
సాక్షి, న్యూఢిల్లీ: తనపై అత్యాచారం జరిగిందంటూ ఫిర్యాదు చేసిన ఎన్నారై మహిళ మేజిస్టేట్ ముందు మాట మార్చింది. న్యూజిల్యాండ్‌కు చెందిన ఎన్నారై మహిళ ఈశాన్య ఢిల్లీలోని మహరాణి బాగ్‌లో తనపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెల 29న వ్యాపార కారణాలతో తాను అతన్ని కలిసి సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని పేర్కొంది. వ్యాపార వ్యవహారాల నిమిత్తం తాను ఢిల్లీకి వచ్చానని, గత నెల 27న తాను, తన భర్త అతన్ని కలిసి డిన్నర్ చేశాడని ఫిర్యాదులో తెలిపింది.
గత నెల 29న తన మహరాణి బాగ్‌లోని తన నివాసానికి డిన్నర్‌కు ఆహ్వానించాడని, హోటల్ నుంచి తనను పికప్ చేసుకొని తీసుకువెళ్లాడని, ఇంటికి వెళ్లాక డ్రింక్స్ ఇచ్చి.. ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. హోటల్‌కు వచ్చిన తర్వాత జరిగిన ఘటన గురించి భర్తకు తెలుపడంతో ఇద్దరు కలిసి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె తాజాగా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇస్తూ తనపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలను తోసిపుచ్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని, ఇంకా నిందితుడిని అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment