ఫుల్‌ ప్యాకేజీ | Durmargudu Movie Audio Launch | Sakshi
Sakshi News home page

ఫుల్‌ ప్యాకేజీ

Feb 28 2019 5:23 AM | Updated on Jul 12 2019 4:40 PM

Durmargudu Movie Audio Launch - Sakshi

విజయ్‌ కృష్ణ, ఫిర్దోస్‌ భాను

‘‘దుర్మార్గుడు’ చిత్రంలో శ్రావణ భార్గవి పాడిన ప్రోమో సాంగ్‌ హార్ట్‌ టచింగ్‌గా ఉంది. లిరిక్స్‌ అద్భుతంగా కుదిరాయి. విజయ్‌కృష్ణకు ఇది మొదటి సినిమా అయినా బాడీ లాంగ్వేజ్‌ చాలా చక్కగా ఉంది. ట్రైలర్‌ చూస్తుంటే డైరెక్టర్‌ పనితనం కనపడుతోంది. తక్కువ బడ్జెట్‌ సినిమా అయినా విజువల్స్‌ చాలా బాగున్నాయి. ఈ సినిమా ఫుల్‌ ప్యాకేజీలా ఉంది’’ అని నటుడు సుమన్‌ అన్నారు. విజయ్‌ కృష్ణ, ఫిర్దోస్‌ భాను జంటగా సునీల్‌ జంపా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దుర్మార్గుడు’. బేబీ ఆరాధ్య సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాజవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆడియోను సుమన్‌ విడుదల చేశారు.

ట్రైలర్‌ను నిర్మాతలు సి. కళ్యాణ్, బెక్కం వేణుగోపాల్‌ రిలీజ్‌ చేయగా, బిగ్‌ సీడీని సుమన్, సి.కళ్యాణ్, బెక్కం వేణుగోపాల్, నిర్మాత టి. రామసత్యనారాయణ సంయుక్తంగా విడుదల చేశారు. సునీల్‌ జంపా మాట్లాడుతూ– ‘‘1980లో కాకినాడలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రాజవంశీగారికి ధన్యవాదాలు. అపర్ణగారు కూడా ఈ సినిమా కోసం చాలా సపోర్ట్‌ చేశారు. ఈ సినిమాతో 25 మంది నూతన నటీనటులు, టెక్నీషియన్స్‌ పరిచయమవుతున్నారు’’ అన్నారు. ‘‘కేవలం సంకల్ప బలంతోనే ఎలాంటి శిక్షణ తీసుకోకుండా హీరో అయ్యాను. మా సినిమాను సపోర్ట్‌ చేసిన హీరో శ్రీకాంత్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు విజయ్‌ కృష్ణ. ‘‘రెండు మూడు సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత నిర్మాతగా మారాను’’ అన్నారు నిర్మాత రాజవంశీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement