
భర్త నుంచి రక్షణ కల్పించండి
కలెక్టర్‌కు కలిసిన రాసాల పావని
హన్మకొండ అర్బన్ : అదనపు కట్నం, వివాహేతర సంబంధాల పేరుతో వేధిస్తూ చంపుతానని భయపెడుతున్న భర్త విలేకరి రాసారాల వెంకట్ నుంచి తనకు, పిల్లలకు రక్షణ కల్పించాలని రాసాల పావని శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. భర్త తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని, పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ పెట్టి నచ్చజెప్పినా వినడం లేదని తెలిపింది. డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకోవాలని, లేదంటే తన రెండో పెళ్లికి సహకరించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడని వివరించింది. పిల్లల చదువులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని, భర్త నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది.
కేసులు నమోదు
బాధితురాలి సమస్యలపై కలెక్టర్ వాకాటి కరుణ పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. విలేకరి వెంకట్‌పై అదనపు కట్నంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిల్లల చదువులకు ఇబ్బంది రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తదుపరి చర్యల కోసం వరంగల్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు.