష్ణ పాల్గొన్నారు.