వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్ | Bollywood Actress Sonali Bendre Shocking Comments On Producers | Sakshi
Sakshi News home page

Sonali Bendre: 'హీరోలతో ఎఫైర్స్‌.. కావాలని వాళ్లే ఆ పని చేసేవారు'

Published Fri, May 3 2024 1:37 PM | Last Updated on Fri, May 3 2024 3:33 PM

Bollywood Actress  Sonali Bendre Shocking Comments On Producers

బాలీవుడ్‌ భామ సోనాలి బింద్రే తెలుగువారికి సైతం సుపరిచితమే. మహేశ్ బాబు సరసన మురారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మెగాస్టార్ మూవీ ఇంద్ర, నాగార్జునతో మన్మధుడు చిత్రాలతో సూపర్ హిట్స్‌ తన ఖాతాలో వేసుకుంది. అయిత 2002లోనే నిర్మాత,వ్యాపార వేత్త అయినా గోల్డీబెల్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది. చివరిసారిగా 2022లో లవ్ యూ హమేశా చిత్రంలో కనిపించింది. 90ల్లో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇటీవల ది బ్రోకెన్‌ న్యూస్‌ సీజన్‌-2తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.  ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి నిర్మాతలపై సంచలన కామెంట్స్ చేశారు.

సోనాలి బింద్రే మాట్లాడుతూ.. '1994లో నేను ఇండస్ట్రీలోకి వచ్చా. ఇప్పటికంటే అప్పటి  పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా ఉండేవి. అప్పట్లో సహనటులతో నాపై ఎన్నో రూమర్స్‌ సృష్టించారు. కానీ వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి నిజం లేదు. ఇప్పటికీ ఈ చెత్త ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది. 1990ల్లో సినిమా నిర్మాతలే కావాలనే హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్‌ క్రియేట్‌ చేసేవారు. వాటిని మీడియాకు చెప్పేవాళ్లు. సినిమా ప్రమోషన్స్‌ కోసం ఈ విధంగా చేసేవారని తెలిసి ఆశ్చర్యపోయా'  అని తెలిపారు.

అయితే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో సన్నగా ఉన్నందుకు అవహేళన చేసేవారని సోనాలి బింద్రే తెలిపారు. ఆ రోజుల్లో హీరోయిన్లు కాస్తా బొద్దుగా ఉండేవారని పేర్కొన్నారు. నేను సన్నాగా విషయాన్ని కొందరు నిర్మాతలు మొహం మీదే చెప్పేవారని వెల్లడించింది. నేను అలాంటివాటిని పట్టించుకునే దాన్ని కాదని వివరించింది. అంతేకాదు.. ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని..  నటనలోనూ ఎలాంటి శిక్షణ తీసుకోలేదని.. అసలు స్టార్‌ హీరోయిన్‌గా అవుతానని ఊహించలేదని సోనాలి ఆ రోజులను మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement