పెళ్లైన మూడు నెలలకే భార్యను హతమార్చాడు | Husband kills wife for additional dowry in jeedimetla | Sakshi
Sakshi News home page

పెళ్లైన మూడు నెలలకే భార్యను హతమార్చాడు

Published Thu, Oct 16 2014 8:45 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Husband kills wife for additional dowry in jeedimetla

హైదరాబాద్ : హైదరాబాద్ జీడిమెట్ల శ్రీరామ్నగర్లో దారుణం జరిగింది. వరకట్నం వేధింపులకు ఓ గృహిణి బలైంది. అదనపు కట్నం కోసం పెళ్లైన మూడు నెలలకే కట్టుకున్న భార్యను హతమార్చాడో భర్త. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే శ్రీరామ్ నగర్కు చెందిన పెయింటర్ ఇజాజ్కు మెదక్ జిల్లా తండుమూరు గ్రామానికి చెందిన మున్నీసా బేగంతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. 

 

పెళ్లి సమయంలో ఇజాజ్కు లక్ష రూపాయిలకు పైగా కట్నం ఇచ్చారు. అయినా  అతడు అదనపు కట్నం తీసుకు రావాలని మున్నీసా బేగాన్ని వేధించసాగాడు. అయితే అందుకు ఆమె నిరాకరించటంతో విచక్షణ కోల్పోయిన ఇజాజ్ బుధవారం అర్థరాత్రి భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు మృతురాలి బంధువులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement