భార్య, కుమారుడ్ని చంపి గోనె సంచుల్లో కుక్కి.. | Man kills wife and son | Sakshi
Sakshi News home page

భార్య, కుమారుడ్ని చంపి గోనె సంచుల్లో కుక్కి..

Published Fri, Feb 19 2016 3:32 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

Man kills wife and son

కడప : భార్య, కుమారుడిని కిరాతకంగా చంపిన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కడప పట్టణంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గత డిసెంబర్ 11న నాగేశ్వరి, ఆమె కుమారుడు ప్రణీత్‌ రాజు కడపలోని మరియాపురం ప్రాంతం నుంచి అదృశ్యమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నాగేశ్వరి భర్త ప్రవీణ్‌ కుమార్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించగా.. నిందితుడు నిజాన్ని బయటపెట్టాడు.

తానే, బంధువుల సహకారంతో భార్య నాగేశ్వరి, కుమారుడు ప్రణీత్‌ రాజులను హత్య చేసి మృతదేహాలను గోనె సంచుల్లో కుక్కి పట్టణ శివారులోని పాలకొండ వద్ద పూడ్చిపెట్టినట్టు వెల్లడించాడు. దీంతో పోలీసులు సదరు ప్రాంతం నుంచి రెండు మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అప్పగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement